Shaktikanta Das: మరోసారి A+ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్‌గా శక్తికాంత దాస్!
అమెరికాకు చెందిన గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ ద్వారా ఆయన టాప్ సెంట్రల్ బ్యాంకర్‌గా ర్యాంక్ పొందడం ఇది వరుసగా రెండో సంవత్సరం.
A+ రేటింగ్ పొందిన ముగ్గురు సెంట్రల్ బ్యాంక్ గవర్నర్‌ల జాబితాలో శక్తికాంత దాస్ అగ్రస్థానంలో నిలిచారు. మిగిలిన ఇద్దరు సెంట్రల్ బ్యాంక్ గవర్నర్లు డెన్మార్క్‌కు చెందిన క్రిస్టియన్ కెటెల్ థామ్‌సెన్ మరియు స్విట్జర్లాండ్‌కు చెందిన థామస్ జోర్డాన్.
యూఎస్‌లోని వాషింగ్టన్ డీసీలో శక్తికాంత దాస్‌కు గ్లోబల్ ఫైనాన్స్ ఈ అవార్డును అందించింది. సంక్లిష్ట ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనే సమయంలో, భారతదేశ అపెక్స్ బ్యాంక్‌ను నడిపించడంలో ఆయన అద్భుతమైన పనితీరు మరియు సమర్థవంతమైన నాయకత్వం ప్రదర్శించారని ఈ సంస్థ గుర్తించింది.
Best Bank in India: భారత్‌లో అత్యుత్తమ బ్యాంక్‌గా 'ఎస్‌బీఐ'
గ్లోబల్ ఫైనాన్స్ 1994 నుంచి సెంట్రల్ బ్యాంక్ రిపోర్ట్ కార్డ్స్‌ను ప్రతి సంవత్సరం విడుదల చేస్తుంది. ఇందులో యూరోపియన్ యూనియన్, ఈస్టర్న్ కరీబియన్ సెంట్రల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ సెంట్రల్ ఆఫ్రికన్ స్టేట్స్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ వెస్ట్ ఆఫ్రికన్ స్టేట్స్ సహా దాదాపు 100 దేశాల కేంద్ర బ్యాంక్ గవర్నర్‌లకు ఇందులో ర్యాంకులు కేటాయిస్తారు.