Daily Current Affairs in Telugu: జనవరి 13th, 2023 కరెంట్ అఫైర్స్
Women Officers: 'శతఘ్ని'లోకి మహిళా అధికారులు
దేశంలో అతిపెద్ద సాయుధ దళం ‘ఆర్మీ’పోరాట విభాగంలోనూ మహిళలను చేర్చుకోవాలని నిర్ణయించింది. ముందుగా ఆర్టిలరీ (శతఘ్ని)దళాల్లో మహిళా అధికారులను చేర్చుకునేందుకు ఉద్దేశించి ప్రతిపాదనలను కేంద్రానికి పంపించినట్లు ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే చెప్పారు. ఈ ప్రతిపాదన ఆమోదం పొందుతుందని భావిస్తున్నామన్నారు. ఇది కార్యరూపం దాలిస్తే బోఫోర్స్ హౌవిట్జర్, కె–9 వజ్ర, ధనుష్ వంటి తుపాకులను ఇకపై మహిళలు కూడా ఉపయోగించగలుగుతారు. వీరు ఆర్టిలరీ పోరాట సహాయక విభాగంలో ఉంటారని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
పదాతి దళం తర్వాత రెండో అతిపెద్ద రెజిమెంట్ శతఘ్ని దళమే. నిర్ణాయక విభాగంగా భావించే కీలకమైన ఈ దళంలో మిస్సైళ్లు, మోర్టార్లు, రాకెట్ లాంఛర్లు, డ్రోన్లు మొదలైనవి ఉంటాయి. పదాతి దళం, శతఘ్ని, మెకనైజ్డ్ శతఘ్ని రెజిమెంట్లలో ఇప్పటి వరకు మహిళా అధికారులకు పర్మినెంట్ కమిషన్లు లేవు. సుప్రీంకోర్టు తీర్పుతో ఆర్మీ మార్పులు తెచ్చింది. మహిళలకు పర్మినెంట్ కమిషన్ ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా 2022లో ఖడక్‌వాస్లాలోని డిఫెన్స్ అకాడమీలోకి 19 మంది మహిళా కేడెట్లతో మొదటి బ్యాచ్‌కు మూడేళ్ల శిక్షణ ప్రారంభించింది. అయితే, ఇన్‌ఫాంట్రీ, ఆర్మర్డ్ రెడ్ కార్ప్స్, మెకనైజ్డ్ ఇన్‌ఫాంట్రీల్లోకి మహిళా అధికారులను చేర్చుకోవాలన్న ప్రణాళికలేవీ లేవని రక్షణ శాఖ అధికారులు స్పష్టం చేశారు.
Golden Globe Awards: గోల్డెన్ గ్లోబ్స్ అవార్డు విజేతల పూర్తి వివరాలు
Sharad Yadav: కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ కన్నుమూత
సీనియర్ రాజకీయవేత్త, లోక్‌తాంత్రిక్ జనతా దళ్(ఎల్‌జేడీ) అధినేత, కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్(75) గుర్గావ్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జనవరి 12న మరణించారు. ఈ విషయాన్ని ఆయన కుమార్తె సుభాషిణి ట్విటర్ ద్వారా తెలిపారు. శరద్ యాదవ్‌కు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు.
