SBI Report: ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్‌లో చైనాను అధిగమించిన దేశం?
ప్రజలందరికీ ఆర్థిక వ్యవస్థ భాగస్వామ్యం (ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్) విషయంలో చైనాను భారత్ అధిగమించిందని ఒక నివేదిక పేర్కొంది. పెద్ద నోట్ల రద్దు ఐదవ వార్షికోత్సవం సందర్భంగా బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) గ్రూప్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ సౌమ్య కాంతి ఘోష్ ఈ మేరకు ఒక నివేదికను రూపొందించారు. నల్లధనాన్ని అరికట్టే దిశగా రూ. 500, రూ. 1,000 నోట్లను రద్దు చేస్తున్నట్లు 2016 నవంబర్ 8న ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే.
నివేదికలోని ముఖ్యాంశాలు...
- భారత్‌లో మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ లావాదేవీల సంఖ్య 2015లో వెయ్యి మందికి 183. 2020లో ఈ సంఖ్య 13,615కు చేరింది. ఇక బ్యాంక్ శాఖల సంఖ్య లక్ష మంది పెద్దలకు 13.6 ఉంటే, ఇది 2020 నాటికి 14.7కు ఎగసింది. ఈ గణాంకాలు జర్మనీ, చైనా, దక్షిణాఫ్రికా కంటే ఎక్కువ.
- ఆర్థిక వ్యవస్థలో అందరికీ భాగస్వామ్యం, బ్యాంకు ఖాతాల విషయంలో ముందున్న రాష్ట్రాల్లో మద్యం, పొగాకు వినియోగం గణనీయంగా తగ్గాయి. నేరాలూ తగ్గుముఖం పట్టాయి. ఆర్థికాభివృద్ధి విషయంలో ఆయా రాష్ట్రాలు మిగిలిన రాష్ట్రాలకంటే ముందున్నాయి.
- జన్ ధన్ వంటి నో–ఫ్రిల్స్ (చార్జీలు లేని) ఖాతాల పథకం కింద, బ్యాంకుల వద్ద డిపాజిట్ ఖాతాలను కలిగి ఉన్న వ్యక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది.
- అందరికీ ఆర్థిక వ్యవస్థలో భాగంగా గత ఏడు సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధిని పరిశీలిస్తే, 2021 అక్టోబర్ 20వ తేదీ నాటికి డిపాజిట్ల పరిమాణం రూ. 1.46 లక్షల కోట్లకు చేరగా, నో–ఫ్రిల్స్ బ్యాంక్ ఖాతాల సంఖ్య 43.7 కోట్లకు ఎగసింది.
చదవండి: లాజిస్టిక్స్ సూచీలో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం?
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్