Skip to main content

MV Ganga Vilas: సుదీర్ఘ నదీ పర్యాటక నౌక ‘ఎంవీ గంగా విలాస్‌’ ప్రారంభం

అభివృద్ధి చెందిన భారత్‌ నిర్మాణానికి ప్రాంతాల మధ్య బలమైన అనుసంధానం అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు.

ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘమైన ప్రయాణం సాగించే నదీ పర్యాటక నౌక ‘ఎంవీ గంగా విలాస్‌’ను జ‌న‌వ‌రి 13న మోదీ ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్‌లోని చారిత్రక నగరం వారణాసి నుంచి నౌక ప్రయాణం ఆరంభమైంది. అలాగే వారణాసిలో గంగా నది ఒడ్డున నిర్మించిన టెంట్‌ సిటీని ఆయ‌న‌ ప్రారంభించారు. అంతేకాకుండా పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, బిహార్, అస్సాంలో రూ.1,000 కోట్లకుపైగా విలువైన పలు ఇన్‌లాండ్‌ వాటర్‌ వేస్‌ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడంతోపాటు మరికొన్నింటిని ప్రారంభించారు. 
ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. కాశీ–దిబ్రూగఢ్‌ నదీ పర్యాటక నౌకతో ఉత్తర భారతదేశంలోని పర్యాటక ప్రాంతాలకు ఇక ప్రపంచ టూరిజం పటంపై ప్రత్యేక స్థానం లభిస్తుందని ఉద్ఘాటించారు. ఆయా ప్రాంతాల అభివృద్ధికి మార్గం సుగమం అవుతుందన్నారు. 

Water Vision@2047: తొలి జలవనరుల శాఖ మంత్రుల జాతీయ సదస్సు

నమామి గంగా, అర్థ్‌ గంగా 
‘‘భారతీయుల జీవితాల్లో పవిత్ర గంగా నదికి ఎనలేని ప్రాముఖ్యత ఉంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత గంగానది పరిసర ప్రాంతాలు అభివృద్దిలో వెనుకబడ్డాయి. అభివృద్ధి లేక ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు వలసలు పెరిగాయి. సమస్య పరిష్కారానికి రెండంచెల వ్యూహం అమలు చేస్తున్నాం. అందులో ఒకటి గంగా నది ప్రక్షాళన కోసం ఉద్దేశించిన ‘నమామి గంగా’ పథకం. మరొకటి ‘అర్థ్‌ గంగా’. నదీ తీర రాష్ట్రాల్లో ఆర్థిక ప్రగతిని పెంపొందించే వాతావరణం సృష్టిస్తున్నాం. గంగా విలాస్‌ నౌకలో విహరించేందుకు 32 మంది స్విట్జర్లాండ్‌ వాసులు ఒప్పందం కుదుర్చుకోవడం సంతోషకరం. అన్ని దేశాల నుంచి పర్యాటకులను సాదరంగా ఆహ్వానిస్తున్నాం.

Indian Science Congress: గ్లోబల్‌ లీడర్లుగా ఎదగండి.. సైంటిస్టులకు ప్రధాని మోదీ పిలుపు

పర్యాటకంలో కొత్త యుగానికి ఆరంభం  
గంగా నదిలో పర్యాటక నౌక ప్రయాణం ప్రారంభం కావడం ఒక మైలురాయి లాంటి సందర్భం. భారతదేశ పర్యాటక రంగంలో కొత్త యుగానికి ఇదొక ఆరంభం. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసుకుంటే కొత్త ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. దేశంలోని నదులు జల శక్తికి, వాణిజ్యానికి, పర్యాటకానికి కొత్త ఊపును తీసుకురానున్నాయి. 2014 కంటే ముందు జలమార్గాలపై పాలకులు దృష్టి పెట్టలేదు. 2014 తర్వాత జల మార్గాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నాం. జాతీయ జలమార్గాలను ఐదు నుంచి 111కు పెంచాం. జల మార్గాల్లో సరుకు రవాణా 30 లక్షల మెట్రిక్‌ టన్నుల నుంచి మూడింతలు పెరిగింది’’. 

వీక్లీ కరెంట్ అఫైర్స్ (National) క్విజ్ (17-23 డిసెంబర్ 2022)

51 రోజులు.. రూ.55 లక్షలు  
గంగా విలాస్‌ నౌకలో ప్రయాణానికి రూ.55 లక్షలు ఖర్చవుతుంది! 2024 మార్చి దాకా నౌక మొత్తం ఇప్పటికే బుక్‌ అయ్యిందని నిర్వహణ సంస్థ అంతారా లగ్జరీ రివర్‌ క్రూయిజెస్‌ పేర్కొంది. ఇది పట్నా, సాహిబ్‌గంజ్, కోల్‌కతా, ఢాకా, గౌహతి గుండా ప్రయాణిస్తుంది. 50 టూరిస్టు కేంద్రాలు, ప్రపంచ వారసత్వ కట్టడాలను సందర్శించవచ్చు. 18 సూట్లుండే ఈ నౌకలో 36 మంది ప్రయాణించవచ్చు. కాశీలో పర్యాటకులకు వసతి కలి్పంచడానికి ఉద్దేశించిన టెంట్‌ సిటీ ఏటా అక్టోబర్‌ నుంచి జూన్‌ దాకా అందుబాటులో ఉంటుంది. అన్ని ఘాట్ట నుంచి పడవల్లో టెంట్‌ సిటీకి చేరుకోవచ్చు.

Free Foodgrains: 81.35 కోట్ల మందికి ఉచితంగా ఆహారధాన్యాలు

Published date : 14 Jan 2023 04:00PM

Photo Stories