Skip to main content

Daily Current Affairs in Telugu: జ‌న‌వ‌రి 14th, 2023 కరెంట్‌ అఫైర్స్‌

Current Affairs in Telugu January 14th 2023 (డైలీ కరెంట్‌ అఫైర్స్‌ తెలుగులో): Current Affairs for All Competitive Exams In Telugu. Latest Articles useful for TSPSC &APPSC Group-1,2,3, 4, SSC, Bank, SI, Constable and all other competitive examinations

T20 World Cup: అండర్‌–19 మహిళల టి20 ప్రపంచకప్‌ టోర్నీ ప్రారంభం
దక్షిణాఫ్రికా వేదికగా జ‌న‌వ‌రి 14 నుంచి అండర్‌–19 మహిళల టి20 ప్రపంచకప్ ప్రారంభ‌మైంది. 16 జట్లు తలపడుతున్న ఈ టోర్నీ జ‌న‌వ‌రి 29న జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. గ్రూప్‌ ‘ఎ’లో ఆ్రస్టేలియా, బంగ్లాదేశ్, శ్రీలంక, అమెరికా; గ్రూప్‌ ‘బి’లో ఇంగ్లండ్, పాకిస్తాన్, జింబాబ్వే, రువాండా; గ్రూప్‌ ‘సి’లో ఇండోనేసియా, ఐర్లాండ్, న్యూజిలాండ్, వెస్టిండీస్‌; గ్రూప్‌ ‘డి’లో భారత్, దక్షిణాఫ్రికా, స్కాట్లాండ్, యూఏఈ జట్లున్నాయి. జ‌న‌వ‌రి 14న‌ తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో భారత్‌ ఆడుతుంది. భారత జట్టులో హైదరాబాద్‌ అమ్మాయి గొంగడి త్రిష, వైజాగ్‌కు చెందిన షబ్నమ్‌ సభ్యులుగా ఉన్నారు.  

వీక్లీ కరెంట్ అఫైర్స్ (క్రీడలు) క్విజ్ (17-23 డిసెంబర్ 2022)

Sania Mirza Retirement: టెన్నిస్‌కు సానియా మీర్జా గుడ్‌బై 
భారత వెటరన్‌ టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా ఫిబ్రవరిలో జరిగే దుబాయ్‌ ఓపెన్‌ తర్వాత రిటైర్‌ అవుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఆమె ట్విట్టర్‌లో భావోద్వేగపు లేఖను ‘లైఫ్‌ అప్‌డేట్‌’ అనే క్యాప్షన్‌తో పంచుకుంది. మూడు పేజీల ఈ లేఖలో తన 30 ఏళ్ల రాకెట్‌ పయనాన్ని, చివరి గమ్యాన్ని వివరించింది. ‘నా గ్రాండ్‌స్లామ్‌ ప్రయాణం 2005లో ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌తోనే మొదలైంది. ఇప్పుడు గ్రాండ్‌స్లామ్‌ ఆట కూడా అక్కడే ముగించేందుకు సరైన వేదిక అనుకుంటున్నా. 18 ఏళ్ల క్రితం ఎక్కడైతే ఆరంభించానో అక్కడే ఆపేయబోతున్నా. ఇక కెరీర్‌లో చివరి టోర్నీ మాత్రం దుబాయ్‌ ఓపెన్‌. ఫిబ్రవరిలో ఈ టోర్నీతో సుదీర్ఘ కెరీర్‌కు వీడ్కోలు పలుకుతాను. ఇన్నేళ్ల పయనంలో ఎన్నో ఆటుపోట్లే కాదు మరెన్నో మధురస్మృతులూ ఉన్నాయి’ అని అందులో పేర్కొంది. 
దేవుడిచ్చిన వరం
నాసర్‌ స్కూల్‌కు చెందిన ఆరేళ్ల బాలిక ఎలా టెన్నిస్‌ నేర్చుకుంది.. తన కలలకు ఎక్కడ బీజం పడింది.. అన్నింటికీ మించి దేశానికి ప్రాతినిధ్యం ఎలాంటి స్ఫూర్తినిచ్చిందో ఆ లేఖలో చెప్పుకొచ్చింది. అర్ధ సెంచరీని దాటిన తన గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో గెలిచిన కొన్ని టైటిళ్లు దేవుడిచ్చిన వరమంది. ‘నా సుదీర్ఘ కెరీర్‌లో దేశానికి పతకాలు తేవడమే అతిపెద్ద గౌరవంగా భావిస్తాను. పతకం నా మెడలో పడినపుడు జాతీయ పతాకం రెపరెపలాడినపుడు కలిగే ఆనందం అన్నింటికి మించి ఉంటుంది. ఇప్పుడు దీన్ని తలచుకొని రిటైర్మెంట్‌ సందేశం రాస్తున్నప్పుడు చెరిగిపోని ఆ అనుభూతి నా కళ్లను చెమరుస్తోంది’ అని 36 ఏళ్ల సానియా పేర్కొంది.  

