Tax Relief: ట్యాక్స్ పేయర్లకు ఊరట.. నిర్మలా సీతారామన్ కీలక నిర్ణయం!
Sakshi Education
ఆదాయం రూ.7 లక్షల కన్నా స్వల్పంగా ఎక్కువుండి, కొత్త పన్ను విధానాన్ని ఎంచుకునేవారికి కొంత ఊరటనిచ్చేలా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక నిర్ణయం తీసుకుంది.
రూ.7 లక్షల పరిమితిని దాటిన మొత్తానికి మాత్రమే పన్ను విధించేలా ఆర్థిక బిల్లును సవరించింది. కేంద్ర ఆర్థిక శాఖ వివరణ ప్రకారం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చే కొత్త పన్ను విధానం ప్రకారం రూ.7 లక్షల వరకు ఆదాయంపై పన్ను భారం ఉండదు. కానీ రూ.7,00,100 ఉంటే మాత్రం రూ.25,010 మేర పన్ను కట్టాల్సిరానుంది. అంటే రూ.100 ఆదాయానికి రూ.25,010 పన్ను భారం పడనుంది. ఈ నేపథ్యంలో పరిమితికన్నా ఆదాయం కాస్త ఎక్కువ ఉంటే, దానికి మించి పన్ను భారం ఉండరాదంటూ స్వల్ప ఊరటను ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే, ఎంత మేర అధిక ఆదాయానికి ఇది వర్తిస్తుందనేది ప్రభుత్వం నిర్దిష్టంగా వివరించలేదు. సుమారు రూ.7,27,700 వరకు ఆదాయం ఉన్న వారికి దీనితో ప్రయోజనం ఉండగలదని నాంగియా ఆండర్సన్ పార్ట్‌నర్ సందీప్ ఝున్‌ఝున్‌వాలా తెలిపారు.
Budget 2023 Highlights: కేంద్ర బడ్జెట్ 2023–24
Published date : 25 Mar 2023 05:59PM