Skip to main content

GST New Rule: మే 1 నుంచి జీఎస్టీ కొత్త రూల్‌.. ఇక‌పై అలా కుదరదు!

కేంద్ర ఆర్థిక శాఖ మరో కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. వ్యాపార సంస్థలకు సంబంధించి కొత్త పరోక్ష పన్ను విధానం వస్తు సేవల పన్ను (జీఎస్టీ)లో కొత్త రూల్‌ మే 1వ తేదీ నుంచి అమల్లోకి తీసుకొస్తోంది.

రూ.100 కోట్లు, అంతకంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న వ్యాపార సంస్థలు తమ ఎలక్ట్రానిక్ ఇన్‌వాయిస్‌లను జారీ చేసిన 7 రోజులలోపు ఇన్‌వాయిస్ రిజిస్ట్రేషన్ పోర్టల్(ఐఆర్‌పీ)లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందని జీఎస్టీ నెట్‌వర్క్ తెలిపింది. ప్రస్తుతం వ్యాపార సంస్థలు తమ ఎలక్ట్రానిక్ ఇన్‌వాయిస్‌లను జారీ చేసిన తేదీతో సంబంధం లేకుండా ఐఆర్‌పీలో అప్‌లోడ్ చేస్తున్నాయి. ఇకపై అలా కుదరదు. రూ.100 కోట్లు, అంతకంటే ఎక్కువ వార్షిక టర్నోవర్ ఉన్న పన్ను చెల్లింపుదారులు ఈ-ఇన్‌వాయిస్ ఐఆర్‌పీ పోర్టల్‌లలో పాత ఇన్‌వాయిస్‌లను అప్‌లోడ్‌ చేయడానికి కాల పరిమితిని విధించాలని ప్రభుత్వం నిర్ణయించిన‌ట్లు జీఎస్టీ నెట్‌వర్క్ పేర్కొంది. ఈ కొత్త ఫార్మాట్ 2023 మే 1 నుంచి అమల్లో​కి వస్తుంది.  

Income Tax: ఆకర్షణీయంగా కొత్త ఆదాయపన్ను విధానం.. ఇక‌పై జీవిత బీమా పాలసీలపైనా ప‌న్ను..!

ఈ పరిమితి ఇన్‌వాయిస్‌లకు మాత్రమే వర్తిస్తుంది. డెబిట్ లేదా క్రెడిట్ నోట్‌లను నివేదించడంలో ఎలాంటి కాల పరిమితి లేదు. జీఎ‍స్టీ చట్టం ప్రకారం.. ఐఆర్‌పీలో ఇన్‌వాయిస్‌లు అప్‌లోడ్ చేయకపోతే వ్యాపార సంస్థలు ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) పొందలేవు. ప్రస్తుతం రూ.10 కోట్లు, అంతకంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న వ్యాపార సంస్థలు అన్ని బీ2బీ లావాదేవీల కోసం ఎలక్ట్రానిక్ ఇన్‌వాయిస్‌ను రూపొందించడం తప్పనిసరి. 
జీఎస్టీ చట్టం ప్రకారం.. 2020 అక్టోబర్ 1 నుంచి రూ. 500 కోట్ల కంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న కంపెనీలకు బిజినెస్-టు-బిజినెస్ లావాదేవీల కోసం ఈ-ఇన్‌వాయిస్‌ను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఆ తర్వాత 2021 జనవరి 1 నుంచి రూ.100 కోట్లకు పైగా టర్నోవర్ ఉన్న వారికి కూడా దీన్ని వర్తింపజేసింది. 2021 ఏప్రిల్ 1 నుంచి రూ.50 కోట్ల కంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న కంపెనీలు బీ2బీ ఈ-ఇన్‌వాయిస్‌లను సమర్పిస్తున్నాయి. అయితే 2022 ఏప్రిల్ 1 నుంచి ఆ పరిమితి రూ.20 కోట్లకు, 2022 అక్టోబర్ 1 నుంచి రూ.10 కోట్లకు తగ్గించారు.

Tax Relief: ట్యాక్స్ పేయర్లకు ఊరట.. నిర్మలా సీతారామన్ కీల‌క నిర్ణ‌యం!

Published date : 14 Apr 2023 03:35PM

Photo Stories