Skip to main content

Free Foodgrains: 81.35 కోట్ల మందికి ఉచితంగా ఆహారధాన్యాలు

జాతీయ ఆహార భద్రతా చట్టం (NFSA) కింద కేంద్ర ప్ర‌భుత్వం జనవరి 1, 2023 నుంచి ఏడాది పాటు ఉచితంగా ఆహారధాన్యాలు అందించనుంది.

దీనికి సంబందించి డిసెంబ‌ర్ 30న కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రి పీయూష్ గోయల్, ఆహార మరియు ప్రజాపంపిణీ, వాణిజ్యం, పరిశ్రమలు మరియు జౌళి శాఖ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం ప్రభుత్వ ఖజానాపై రూ.2 లక్షల కోట్ల భారం పడనుంది. ఆహార ధాన్యాల కోసం ప్రజలు ఒక్క పైసా కూడా చెల్లించాల్సిన అవసరం లేదని కేంద్రం తెలిపింది. గతంలో జాతీయ ఆహార భద్రతా చట్టం కింద పేదలకు సబ్సిడీపై ఆహార ధాన్యాలను అందించేవారు. అయితే తాజాగా కేంద్రం నిర్ణయం కారణంగా ఇకపై పేదలు ఉచితంగా వీటిని పొందుతారు. ఇందుకయ్యే ఖర్చును కేంద్రమే భరించనుంది. 

వీక్లీ కరెంట్ అఫైర్స్ (ఎకానమీ) క్విజ్ (10-16 డిసెంబర్ 2022)

ఇప్పటికే కోవిడ్, లాక్‌డౌన్‌ల నేపథ్యంలో ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఉచిత రేషన్ అందిస్తోంది. ఈ పథకం కింద 80 కోట్ల మందికి పైగా లబ్ధిదారులకు ప్రతి వ్యక్తికి నెలకు 5 కిలోల ఉచిత ఆహార ధాన్యాలు అందజేస్తున్నారు. దేశవ్యాప్తంగా COVID 19 మహమ్మారి లాక్‌డౌన్‌  మధ్య పేద ప్రజలకు ఉపశమనం అందించడానికి ఈ పథకం ఏప్రిల్ 2020 నుంచి మూడు నెలల పాటు ప్రారంభించింది. అప్పటి నుంచి పలుమార్లు పొడిగిస్తూ వచ్చారు. జాతీయ ఆహార భద్రతా చట్టం (NFSA) కింద సాధారణ కోటా కంటే 5 కిలోల ఆహార ధాన్యాలు అందజేస్తున్నారు. ఆరు దశలలో ఈ పథకం కోసం రూ.3.45 లక్షల కోట్లను కేంద్రం ఖర్చు చేసింది. 

Aadhaar Update: ఆధార్‌ కార్డులో చిరునామా మార్పు ఇక‌ చాలా సులువు

Published date : 05 Jan 2023 03:50PM

Photo Stories