శరద్ యాదవ్ మొత్తం పదిసార్లు పార్లమెంట్ సభ్యుడిగా పనిచేశారు. ఏడు సార్లు లోక్‌సభకు, మూడు సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1970వ దశకంలో జయప్రకాశ్ నారాయణ్ శిష్యుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. సోషలిస్టు ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. జనతాదళ్ నుంచి బయటకు వచ్చి 1997లో జేడీ(యూ)ను స్థాపించారు. జేడీ(యూ) నితీశ్ వర్గానికే చెందుతుందని 2017లో ఈసీ ప్రకటించింది. 2018లో తాను స్థాపించిన ఎల్‌జేడీని శరద్ యాదవ్ ఇటీవలే జేడీ(యూ)లో విలీనం చేశారు.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (వ్యక్తులు) క్విజ్ (17-23 డిసెంబర్ 2022)
National Youth Festival: యువశక్తి.. దేశ చోదక శక్తి
స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జనవరి 12వ తేదీ కర్ణాటకలోని హుబ్బళ్లిలో రైల్వే స్పోర్ట్స్ గ్రౌండ్ నేషనల్ యూత్ ఫెస్టివల్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. మన దేశాన్ని ముందుకు నడిపించే చోదక శక్తి యువశక్తేనని ఉద్ఘాటించారు. దేశ ఆర్థిక ప్రగతి యువతరానికి ఎన్నో గొప్ప అవకాశాలు కల్పిస్తోందని చెప్పారు. బొమ్మల తయారీ నుంచి పర్యాటకం దాకా, రక్షణ నుంచి డిజిటల్ దాకా ఎన్నో అంశాల్లో మనదేశం ప్రపంచ యవనికపై తనదైన ముద్ర వేస్తోందని, వార్తల్లో నిలుస్తోందని వ్యాఖ్యానించారు. ఈ శతాబ్దం భారతదేశ శతాబ్దమని ప్రపంచమంతా ముక్తకంఠంతో అంగీకరిస్తోందని హర్షం వ్యక్తం చేశారు. ఇది మన శతాబ్దం, భారతదేశ యువతకు చెందిన శతాబ్దమని పేర్కొన్నారు. చరిత్రలో ఇదొక ప్రత్యేక సందర్భమని అన్నారు. ఇప్పటి యువతరం ప్రత్యేక తరమని తెలిపారు. అంతర్జాతీయంగా భారతదేశ ప్రతిష్టను మరింత పెంచాల్సిన బాధ్యత యువతపై ఉందని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. భారత్‌ను అత్యంత ప్రభావవంతమైన దేశంగా తీర్చిదిద్దడానికి యువతరం నడుం బిగించాలని సూచించారు. అనంతరం ప్రధాని హుబ్బళ్లిలో రోడ్డు షోలో పాల్గొన్నారు.
Food Crisis: పాకిస్తాన్‌లో ఆహార సంక్షోభం.. మార్కెట్లలో తొక్కిసలాటలు
Hindu Temple: ఆస్ట్రేలియాలో హిందూ దేవాలయం అపవిత్రం
ఆస్ట్రేలియాలోని స్వామి నారాయణ్ మందిరంపై ఖలిస్తాన్ మద్దతుదారులు రంగులతో దాడిచేశారు. గోడలపై తమ హిందూ విద్వేషాన్ని చూపించారు. ప్రధాని మోదీ వ్యతిరేక రాతలు రాశారు. మెల్‌బోర్న్ సమీపంలోని మిల్ పార్క్‌లోని స్వామి నారాయణ్ మందిరంపై జనవరి 12వ తేదీ కొందరు ఖలిస్తాన్ మద్దతుదారులు దాడిచేశారు. 1980లలో పంజాబ్‌లో స్వర్ణదేవాలయంలో దాక్కొన్న నాటి సిక్కు వేర్పాటువాద నేత, ఖలిస్తాన్ ఉద్యమకారుడు దివంగత జర్నేల్ సింగ్ భింద్రావాలే ‘అమరుడు’, ప్రధాని మోదీ ఒక హిట్లర్ అంటూ నలుపు రంగుతో గ్రాఫిటీ చేశారు. భారతదేశాన్ని వ్యతిరేకిస్తూ హిందుస్తాన్ ముర్దాబాద్ వంటివి రాశారు. దాడి ఘటనను ఆస్ట్రేలియాలోని భారతీయ హిందువులు, భారతీయ మూలాలున్న నేతలు తీవ్రంగా ఖండించారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో, ఎంపీలకు ఫిర్యాదుచేశారు.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (International) క్విజ్ (17-23 డిసెంబర్ 2022)
Hockey World Cup 2023: 48 ఏళ్ల కల నెరవేరేనా.. టైటిల్ లక్ష్యంగా భారత్
హాకీ ప్రపంచ కప్ ప్రారంభం.. బరిలో 16 జట్లు
ఎప్పుడో 1975లో.. భారత హాకీ జట్టు అజిత్‌పాల్ సింగ్ నాయకత్వంలో ఫైనల్లో పాకిస్తాన్‌ను ఓడించి విశ్వ విజేతగా నిలిచింది. అయితే ఆ తర్వాత ఎన్ని ప్రయత్నాలు చేసినా నాటి మేటి ప్రదర్శనను పునరావృతం చేయలేకపోయింది.
ట్రోఫీ గెలవడం సంగతేమో గానీ ఆ తర్వాత 11 ప్రపంచ కప్‌లు జరిగినా మన టీమ్ కనీసం సెమీ ఫైనల్ కూడా చేరలేకపోవడం నిరాశ కలిగించే అంశం. వరుసగా రెండో సారి మనమే ఆతిథ్యమిస్తున్న నేపథ్యంలో భారత జట్టు రాత మారుతుందా.. కొన్నాళ్ల క్రితం ఒలింపిక్స్‌లో అత్యుత్తమ ఆటను ప్రదర్శించి కాంస్యం సాధించిన మన టీమ్ అదే జోరును చూపిస్తుందా అనేది ఆసక్తికరం.
