World Hypertension Day 2024: మే 17న ప్రపంచ రక్తపోటు దినోత్సవం.. ఈ ఏడాది థీమ్ ఇదే..
ఈ దినోత్సవాన్ని మొదటిసారి 2005, మే 14వ తేదీ జరుపుకున్నారు. అయితే 2006 నుంచి ప్రతీ సంవత్సరం మే 17వ తేదీన ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.
ఈ సంవత్సరం థీమ్ "మీ రక్తపోటును ఖచ్చితంగా కొలవండి, దానిని నియంత్రించండి, ఎక్కువ కాలం జీవించండి(Measure Your Blood Pressure Accurately, Control It, Live Longer)".
రక్తపోటు స్థాయి సాధారణ స్థాయి కంటే పెరగడాన్నే హైపర్‌టెన్షన్ అంటారు. ఇది చాలా ప్రాణాంతకమైన వ్యాధి. అధిక రక్తపోటు లేదా హై బీపీను సైలెంట్ కిల్లర్ అని పిలుస్తారు. ఎందుకంటే ఇది వచ్చిన సంగతి కూడా వ్యక్తులు కనిపెట్టలేకపోవచ్చు.
వరల్డ్ హైపర్‌టెన్షన్ డేను 85 జాతీయ రక్తపోటు సంఘాలు లీగ్‌లతో కూడిన వరల్డ్ హైపర్ టెన్షన్ లీగ్ దీన్ని ప్రారంభించింది. హైపర్‌టెన్షన్‌పై అవగాహన పెంచేందుకు ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు.
World Football Day: మే 25వ తేదీ అంతర్జాతీయ ఫుట్‌బాల్ దినోత్సవం
హైపర్ టెన్షన్ లక్షణాలు ఇవే..
సాధారణంగా హైబీపీ కొన్ని లక్షణాలను చూపిస్తుంది. అయితే రక్తపోటుతో బాధపడుతున్న వ్యక్తులకు ఎటువంటి లక్షణాలు కనిపించవు. కానీ హైపర్‌టెన్షన్‌తో బాధపడుతున్న వారు స్ట్రోక్, గుండె జబ్బులు, మూత్రపిండాల రుగ్మతలు వంటి ఇతర ఆరోగ్య పరిస్థితుల ప్రమాదాన్ని కూడా ఎదుర్కొంటారు. అధిక ఒత్తిడి రక్తపోటుకు దారితీయవచ్చు.
అలాగే తీవ్రమైన తలనొప్పి, ఛాతి నొప్పి, గుండె వేగంగా కొట్టుకోవడం, తల తిరగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వికారం, వాంతులు, అస్పష్టమైన దృష్టి లేదా ఇతర దృష్టి మార్పులు, ఆందోళన, గందరగోళం, చెవుల్లో శబ్దాలు, ముక్కు రక్తస్రావం వంటివి కూడా దీనికి సంబంధించిన లక్షణాలే.
హైపర్ టెన్షన్ చికిత్స ఇదే..
➤ ఆహారంలో ఉప్పును బాగా తగ్గించడం.
➤ శారీరకంగా చురుగా ఉండటం.
➤ ధూమపానం, మద్యపానాన్ని మానేయడం.
➤ బరువు ఎక్కువగా ఉంటే తగ్గడం.
World Red Cross Day 2024: మే 8వ తేదీ ప్రపంచ రెడ్‌క్రాస్ దినోత్సవం
తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..
➤ కూరగాయలు పండ్లు ఎక్కువ తీసుకోవడం.
➤ గంటల తరబడి కూర్చోకుండా ఉండటం.
➤ నడక, పరుగు, ఈత, డ్యాన్స్ లేదా బరువులు ఎత్తడం లాంటి వ్యాయామాలు.
వారానికి కనీసం 150 నిమిషాల ఏరోబిక్ యాక్టివిటీ, లేదా వారానికి 75 నిమిషాల నడక ఉండాలి. ప్రతి వారం 2 లేదా అంతకంటే ఎక్కువ రోజులు వ్యాయామాలు చేయండి. తద్వారా ఊబకాయాన్ని తగ్గించుకోవచ్చు ఆరోగ్య నిపుణులు సూచించిన మందులను తీసుకోవాలి.
ఉప్పువల్లే ముప్పు అరి చెప్పిన డబ్ల్యూహెచ్‌వో..!
ఎక్కువ ఉప్పు వాడకం కారణంగానే ఏటా ప్రపంచవ్యాప్తంగా 25 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తెలిపింది.
ఉప్పు ఎక్కువగా వాడకం వల్ల అధిక రక్తపోటు, గుండె జబ్బులు, గుండెపోటు సంభవించే అవకాశం ఎక్కువగా ఉందని హెచ్చరించింది. రోజుకు ఒక టీ స్పూన్ కంటే ఎక్కువ ఉప్పు తింటే రక్తపోటు పెరుగుతుందని తెలిపింది.
World Press Freedom Day 2024: మే 3వ తేదీ ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం..
పెద్దలు సగటున రోజుకు 4310 మిల్లీ గ్రాములు (సుమారు 10.78 గ్రాముల ఉప్పుకు సమానం) సోడియం తీసుకుంటున్నారని, ఇది సిఫారసు చేసిన పరిమితి 2000 mg (సుమారు 5 గ్రాముల ఉప్పు) కంటే ఇది రెండింతలు ఎక్కువని డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది.