Jordan Armed Forces: భారత నావికా దళాన్ని సందర్శించిన శిక్షణా ప్రతినిధి బృందం
Sakshi Education
కమాండర్ హజెమ్ ఐ మైతా నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల జోర్డాన్ సాయుధ దళాల (JAF) శిక్షణా ప్రతినిధి బృందం ఏప్రిల్ 29 నుంచి మే 4వ తేదీ వరకు దక్షిణ నావికా కమాండ్, కొచ్చి, భారత నావికా అకాడమీ, ఎజిమాలను సందర్శించింది.
ఈ చారిత్రక పర్యటన యొక్క ప్రధాన లక్ష్యం సైనిక శిక్షణా పద్ధతులలో అనుభవాలను పంచుకోవడం, ఉత్తమ అభ్యాసాలను స్థాపించడం. ఈ సందర్శన మార్చి 23న రెండు దేశాల మధ్య రక్షణ సహకారంపై రెండవ సంప్రదింపుల సమావేశంలో జరిగిన ఒప్పందానికి అనుగుణంగా జరిగింది.
కొచ్చిలోని ఎఎన్‌సీ(SNC)లోని వృత్తిపరమైన శిక్షణా పాఠశాలల్లోని వివిధ శిక్షణా కేంద్రాలను సందర్శించడంతో పాటు, జేఏఎఫ్(JAF) బృందం భారత నావికా అకాడమీ, ఎజిమాలను కూడా సందర్శించింది.
Published date : 07 May 2024 12:35PM