RBI Deputy Governor: ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ పదవీకాలం పొడిగింపు
Sakshi Education
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్ ఎం.రాజేశ్వర్ రావు పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం ఏడాది పాటు పొడిగించింది.

ఈ మేరకు కేంద్ర కేబినెట్ నియామకాల సంఘం (ఏసీసీ) రాజేశ్వర్ రావు పునర్నియామకానికి ఆమోదం తెలిపింది.
2024 అక్టోబర్ 9 నుంచి ఏడాది పాటు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకూ ఆయన పదవీకాలం కొనసాగుతుందని ఏసీసీ పేర్కొంది. 2020 అక్టోబర్‌లో డిప్యూటీ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు. 1984లో ఆర్‌బీఐలో చేరిన ఆయన పలు కీలక పదవులు నిర్వహించారు.
ప్రస్తుతం ఆర్‌బీఐలో ఎండీ పత్రా, ఎం రాజేశ్వర రావు, టీ రవి శంకర్, జే స్వామినాథన్ డిప్యూటీ గవర్నర్లుగా ఉన్నారు.
Arti Sarin: AFMS డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించిన మొదటి మహిళ
Published date : 08 Oct 2024 10:34AM