Payments System: డిజిటల్ పేమెంట్స్‌పై ఆర్‌బీఐ నిర్వహించనున్న హ్యాకథాన్ పేరు?
స్మార్ట్ డిజిటల్ చెల్లింపుల థీమ్‌తో తొలిసారిగా అంతర్జాతీయ స్థాయి హ్యాకథాన్ నిర్వహిస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) వెల్లడించింది. హార్బింజర్ 2021(HARBINGER 2021) పేరిట నిర్వహించే ఈ హ్యాకథాన్‌లో పాల్గొనేందుకు 2021, నవంబర్ 15 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయని నవంబర్ 9న తెలిపింది. ఈ హ్యాకథాన్ పాల్గొనే వారు ఒకవైపు డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ భద్రతను పటిష్టం చేయడంతో పాటు చెల్లింపులను మరింత సులభతరం చేసేందుకు, డిజిటల్ పేమెంట్స్ విధానాలను అన్ని వర్గాలకు అందుబాటులోకి తెచ్చేందుకు తగు పరిష్కార మార్గాలను రూపొందించాల్సి ఉంటుంది. విజేతకు రూ. 40 లక్షలు, రన్నర్అప్కు రూ. 20 లక్షల బహుమతి ఉంటుంది.
చదవండి: ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్‌లో చైనాను అధిగమించిన దేశం?
క్విక్ రివ్యూ :
ఏమిటి : హార్బింజర్ 2021 పేరుతో అంతర్జాతీయ స్థాయి హ్యాకథాన్ నిర్వహణ
ఎప్పుడు : నవంబర్ 9
ఎవరు : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ)
ఎందుకు : డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ భద్రతను పటిష్టం చేయడంతో పాటు చెల్లింపులను మరింత సులభతరం చేసేందుకు...
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్