National Youth Festival: హుబ్బళ్లిలో నేషనల్‌ యూత్‌ ఫెస్టివల్‌

Narendra Modi: ప్రభుత్వ, ప్రైవేటు రంగం కలిసి పనిచేయాలి.. మోదీ 
ప్రభుత్వ, ప్రైవేటు రంగం కలసికట్టుగా పనిచేయాలని, అంతర్జాతీయంగా ఉన్న పరిణామాల నేపథ్యంలో తమ పరిధి దాటి విశాల దృక్పథంతో ఆలోచించి అవకాశాలను సొంతం చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. కేంద్ర బడ్జెట్‌కు ముందు ప్రముఖ ఆర్థికవేత్తలతో జ‌న‌వ‌రి 13న‌ ప్రధాని సమావేశమై వారి అభిప్రాయాలు, సూచనలను తెలుసుకున్నారు. డిజిటల్‌ కార్యకలాపాల విషయంలో, ఫిన్‌టెక్‌ విస్తరణలో దేశం సాధించిన విజయాన్ని ప్రధాని ఈ సందర్భంగా ప్రశంసించినట్టు అధికారికంగా ఓ ప్రకటన విడుదలైంది. సమ్మిళిత వృద్ధికి ఇది కీలకమని ప్రధాని అభిప్రాయపడ్డారు. భారత్‌ వృద్ధిలో మహిళల పాత్ర కీలకమని పేర్కొంటూ, ఉత్పాదకతలో మహిళలను మరింతగా భాగస్వాములను చేయాలని కోరారు. రిస్క్‌లు ఉన్నప్పటికీ అంతర్జాతీయంగా డిజిటైజేషన్, ఇంధనం, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం రంగాల్లో విస్తతమైన అవకాశాలున్నట్టు ప్రధాని పేర్కొన్నారు. 
ఈ అవకాశాలను సొంతం చేసుకునేందుకు ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. భారత్‌ తన వృద్ధిని స్థిరంగా కొనసాగించేందుకు తీసుకోవాల్సిన చర్యలను ఆర్థికవేత్తలు ఈ సమావేశంలో ప్రధానికి సూచించినట్టు ప్రభుత్వ ప్రకటన తెలిపింది. అంతర్జాతీయంగా ప్రస్తుతం నెలకొన్న సమస్యలు కొనసాగుతాయంటూ, భారత్‌ మరింత బలమైన వృద్ధిని నమోదు చేసేందుకు చర్యలను ప్రతిపాదించినట్టు పేర్కొంది. ఈ సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ సుమన్‌ బెరీ, ఉన్నతాధికారులతోపాటు.. ఆర్థికవేత్తలు శంకర్‌ ఆచార్య, అశోక్‌ గులాటీ, షమిక రవి తదితరులు పాల్గొన్నారు.   

Daily Current Affairs in Telugu: జ‌న‌వ‌రి 13th, 2023 కరెంట్‌ అఫైర్స్‌


Google: డిజిటల్‌ వినియోగానికి ఎదురుదెబ్బ.. గూగుల్‌
గుత్తాధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తోందంటూ కాంపిటీషన్‌ కమిషన్‌ (సీసీఐ) తమకు జరిమానా విధించడంపై టెక్‌ దిగ్గజం గూగుల్‌ స్పందించింది. కనెక్టివిటీకి అడ్డంకులను తొలగించే దిశగా సురక్షితమైన స్మార్ట్‌ఫోన్లను అందుబాటులోకి తేవాల్సిన దశలో ఇలాంటి ఆదేశాలు ఇవ్వడం వల్ల దేశీయంగా డిజిటల్‌ వినియోగం వేగవంతం కాకుండా విఘాతం కలుగుతుందని వ్యాఖ్యానించింది. గూగుల్‌ ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టం విషయంలో గుత్తాధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తోందంటూ రూ.1,338 కోట్లు, ప్లే స్టోర్‌కి సంబంధించి అనుచిత విధానాలపై మరో రూ.936 కోట్ల మొత్తాన్ని సీసీఐ జరిమానా విధించింది.

