Ombudsman Scheme: ప్రధాని మోదీ ప్రారంభించిన ఆర్‌బీఐ రిటైల్ డైరెక్ట్ స్కీమ్ ఉద్దేశం?
రిటైల్ ఇన్వెస్టర్లకు ప్రభుత్వ సెక్యూరిటీ మార్కెట్‌ను మరింత అందుబాటులోకి తేవడానికి ఉద్దేశించిన ‘ఆర్‌బీఐ రిటైల్ డైరెక్ట్ స్కీమ్’ ప్రారంభమైంది. అలాగే సెంట్రల్ బ్యాంక్ రెగ్యులేట్ చేస్తున్న సంస్థలపై కస్టమర్ల ఫిర్యాదులను వేగవంతంగా పరిష్కరించడానికి ఉద్ధేశించిన ‘ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్‌మెన్ స్కీమ్’ కూడా ప్రారంభమైంది. ఈ రెండు పథకాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నవంబర్ 12న వర్చువల్ విధానం ద్వారా ఢిల్లీ నుంచి ఆవిష్కరించారు. సురక్షితమైన వ్యవస్థ ద్వారా క్యాపిటల్ మార్కెట్లలో సులువుగా ఇన్వెస్ట్ చేయడానికి రిటైల్ డైరెక్ట్ స్కీమ్ తోడ్పడగలదని ఈ సందర్భంగా ప్రధాని తెలిపారు.
ఆర్‌బీఐ రిటైల్ డైరెక్ట్ స్కీమ్:
ఈ పథకం ద్వారా ఇప్పటిదాకా బ్యాంకులు, బీమా కంపెనీల్లాంటి పెద్ద సంస్థలకు మాత్రమే అందుబాటులో ఉంటున్న ప్రభుత్వ బాండ్లను ఇకపై చిన్న స్థాయి రిటైల్ ఇన్వెస్టర్లు కూడా కొనుగోలు చేయొచ్చు. ఇందుకోసం ఆర్‌బీఐ వద్ద ఆన్‌లైన్ రిటైల్ డైరెక్ట్ గిల్ట్ అకౌంట్ (ఆర్‌డీజీ ఖాతా) తెరవాల్సి ఉంటుంది.
సమగ్ర అంబుడ్స్‌మన్ స్కీమ్ 2021:
- ఈ పథకం ద్వారా రిజర్వ్ బ్యాంక్ పరిధిలో పనిచేసే ఆర్థిక సంస్థలు అందించే సేవల్లో లోపాలకు సంబంధించి వివిధ సంస్థల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఒకే చోట(ఒకే అంబుడ్స్‌మన్‌కు) ఫిర్యాదు చేయొచ్చు.
- ప్రస్తుతం బ్యాంకులు, నాన్–బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు, పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్లు వంటి వాటికి వేర్వేరుగా అంబుడ్స్‌మన్ ఉంటున్నారు. వీటికి సంబంధించిన బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్ స్కీమ్ 2006, అంబుడ్స్‌మన్ స్కీమ్ ఫర్ నాన్–బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ 2018, అంబుడ్స్‌మన్ స్కీమ్ ఫర్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ 2019 అనే 3 స్కీములను కలిపి కొత్తగా సమగ్ర అంబుడ్స్‌మన్ స్కీమ్ 2021ను రూపొందించారు.
చదవండి: తపాలా శాఖతో భాగస్వామ్యం చేసుకున్న సంస్థ?
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆర్‌బీఐ రిటైల్ డైరెక్ట్ స్కీమ్, ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్‌మెన్ స్కీమ్ ప్రారంభం
ఎప్పుడు : నవంబర్ 14
ఎవరు : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
ఎందుకు : రిటైల్ ఇన్వెస్టర్లకు ప్రభుత్వ సెక్యూరిటీ మార్కెట్‌ను మరింత అందుబాటులోకి తేవడానికి, సెంట్రల్ బ్యాంక్ రెగ్యులేట్ చేస్తున్న సంస్థలపై కస్టమర్ల ఫిర్యాదులను వేగవంతంగా పరిష్కరించడానికి...
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్