National Youth Festival: హుబ్బళ్లిలో నేషనల్ యూత్ ఫెస్టివల్
ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. మన దేశాన్ని ముందుకు నడిపించే చోదక శక్తి యువశక్తేనని ఉద్ఘాటించారు. దేశ ఆర్థిక ప్రగతి యువతరానికి ఎన్నో గొప్ప అవకాశాలు కల్పిస్తోందని చెప్పారు. బొమ్మల తయారీ నుంచి పర్యాటకం దాకా, రక్షణ నుంచి డిజిటల్ దాకా ఎన్నో అంశాల్లో మనదేశం ప్రపంచ యవనికపై తనదైన ముద్ర వేస్తోందని, వార్తల్లో నిలుస్తోందని వ్యాఖ్యానించారు.
ఈ శతాబ్దం భారతదేశ శతాబ్దమని ప్రపంచమంతా ముక్తకంఠంతో అంగీకరిస్తోందని హర్షం వ్యక్తం చేశారు. ఇది మన శతాబ్దం, భారతదేశ యువతకు చెందిన శతాబ్దమని పేర్కొన్నారు. చరిత్రలో ఇదొక ప్రత్యేక సందర్భమని అన్నారు. ఇప్పటి యువతరం ప్రత్యేక తరమని తెలిపారు. అంతర్జాతీయంగా భారతదేశ ప్రతిష్టను మరింత పెంచాల్సిన బాధ్యత యువతపై ఉందని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. భారత్‌ను అత్యంత ప్రభావవంతమైన దేశంగా తీర్చిదిద్దడానికి యువతరం నడుం బిగించాలని సూచించారు. అనంతరం ప్రధాని హుబ్బళ్లిలో రోడ్డు షోలో పాల్గొన్నారు.
National Youth Day 2023: వివేకానందుడి రచనలు చదవడంతో.. వెయ్యి రెట్లు దేశ భక్తి పెరిగింది