Logistics Performance Index 2021: లాజిస్టిక్స్ సూచీలో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం?
కేంద్ర వాణిజ్య శాఖ నవంబర్ 8న విడుదల చేసిన లాజిస్టిక్స్ సర్వీసుల పనితీరు సూచీ–2021లో గుజరాత్ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. దేశంలోని 21 రాష్ట్రాల్లో లాజిస్టిక్స్ వ్యవస్థ, వివిధ వర్గాలు ఎదుర్కొంటున్న సవాళ్లు, వాటిని పరిష్కరించేందుకు సూచనలు మొదలైన అంశాలతో రూపొందించిన ఈ సూచీని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పియుష్ గోయల్ ఆవిష్కరించారు. సూచీకి సంబంధించి మొత్తం 21 అంశాల్లో వివిధ రాష్ట్రాల పనితీరును కేంద్రం మదింపు చేసింది. 2021 ఏడాది మే–ఆగస్టు మధ్య కాలంలో ఇందుకోసం సర్వే నిర్వహించింది. ప్రస్తుతం లాజిస్టిక్స్ వాటా స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ) 13–14 శాతం స్థాయిలో ఉన్నాయి.
ఏపీకి తొమ్మిదో స్థానం...
కేంద్రం విడుదల చేసిన లాజిస్టిక్స్ సర్వీసుల సూచీ–2021లో 21 రాష్ట్రాలు ఉన్నాయి. వీటిలో గుజరాత్ తర్వాత స్థానాల్లో హరియాణ(2), పంజాబ్ (3), తమిళనాడు (4), మహారాష్ట్ర (5) నిల్చాయి. టాప్ 10లో ఉత్తర్ ప్రదేశ్ (6), ఒరిస్సా (7), కర్ణాటక (8), ఆంధ్రప్రదేశ్ (9), తెలంగాణ (10) రాష్ట్రాలు ఉన్నాయి. గుజరాత్ రాష్ట్రంలో తొలిస్థానంలో నిలవడం ఇది వరుసగా మూడోసారి.
చదవండి: ఏ కార్యక్రమం కింద భారత సంస్థలకు గూగుల్ సాయం చేయనుంది?
క్విక్ రివ్యూ :
ఏమిటి : లాజిస్టిక్స్ సర్వీసుల పనితీరు సూచీ–2021లో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం?
ఎప్పుడు : నవంబర్ 8
ఎవరు : గుజరాత్
ఎక్కడ : దేశంలోని 21 రాష్ట్రాల్లో...
ఎందుకు : ఎగుమతులు, ఆర్థిక వృద్ధికి ఊతంగా నిలిచే లాజిస్టిక్స్ సర్వీసుల పనితీరులో ఉత్తమ పనితీరు కనబరిచినందున...
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్