Skip to main content

Funding: ఏ కార్యక్రమం కింద భారత సంస్థలకు గూగుల్‌ సాయం చేయనుంది?

Google

మహిళలు, ఆడపిల్లలకు సంబంధించి ‘ఇంపాక్ట్‌ చాలెంజ్‌’ కార్యక్రమం కింద సాయం చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా 34 సంస్థలను గూగుల్‌ డాట్‌ ఓఆర్‌జీ ఎంపిక చేసింది. ఇందులో భారత్‌కు చెందిన మూడు స్వచ్చంద సంస్థలు కూడా ఉన్నాయి. గూగుల్‌కు చెందిన దాతృత్వ కార్యక్రమాల సంస్థే గూగుల్‌ డాట్‌ ఓఆర్‌జీ. భారత్‌ నుంచి సంహిత–సీజీఎఫ్, ప్రథమ్‌ ఎడ్యుకేషన్‌ ఫౌండేషన్, స్వ తలీమ్‌ ఫౌండేషన్‌ సంయుక్తంగా 2.5 మిలియన్‌ డాలర్లు (రూ.18.75 కోట్లు) ఆర్థిక సాయాన్ని గూగుల్‌ డాట్‌ ఓఆర్‌జీ నుంచి అందుకోనున్నాయి. ఈ సంస్థలన్నీ కూడా.. నైపుణ్యాభివృద్ధి, కెరీర్‌లో పురోగతి, ఎంర్‌ప్రెన్యుర్‌షిప్, వ్యాపారం, విద్య, ఆర్థిక స్వాతంత్య్రం, మద్దతు అనే అంశాలపై దృష్టి సారించాయని గూగుల్‌ డాట్‌ ఓఆర్‌జీ నవంబర్‌ 8న ఓ ప్రకటన విడుదల చేసింది.

  • సంహిత–సీజీఎఫ్‌: సంహిత–సీజీఎఫ్‌ ‘రివైవ్‌ అలయన్స్‌’ ప్రాజెక్ట్‌కు గూగుల్‌ డాట్‌ ఓఆర్‌జీ నుంచి 8 లక్షల డాలర్ల సాయం లభించనుంది. ఈ నిధితో 10వేల మంది మహిళలకు సాయం అందించే లక్ష్యాన్ని సంహిత పెట్టుకుంది.
  • ప్రథమ్‌ ఎడ్యుకేషన్‌: ప్రథమ్‌ ఎడ్యుకేషన్‌ గుగూల్‌ ఒక మిలియన్‌ డాలర్ల సాయాన్ని పొందనుంది. దీని ద్వారా 7,000 మందికిపైగా గ్రామీణ యువతులకు బ్యూటీ, ఆరోగ్య సంరక్షణ, మెకానిక్స్, ఎలక్ట్రికల్‌ పరిశ్రమల్లో పనిచేసే విధంగా నైపుణ్యాలపై శిక్షణ ఇవ్వనుంది.
  • స్వ తలీమ్‌ ఫాండేషన్‌: స్వ తలీమ్‌ ఫాండేషన్‌ గూగుల్‌ నుంచి లభించే 7 లక్షల డాలర్ల సాయంతో గ్రామీణ మహిళలు, ఆడపిల్లలకు టెక్నాలజీ పెద్దగా అవసరం లేని స్పీకర్‌ ఫోన్లు తదితర మార్గాల ద్వారా మ్యాథ్స్, సైన్స్, ఆర్థిక అవగాహన తదితర అంశాల్లో శిక్షణ ఇవ్వనుంది.

చ‌ద‌వండి: బ్రిక్‌వర్క్‌ రేటింగ్స్‌ అంచనాల ప్రకారం... భారత్‌ వృద్ధి రేటు?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : మహిళలు, ఆడపిల్లలకు సంబంధించి ఇంపాక్ట్‌ చాలెంజ్‌ కార్యక్రమం కింద సాయం చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా 34 సంస్థల ఎంపిక
ఎప్పుడు : నవంబర్‌ 8
ఎవరు    : గూగుల్‌కు చెందిన దాతృత్వ కార్యక్రమాల సంస్థే గూగుల్‌ డాట్‌ ఓఆర్‌జీ 
ఎందుకు : ఈ సంస్థలన్నీ.. నైపుణ్యాభివృద్ధి, కెరీర్‌లో పురోగతి, విద్య, ఆర్థిక స్వాతంత్య్రం వంటి అంశాలపై దృష్టి సారించినందున...

డౌన్‌లోడ్‌ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 09 Nov 2021 01:09PM

Photo Stories