FDIs: 2021–22లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల రికార్డు
![FDIs to India](/sites/default/files/images/2022/05/21/fdis-india-1653125678.jpg)
Telugu Current Affairs - Economy: భారత్ మార్చితో ముగిసిన 2021–22 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) నమోదుచేసింది. ఈ విలువ 83.57 బిలియన్ డాలర్లని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ మే 20న తెలిపింది. ఇంత స్థాయిలో దేశంలోకి ఎఫ్‌డీఐల ప్రవాహం ఇదే తొలిసారి. 2020–21లో ఈ విలువ 81.97 బిలియన్ డాలర్లుగా ఉంది.
Forbes Global 2000 List 2022: ఫోర్బ్స్ గ్లోబల్ 2000 జాబితాలో నిలిచిన కంపెనీ?
GK Economy Quiz: 2021-22 ఆర్థిక సంవత్సరంలో భారత ప్రభుత్వ వాణిజ్య లోటు?
అగ్రస్థానంలో సింగపూర్..
భారత్‌లో పెట్టుబడుల విషయానికి వస్తే, 2021–22 ఆర్థిక సంవత్సరం సింగపూర్ 27 శాతంతో అగ్రస్థానంలో ఉంది. తర్వాత వరుసలో అమెరికా (18 శాతం), మారిషస్ (16 శాతం) ఉన్నాయి. కంప్యూటర్ సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ రంగాలు గరిష్ట ప్రవాహాలను ఆకర్షించాయి. ఆ తర్వాత సేవల రంగం, ఆటోమొబైల్ పరిశ్రమ ఉన్నాయని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది.
RBI MPC Highlights: కీలక పాలసీ వడ్డీ రేటు అయిన రెపో రేటును ఎంత శాతం పెంచారు?
Digital Payments: 2026కల్లా డిజిటల్ లావాదేవీలు ఎన్ని కోట్ల డాలర్లకు చేరనున్నాయి?
GK International Quiz: US సైన్యం బాలికాటన్ 2022 అనే మిలిటరీ డ్రిల్‌ను ఏ దేశంతో కలిసి నిర్వహించింది?
World Economic Forum: డబ్ల్యూఈఎఫ్ టెక్‌లో చేరిన భారత స్టార్టప్‌లు?
క్విక్ రివ్యూ:
ఏమిటి : 2021–22లో అత్యధికంగా ఎఫ్‌డీఐలు పెట్టిన దేశం?
ఎప్పుడు : మే 20
ఎవరు : సింగపూర్
ఎక్కడ : భారత్
ఎందుకు: వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకునేందుకు..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్(Telugu Current Affairs), స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్