Indian Science Congress: గ్లోబల్ లీడర్లుగా ఎదగండి.. సైంటిస్టులకు ప్రధాని మోదీ పిలుపు
మహారాష్ట్రలోని నాగపూర్‌లో 108వ జాతీయ సైన్స్ కాంగ్రెస్‌ను ఆయన జనవరి 3న ప్రారంభించారు. ఐదు రోజులపాటు ఈ సదస్సు జరుగనుంది. శాస్త్రీయ విధానాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ ఈ సందర్భంగా ఉద్ఘాటించారు. క్వాంటమ్ టెక్నాలజీ, డేటా సైన్స్‌తోపాటు కొత్త వ్యాక్సిన్ల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని పరిశోధకులకు సూచించారు. కొత్తగా పుట్టకొచ్చే వ్యాధులపై నిఘా పెట్టే చర్యలను వేగవంతం చేయాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా నానాటికీ ఆదరణ పొందుతున్న క్వాంటమ్ కంప్యూటింగ్ రంగంలో విశేష కృషి చేయడం ద్వారా గ్లోబల్ లీడర్లుగా ఎదగాలని సైంటిస్టులకు ఉద్బోధించారు. సెమి కండక్టర్ల రంగంలో నూతన ఆవిష్కరణలతో ముందుకు రావాలని కోరారు. పరిశోధకులు తమ ప్రాధాన్యతల జాబితాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీని చేర్చుకోవాలని చెప్పారు.
PM Modi: రూ.22వేల కోట్ల భారీ ప్రాజెక్టుకు మోదీ శంకుస్థాపన
ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో 40వ స్థానం
సైంటిస్టులు ప్రయోగశాలల నుంచి క్షేత్రస్థాయికి రావాలని, అప్పుడే వారి ప్రయత్నాలు గొప్ప ఘనతలుగా కీర్తి పొందుతాయని ప్రధానమంత్రి వెల్లడించారు. సైన్స్ ప్రయోగాల ఫలితాలను సామాన్య ప్రజలకు అందించాలన్నారు. టాలెంట్ హంట్, హ్యాకథాన్లతో యువతను సైన్స్ వైపు ఆకర్షితులను చేయాలని కోరారు. ప్రైవేట్ కంపెనీలు, స్టార్టప్‌లను రీసెర్చ్ ల్యాబ్‌లు, విద్యాసంస్థలతో అనుసంధానిస్తే అద్భుతమైన ఫలితాలు లభిస్తాయని స్పష్టం చేశారు. మన దేశంలో ఇంధన, విద్యుత్ అవసరాలు రోజురోజుకీ భారీగా పెరుగుతున్నాయని, ఈ రంగంలో కొత్త ఆవిష్కరణ ద్వారా దేశానికి లబ్ధి చేకూర్చాలని సైంటిఫిక్ సమాజానికి పిలుపునిచ్చారు. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మనదేశం 2015లో 81వ స్థానంలో ఉండేదని, ఇప్పుడు 40వ స్థానానికి చేరిందని అన్నారు.