వీక్లీ కరెంట్ అఫైర్స్ (వ్యక్తులు) క్విజ్ (17-23 డిసెంబర్ 2022)


Covid-19: కరోనాను అడ్డుకునే స్ప్రే 
కరోనా వైరస్‌ ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించకుండా అడ్డుకునే కొత్త రకం అణువులను అమెరికాలోని జాన్స్‌ హాప్కిన్స్‌ యూనివర్సిటీ ఇంజనీర్లు అభివృద్ధి చేశారు. సన్నగా, పోగుల మాదిరిగా ఉండే వీటిని సుప్రా మాలిక్యులార్‌ ఫిలమెంట్స్‌గా (ఎస్‌ఎంఎఫ్‌) పిలుస్తున్నారు. వీటిని ముక్కులోకి స్ప్రే చేయడం ద్వారా కరోనాతో పాటు సార్స్‌ తదితర వైరస్‌లను కూడా సమర్థంగా అడ్డుకోవచ్చని వారు చెబుతున్నారు. ‘‘కరోనా శ్వాస ద్వారానే సోకుతుందన్నది తెలిసిందే. ఎస్‌ఎంఎఫ్‌ స్పాంజ్‌ మాదిరిగా కరోనా వంటి వైరస్‌లను పీల్చుకుంటుంది. తద్వారా అవి ఊపిరితిత్తుల్లోని కణాలతో కలిసిపోయి వ్యాధి కారకాలుగా మారకుండా చూస్తుంది’’ అని వర్సిటీ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ హాంగాంగ్‌ కుయ్‌ వివరించారు. 
వీటిని ఇప్పటికే ఎలుకలపై విజయవంతంగా ప్రయోగించి చూశారట. కరోనా వైరస్‌ సాధారణంగా ఊపిరితిత్తుల్లోని కణాల్లో ఉండే ఏస్‌2గా పిలిచే రిసెప్టర్‌లోకి తొలుత చొచ్చుకుపోతుంది. తద్వారా కణంలోకి ప్రవేశించి వృద్ధి చెందుతుంది. తాజాగా అభివృద్ధి చేసిన ఎస్‌ఎంఎఫ్‌ల్లో ఫిలమెంట్లలోనూ ఇలాంటి సూడో రిసెప్టర్లుంటాయి. కరోనా వైరస్‌ లోనికి తమవైపు ఆకర్షించి అక్కడే నిలువరిస్తాయి. కరోనా తాలూకు అన్ని వేరియంట్లనూ ఇది సమర్థంగా అడ్డుకుంటుందని పరిశోధకులు చెబుతున్నారు.  

Intelligent Surgical Knife: కేన్సర్‌ను ‘కత్తి’లా పసిగట్టేస్తుంది..!

Covid: చైనాలో కరోనా కేసులు ఏకంగా 90 కోట్లు!
చైనాలో జ‌న‌వ‌రి 11వ తేదీ నాటికి అక్షరాలా 90 కోట్ల మంది కోవిడ్‌–19 వైరస్‌ బారినపడ్డారు. పెకింగ్‌ యూనివర్సిటీ నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం తెలిసింది. దేశ జనాభాలో 64 శాతం మందికి వైరస్‌ సోకిందని వెల్లడించింది. అత్యధికంగా గాన్సూ ప్రావిన్స్‌లో 91 శాతం మందికి కరోనా సోకింది. యునాన్‌ ప్రావిన్స్‌లో 84 శాతం మంది, కింఘాయ్‌ ప్రావిన్స్‌లో 80 శాతం మంది వైరస్‌ ప్రభావానికి గురయ్యారు. చైనాలో కొత్త సంవత్సరం జ‌న‌వ‌రి 23న ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో లక్షలాది మంది జనం పట్టణాల నుంచి సొంత గ్రామాలకు తరలి వెళ్తున్నారు. ఇకపై గ్రామీణ ప్రాంతాల్లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉన్నట్లు అంటువ్యాధుల నిపుణుల్లో ఒకరు హెచ్చరించారు. కరోనా కొత్త వేవ్‌ ఉధృతి రెండు నుంచి మూడు నెలలపాటు కొనసాగే అవకాశం ఉందని చైనీస్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ మాజీ అధిపతి జెంగ్‌ గువాంగ్‌ తెలిపారు.   

