Skip to main content

Forbes Global 2000 List 2022: ఫోర్బ్స్‌ గ్లోబల్‌ 2000 జాబితాలో నిలిచిన కంపెనీ?

Reliance Industries

Forbes Global 2000 List 2022: 2022 సంవత్సరానికి గాను 2000 అగ్రశ్రేణి కంపెనీలతో రూపొందించిన ఈ జాబితా(గ్లోబల్‌ 2000 జాబితా)ను మే 13న ఫోర్బ్స్‌ మ్యాగజైన్‌ విడుదల చేసింది. అమ్మకాలు, లాభాలు, అసెట్లు, మార్కెట్‌ విలువ ఆధారంగా ఈ దిగ్గజాలకు ర్యాంకింగ్‌లు ఇచ్చినట్లు ఫోర్బ్స్‌ తెలిపింది. ఈ జాబితాలో దేశీ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 53వ ర్యాంకు దక్కించుకుంది. ప్రభుత్వ రంగ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 105వ ర్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 153వ స్థానం, ఐసీఐసీఐ బ్యాంక్‌ 204వ ర్యాంకు దక్కించుకున్నాయి.

GK Economy Quiz: ఇండియా డెట్ రిజల్యూషన్ కంపెనీ లిమిటెడ్ (IDRCL)లో ప్రభుత్వ రంగ బ్యాంకులు (PSBలు) కలిగి ఉండే గరిష్ట వాటా?

అగ్రస్థానంలో హాథ్‌వే..

  • గ్లోబల్‌ 2000 జాబితాలో ఇన్వెస్ట్‌మెంట్‌ గురు వారెన్‌ బఫెట్‌కు చెందిన బెర్క్‌షైర్‌ హాథ్‌వే అగ్రస్థానంలో నిలిచింది. 2003లో ఫోర్బ్స్‌ ఈ లిస్టును ప్రకటించడం ప్రారంభించినప్పట్నుంచి బఫెట్‌ కంపెనీ నంబర్‌ వన్‌ స్థానంలో నిలవడం ఇదే ప్రథమం.
  • ఇక గత తొమ్మిదేళ్లుగా అగ్రస్థానంలో ఉంటున్న ఇండస్ట్రియల్‌ అండ్‌ కమర్షియల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ చైనా తాజా లిస్టులో రెండో స్థానంలో నిల్చింది.
  • సౌదీ ఆరామ్‌కో, జేపీమోర్గాన్‌ చేజ్, చైనా కన్‌స్ట్రక్షన్‌ బ్యాంకు ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి.

తొలి భారతీయ కంపెనీగా..
ఫోర్బ్స్‌ గ్లోబల్‌ 2000 జాబితాలో దేశీ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ రెండు స్థానాలు ఎగబాకి 53వ ర్యాంకుకు చేరుకుంది. భారతీయ కంపెనీల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో రిలయన్స్‌ 104.6 బిలియన్‌ డాలర్ల ఆదాయం నమోదు చేసింది. తద్వారా 100 బిలియన్‌ డాలర్ల వార్షికాదాయాన్ని నమోదు చేసిన తొలి భారతీయ కంపెనీగా నిల్చిందని ఫోర్బ్స్‌ తెలిపింది. ఇక తాజా జాబితాలో చోటు దక్కించుకున్న భారతీయ సంస్థల్లో అత్యధికంగా ఇంధన, బ్యాంకింగ్‌ రంగ కంపెనీలే ఉన్నాయి.

ఫోర్బ్స్‌ గ్లోబల్‌ 2000 జాబితా–2022

ర్యాంకు

కంపెనీ

1

బెర్క్‌షైర్‌ హాథ్‌వే

2

ఇండస్ట్రియల్‌ అండ్‌ కమర్షియల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ చైనా

3

సౌదీ ఆరామ్‌కో

4

జేపీమోర్గాన్‌ చేజ్‌

5

చైనా కన్‌స్ట్రక్షన్‌ బ్యాంకు

53

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌

105

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా

153

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌

204

ఐసీఐసీఐ బ్యాంక్

228

ఓఎన్‌జీసీ

268

హెచ్‌డీఎఫ్‌సీ

357

ఐఓసీ

384

టీసీఎస్

407

టాటా స్టీల్

431

యాక్సిస్‌ బ్యాంక్‌

593

వేదాంత

1453

అదానీ ఎంటర్‌ప్రైజెస్‌

1568

అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్‌

1570

అదానీ గ్రీన్‌ ఎనర్జీ

1705

అదానీ ట్రాన్స్‌మిషన్‌

1746

అదానీ టోటల్‌​​​​​​​

World Economic Forum: డబ్ల్యూఈఎఫ్‌ టెక్‌లో చేరిన భారత స్టార్టప్‌లు?

​​​​​​​డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 14 May 2022 01:49PM

Photo Stories