Skip to main content

RBI: షాకింగ్... రెండు బ్యాంకుల లైసెన్స్ ర‌ద్దు... ఇందులో డ‌బ్బులుంటే మాత్రం...

మహారాష్ట్ర, కర్ణాటకలోని రెండు సహకార బ్యాంకుల బ్యాంకింగ్ లైసెన్సులను రద్దు చేసినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. మహారాష్ట్ర బుల్ధానా కేంద్రంగా ఉన్న మల్కాపుర్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ (Malkapur Urban Co-operative Bank Ltd), బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న 'శుష్రుతి సౌహార్ద సహకార బ్యాంక్' (Shushruti Souharda Sahakara Bank) లైసెన్సులను ఆర్‌బీఐ రద్దు చేసింది. బుధవారం రోజు నుంచి బ్యాంకింగ్ లావాదేవీలు జరగకుండా సీజ్ చేసింది.
RBI
రెండు బ్యాంకుల లైసెన్స్ ర‌ద్దు... ఇందులో డ‌బ్బులుంటే మాత్రం...

ఈ రెండు కో-ఆపరేటివ్ బ్యాంకులు బుధవారం వ్యాపారం ముగిసినప్పటి నుంచి బ్యాంకింగ్ వ్యాపారాన్ని నిలిపివేస్తున్నట్లు ఆర్బీఐ రెండు వేర్వేరు ప్రకటనల్లో తెలిపింది. ఈ బ్యాంకులకు తగినంత మూలధనం, సంపాదన అవకాశాలు లేవని, ప్రస్తుత ఆర్థిక పరిస్థితితో డిపాజిటర్లకు పూర్తి స్థాయిలో చెల్లించేందుకు స‌రిప‌డ న‌గ‌దు ల‌భ్య‌త బ్యాంకుల్లో లేద‌ని ఆర్బీఐ తెలిపింది.

☛ Rahul Gandhi: రాహుల్‌గాంధీకి మ‌ళ్లీ నిరాశే... త‌రువాతి స్టెప్ ఏంటి...?

​​​​​​​లైసెన్స్ క్యాన్సిల్ అయినప్పటికీ డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (DICGC) కింద రూ. 5 లక్షల వరకు డిపాజిట్ ఇన్సూరెన్స్ అమౌంట్ క్లైమ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అంటే ఈ రెండు బ్యాంకుల్లో ఐదు ల‌క్ష‌ల రూపాయ‌ల లోపు డిపాజిట్ చేసిన మొత్తానికి ఇన్సూరెన్స్ వ‌ర్తిస్తుంది. ఐదు ల‌క్ష‌ల కంటే ఎక్కువ డిపాజిట్ చేసిన వారికి ఐదు ల‌క్ష‌ల మేర‌కే ఇన్సూరెన్స్ వ‌స్తుంది. 

☛ వరల్డ్ కప్‌లో భారత్ ఆడ‌నున్న మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే...

ఆర్‌బీఐ వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. మల్కాపుర్ సహకార బ్యాంక్ 97.60 శాతం మంది డిపాజిటర్లకు బీమా వ‌ర్తిస్తుంది. అంటే వీరికి సుమారు రూ.496.98 కోట్లు చెల్లించింది. అదే సమయంలో కర్ణాటక శుష్రుతి సౌహార్ద సహకార బ్యాంక్‌లో 91.92 శాతం మంది డిపాజిటర్లకు బీమా వ‌ర్తిస్తుంది. ఈ ఏడాది చివ‌రి నాటికి ఈ బ్యాంకు ఖాతాదారుల‌కు బీమా కింద‌ రూ.54.16 కోట్లు చెల్లించింది. మిగిలిన ఖాతాదారులకు సంబంధించిన చెల్లింపుల‌పై స్ప‌ష్ట‌త రావాల్సి ఉంది. 

Published date : 07 Jul 2023 05:40PM

Photo Stories