Monica Singh: తొలి సిక్కు మహిళా జడ్జిగా మన్‌ప్రీత్‌ మోనికా

Usha Reddy: అమెరికాలో చరిత్ర సృష్టించిన తెలుగు మహిళ..  కన్సాస్‌ సెనేటర్‌గా ఉషా రెడ్డి
అమెరికాలోని కన్సాస్‌ రాష్ట్ర సెనేటర్‌గా భారతీయ అమెరికన్, విద్యావేత్త ఉషా రెడ్డి(57) బాధ్యతలు చేపట్టారు. డెమొక్రాటిక్ పార్టీకి చెందిన ఆమె కాన్సాస్ రాష్ట్రంలోని డిస్ట్రిక్ట్ 22 సెనేటర్‌గా ఎన్నికయ్యారు. డెమోక్రాటిక్‌ పార్టీ తరఫున బాధ్యతలు స్వీకరించడం ఆనందంగా ఉందంటూ ట్వీట్‌ చేశారు. ఆమె 2013 నుంచి మన్‌హాటన్‌ సిటీ కమిషన్‌గా కొనసాగుతున్నారు. మేయర్‌గా రెండుసార్లు ఎన్నికయ్యారు. నేషనల్‌ ఎడ్యుకేషన్‌ అసోసియేషన్‌ చాప్టర్‌ ప్రెసిడెంట్‌గానూ ఉన్నారు. ఉషారెడ్డి 8 ఏళ్లప్పుడు ఆమె కుటుంబం ఏపీలోని రాజమహేంద్రవరం నుంచి అమెరికా వెళ్లింది.

Global Investors Summit: పెట్టుబడులకు ఆకర్శణీమైన గమ్యస్థానంగా భారత్‌.. మోదీ

MV Ganga Vilas: సుదీర్ఘ నదీ పర్యాటక నౌక ‘ఎంవీ గంగా విలాస్‌’ ప్రారంభం  
అభివృద్ధి చెందిన భారత్‌ నిర్మాణానికి ప్రాంతాల మధ్య బలమైన అనుసంధానం అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘమైన ప్రయాణం సాగించే నదీ పర్యాటక నౌక ‘ఎంవీ గంగా విలాస్‌’ను జ‌న‌వ‌రి 13న మోదీ ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్‌లోని చారిత్రక నగరం వారణాసి నుంచి నౌక ప్రయాణం ఆరంభమైంది. అలాగే వారణాసిలో గంగా నది ఒడ్డున నిర్మించిన టెంట్‌ సిటీని ఆయ‌న‌ ప్రారంభించారు. అంతేకాకుండా పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, బిహార్, అస్సాంలో రూ.1,000 కోట్లకుపైగా విలువైన పలు ఇన్‌లాండ్‌ వాటర్‌ వేస్‌ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడంతోపాటు మరికొన్నింటిని ప్రారంభించారు. 
ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. కాశీ–దిబ్రూగఢ్‌ నదీ పర్యాటక నౌకతో ఉత్తర భారతదేశంలోని పర్యాటక ప్రాంతాలకు ఇక ప్రపంచ టూరిజం పటంపై ప్రత్యేక స్థానం లభిస్తుందని ఉద్ఘాటించారు. ఆయా ప్రాంతాల అభివృద్ధికి మార్గం సుగమం అవుతుందన్నారు. 
నమామి గంగా, అర్థ్‌ గంగా 
‘‘భారతీయుల జీవితాల్లో పవిత్ర గంగా నదికి ఎనలేని ప్రాముఖ్యత ఉంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత గంగానది పరిసర ప్రాంతాలు అభివృద్దిలో వెనుకబడ్డాయి. అభివృద్ధి లేక ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు వలసలు పెరిగాయి.  మ‌రిన్ని వివ‌రాల‌కు ఇక్క‌డ క్లిక్ చేయండి

