Skip to main content

India-Asia-Xpress: ఓషియన్‌ కనెక్ట్‌ మాల్దీవ్స్‌తో జత కట్టిన సంస్థ?

Internet Cable and Jio

ఇండియా–ఆసియా–ఎక్స్‌ప్రెస్‌(ఐఏఎక్స్‌) అండర్‌సీ కేబుల్‌ సిస్టమ్‌ను మాల్దీవుల్లోని హల్‌హమాలే వద్ద భూభాగంపైకి చేర్చనున్నట్లు దేశీ టెలికం రిలయన్స్‌ దిగ్గజం జియో తాజాగా తెలిపింది. ఇందుకోసం ఓషియన్‌ కనెక్ట్‌ మాల్దీవ్స్‌(ఓసీఎమ్‌) ప్రైవేట్‌ లిమిటెడ్‌తో జియో జత కట్టింది. ఫిబ్రవరి 21న రిలయన్స్‌ జియో ప్రెసిడెంట్‌ మాథ్యూ ఊమెన్, ఓసీఎమ్‌ చైర్‌పర్సన్‌ రియాజ్‌ మన్సూర్‌ ఇందుకు సంబంధించిన ఒప్పందంపై సంతకాలు చేశారు. అత్యంత సమర్థమంతమైన, వేగవంతమైన ఈ ఐఏఎక్స్‌ సిస్టమ్‌..  హల్‌హమాలేను భారత్, సింగపూర్‌ వంటి ప్రధాన ఇంటర్నెట్‌ హబ్‌లకు అనుసంధానం చేస్తుందని జియో తెలిపింది.

ముంబైలో ప్రారంభమై..
ఐఏఎక్స్‌ సిస్టమ్‌ ముంబైలో ప్రారంభమై మలేషియా, థాయ్‌లాండ్‌ మీదుగా సింగపూర్‌ చేరుతుంది. ఇక ఇండియా–యూరప్‌–ఎక్స్‌ప్రెస్‌ (ఐఈఎక్స్‌) సిస్టమ్‌.. ముంబై నుంచి మధ్యప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికా దేశాల మీదుగా ఇటలీలోని మిలన్‌కి చేరుతుంది. ఐఏఎక్స్‌ 2023 ఆఖరు నాటికి, ఐఈఎక్స్‌ 2024 మధ్యలో అందుబాటులోకి రావచ్చని అంచనా. ఇవి 16,000 కిలోమీటర్ల మేర సెకనుకు 100 గిగాబైట్ల వేగంతో నెట్‌ అందించగలవు.

చ‌ద‌వండి: ఎస్‌ఈఏ–ఎంఈ–డబ్ల్యూఈ–6తో జట్టు కట్టిన సంస్థ?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ఓషియన్‌ కనెక్ట్‌ మాల్దీవ్స్‌(ఓసీఎమ్‌) ప్రైవేట్‌ లిమిటెడ్‌తో ఒప్పందం చేసుకున్న టెలికం సంస్థ?
ఎప్పుడు : ఫిబ్రవరి 21
ఎవరు    : రిలయన్స్‌ జియో 
ఎందుకు : ఇండియా–ఆసియా–ఎక్స్‌ప్రెస్‌(ఐఏఎక్స్‌) అండర్‌సీ కేబుల్‌ సిస్టమ్‌తో మాల్దీవుల్లోని హల్‌హమాలేను అనుసంధానం చేసే ప్రక్రియలో భాగంగా..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 22 Feb 2022 04:15PM

Photo Stories