Skip to main content

EPS Pension: పింఛన్‌దారులకు శుభ‌వార్త‌.. పింఛను ఇకపై ఎక్కడి నుంచైనా..!

కేంద్ర ప్రభుత్వం ఈపీఎస్‌ పింఛన్‌దారులకు శుభవార్త చెప్పింది.
Pension Can Soon Be Withdrawn from Any Bank Branch

ఈపీఎఫ్‌వో నిర్వహణలోని ‘ఎంప్లాయీస్‌ పెన్షన్‌ స్కీమ్‌’ (ఈపీఎస్‌) 1995 కింద దేశవ్యాప్తంగా ఏ బ్యాంకు శాఖ నుంచి అయినా పింఛను పొందొచ్చని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ తెలిపారు. 2025 జనవరి నుంచి ఇది అమల్లోకి వస్తుందన్నారు. దీనివల్ల 78 లక్షల మంది పింఛన్‌దారులకు ప్రయోజనం కలగనుందన్నారు. 

ఈపీఎఫ్‌వో అత్యున్నత నిర్ణయాల మండలి అయిన ‘సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ ట్రస్టీస్‌’కు కార్మిక శాఖ మంత్రి చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తుంటారు. ఈపీఎస్‌ 1995 పరిధిలోని ఉద్యోగులకు కేంద్రీకృత పింఛను చెల్లింపుల వ్యవస్థ(సీపీపీఎస్‌)కు ఆమోదం తెలిపినట్టు మాండవీయ ప్రకటించారు. దీని ద్వారా ఏ బ్యాంక్‌ శాఖ నుంచి అయినా పింఛను చెల్లింపులకు వీలుంటుందన్నారు. 

పింఛనుదారులు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్లినప్పుడు పింఛను పేమెంట్‌ ఆర్డర్‌ (పీపీవో)ను బదిలీ చేసుకోవాల్సిన అవసరం ఉండదని తెలిపారు. ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) ఆధునికీకరణలో సీపీపీఎస్‌ ఓ మైలురాయిగా అభివర్ణించారు.

Economic Survey: కీలక ప్రకటన.. ఏడాదికి 78.5 లక్షల ఉద్యోగాలు!

Published date : 05 Sep 2024 05:58PM

Photo Stories