Global South Center: గ్లోబల్‌ సౌత్‌ సెంటర్‌ ఆఫ్ ఎక్సలెన్స్‌ ఏర్పాటు చేస్తాం.. ప్రధాని మోదీ
వర్ధమాన దేశాలు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడానికి ‘గ్లోబల్‌ సౌత్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌’ ఏర్పాటు చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. జ‌న‌వ‌రి 13న జ‌రిగిన గ్లోబల్‌ సౌత్‌ సదస్సు ముగింపు కార్యక్రమంలో ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రసంగించారు. కోవిడ్‌–19 మహమ్మారి, ధరల పెరుగుదల, భౌగోళిక రాజకీయ పరిస్థితులు అభివృద్ధి చెందుతున్న దేశాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని గుర్తుచేశారు. వాతావరణ సంక్షోభం, అప్పుల సంక్షోభానికి కారణమయ్యే ప్రపంచీకరణను అభివృద్ధి చెందుతున్న దేశాలు కోరుకోవడం లేదన్నారు. అస్థిరమైన భౌగోళిక రాజకీయాల వల్ల మన దేశాలు అభివృద్ధిపై సరిగ్గా దృష్టి పెట్టలేకపోతున్నాయని పేర్కొన్నారు. ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి వంటి అంతర్జాతీయ సంస్థలను మూలం నుంచి సంస్కరించాలని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. గ్లోబల్‌ సౌత్‌ సదస్సులో 120కి పైగా దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు.   

Indian Science Congress: గ్లోబల్‌ లీడర్లుగా ఎదగండి.. సైంటిస్టులకు ప్రధాని మోదీ పిలుపు

Supreme Court: ఫలానా చట్టం చేయాలని పార్లమెంటుకు నిర్దేశించలేం.. సుప్రీంకోర్టు 
ఫలానా చట్టం చేయాలంటూ పార్లమెంటుకు నిర్దేశాలు జారీ చేయలేమని సుప్రీంకోర్టు జ‌న‌వ‌రి 13న‌ స్పష్టం చేసింది. చట్టాలు చేయడం పూర్తిగా శాసన వ్యవస్థ పరిధిలోని అంశమేనని సీజేఐ జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్, న్యాయమూర్తి జస్టిస్‌ పి.ఎస్‌.నరసింహ ధర్మాసనం స్పష్టం చేసింది. లా కమిషన్‌ను చట్టబద్ధమైన సంస్థగా ప్రకటించడంతో పాటు తక్షణం చైర్మన్, సభ్యులను నియమించేలా కేంద్రాన్ని ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్‌ను విచారణకు స్వీకరించేందుకు నిరాకరించింది. 22వ లా కమిషన్‌ను ఇప్పటికే ఏర్పాటు చేసినట్టు అటార్నీ జనరల్‌ నివేదించారని గుర్తు చేసింది.

Supreme Court: మతమార్పిళ్లకు రాజకీయ రంగు పులమొద్దు.. సుప్రీం

Santokh Singh: గుండెపోటుతో కాంగ్రెస్‌ ఎంపీ కన్నుమూత 
కాంగ్రెస్‌ నేత, జలంధర్‌ ఎంపీ సంటోఖ్‌ సింగ్‌ చౌదరి జ‌న‌వ‌రి 14న గుండెపోటుతో కన్నుమూశారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్‌ జోడో యాత్రలో ఈ విషాదం చోటు చేసుకుంది. లూథియానా ఫిలౌర్‌ నుంచి రాహుల్‌ గాంధీతో కలిసి నడుస్తున్న సంటోఖ్‌ సింగ్‌ కుప్పకూలిపోవ‌డంతో ఆయన్ని ఆంబులెన్స్‌లో ఫగ్వారాలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన గుండె పోటుతోనే చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. 

వీక్లీ కరెంట్ అఫైర్స్ (National) క్విజ్ (17-23 డిసెంబర్ 2022)
 
 

Published date : 14 Jan 2023 06:30PM

Photo Stories