Skip to main content

India Post Payments Bank: తపాలా శాఖతో భాగస్వామ్యం చేసుకున్న సంస్థ?

IPPB

భారతీయ తపాలా శాఖ (పోస్టల్‌ విభాగం), తపాలా శాఖ పరిధిలోని ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ (ఐపీపీబీ)తో బజాజ్‌ అలియాంజ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ భాగస్వామ్యం కుదుర్చుకుంది. గ్రామీణ ప్రాంత కస్టమర్లను చేరువ అయ్యేందుకు వీలుగా రెండు ఉత్పత్తులును ఆవిష్కరించింది. టర్మ్, యాన్యుటీ ప్లాన్లను ఐపీపీబీ కస్టమర్లకు ఆఫర్‌ చేయనుంది.

భారత సెయిలర్‌ నేత్రకు స్వర్ణం

స్పెయిన్‌ వేదికగా జరిగిన గ్రాన్‌ కెనేరియా సెయిలింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత మహిళా సెయిలర్‌ నేత్రా కుమనన్‌ స్వర్ణ పతకంతో మెరిసింది. ఆరు రేసుల పాటు జరిగిన లేజర్‌ రేడియల్‌ క్లాస్‌ ఈవెంట్‌లో బరిలోకి దిగిన ఆమె 10 నెట్‌ పాయింట్లు సాధించి స్వర్ణ పతకాన్ని అందుకుంది. బెనీటో లాంచో రజతాన్ని, మార్టినా రినో కాంస్యాన్ని సాధించారు.
 

చ‌ద‌వండి: డిజిటల్‌ పేమెంట్స్‌పై ఆర్‌బీఐ నిర్వహించనున్న హ్యాకథాన్‌ పేరు?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : భారతీయ తపాలా శాఖ (పోస్టల్‌ విభాగం), తపాలా శాఖ పరిధిలోని ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ (ఐపీపీబీ)తో భాగస్వామ్య ఒప్పందం
ఎప్పుడు : నవంబర్‌ 10
ఎవరు : బజాజ్‌ అలియాంజ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ
ఎందుకు : గ్రామీణ ప్రాంత కస్టమర్లను చేరువ అయ్యేందుకు వీలుగా..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 12 Nov 2021 03:19PM

Photo Stories