GDP Growth: బ్రిక్‌వర్క్ రేటింగ్స్ అంచనాల ప్రకారం... భారత్ వృద్ధి రేటు?
2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి అంచనాను దేశీయ రేటింగ్ ఏజెన్సీ బ్రిక్‌వర్క్ రేటింగ్స్ పెంచింది. 2021–22లో తొలుత 9 శాతం వృద్ధిని అంచనా వేయగా, దీనిని ఎగువముఖంగా 10 నుంచి 10.5 శాతం శ్రేణికి సవరించింది. అనేక ఆర్థిక వృద్ధి సూచికలు ఆర్థిక కార్యకలాపాల్లో ఊహించిన దాని కంటే వేగంగా పునరుద్ధరణను సూచిస్తున్నందునే వృద్ధి రేటును పెంచినట్లు బ్రిక్‌వర్క్ పేర్కొంది. ఈ మేరకు నవంబర్ 8న ఒక ప్రకటన విడుదల చేసింది.
చదవండి: విజిల్–బ్లోవర్ పోర్టల్‌ను ఆవిష్కరించిన కేంద్ర ప్రభుత్వ శాఖ?
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2021–22 ఏడాదిలో భారత్ వృద్ధి రేటు 10 నుంచి 10.5 శాతం శ్రేణిలో నమోదవుతుంది
ఎప్పుడు : నవంబర్ 8
ఎవరు : దేశీయ రేటింగ్ ఏజెన్సీ బ్రిక్‌వర్క్ రేటింగ్స్
ఎందుకు : అనేక ఆర్థిక వృద్ధి సూచికలు ఆర్థిక కార్యకలాపాల్లో ఊహించిన దాని కంటే వేగంగా పునరుద్ధరణను సూచిస్తున్నందునే...
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్