Hockey World Cup: ప్రపంచ కప్ గెలిస్తే ఒక్కొక్కరికి రూ.1 కోటి!
భారత గడ్డపై మరో విశ్వ సంబరానికి సమయం ఆసన్నమైంది. 15వ హాకీ వరల్డ్ కప్ జనవరి 13వ తేదీ లాంఛనంగా ప్రారంభమైంది. ఒడిషాలోని రెండు వేదికలు భువనేశ్వర్, రూర్కెలాలలో 17 రోజుల పాటు మొత్తం 44 మ్యాచ్‌లు జరుగుతాయి. టోర్నమెంట్ తొలి మ్యాచ్‌లో అర్జెంటీనాతో దక్షిణాఫ్రికా తలపడుతుంది. తొలి రోజే బరిలోకి దిగనున్న భారత్... స్పెయిన్‌ను ఎదుర్కోనుంది. భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియం ఇప్పటికే అందుబాటులో ఉండగా.. కొత్తగా ఈ టోర్నీ కోసం మరో పెద్ద హాకీ స్టేడియాన్ని రూర్కెలాలో నిర్మించారు. 24 మ్యాచ్‌లు భువనేశ్వర్‌లో, 20 మ్యాచ్‌లు రూర్కెలాలో జరుగుతాయి. మొత్తం 16 జట్లు బరిలోకి దిగుతుండగా వాటిని నాలుగు పూల్‌లుగా విభజించారు. ముందుగా తమ గ్రూప్‌లో ఇతర మూడు జట్లతో తలపడాల్సి ఉంటుంది. ఆ తర్వాత ‘క్రాస్ ఓవర్స్’, క్వార్టర్స్, సెమీస్ ఉంటాయి. జనవరి 29న ఫైనల్ నిర్వహిస్తారు.
పూల్‌ల వివరాలు
‘ఎ’ – అర్జెంటీనా, ఆ్రస్టేలియా, ఫ్రాన్స్, దక్షిణాఫ్రికా
‘బి’ – బెల్జియం, జర్మనీ, జపాన్, కొరియా
‘సి’ – చిలీ, మలేసియా, నెదర్లాండ్స్, న్యూజిలాండ్
‘డి’ – భారత్, స్పెయిన్, ఇంగ్లండ్, వేల్స్
☛ ప్రపంచకప్‌ను అత్యధికంగా పాకిస్తాన్ (4 సార్లు) గెలవగా.. నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా చెరో 3 టైటిల్స్ సాధించాయి. జర్మనీ రెండు సార్లు విజేతగా నిలవగా.. భారత్, బెల్జియం ఒక్కో సారి ట్రోఫీని అందుకున్నాయి.
IPL Auction 2023: ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ గుర్తింపు
Tesla Shares: మస్క్.. టెస్లాకు ‘ట్విటర్’షాక్.. ఏడాదిలో టెస్లా షేరు 70% కుదేలు!
అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా షేరు ఏడాది క్రితం దాకా బ్రేకుల్లేని బండిలా రివ్వున దూసుకెళ్లిపోయింది. కంపెనీ బాసు ఎలాన్ మస్క్‌ను ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడి స్థానంలో కూర్చోబెట్టింది. కానీ ఇప్పుడదే షేరు ఏకంగా 70 శాతం పడిపోయి.. నానా తంటాలు పడుతోంది. ఈ క్రమంలో మస్క్ సంపదా భారీగా హరించుకుపోయింది. చరిత్రలోనే అత్యంత వేగంగా భారీ సంపదను పోగొట్టుకున్న కుబేరుడిగా రికార్డును కూడా మూటగట్టుకున్నారు. ముచ్చట పడి, పంతం పట్టి కొనుక్కున్న ట్విటర్‌కే సమయం అంతా వెచ్చిస్తూ టెస్లాను మస్క్ పట్టించుకోకపోతూ ఉండటమే ఇన్ని అనర్ధాలకు కారణమనే విమర్శలు వస్తున్నాయి. అయితే, అదొక్కటే కాకుండా టెస్లాకు మార్కెట్లో పోటీ పెరిగిపోతుండటం, డిమాండ్ తగ్గుతుండటం, కంపెనీపై ఇన్వెస్టర్లకు నమ్మకం సడలుతుండటం మొదలైనవి మరికొన్ని కారణాలని పరిశీలకులు భావిస్తున్నారు. అయితే ఇదంతా ఒక దశ మాత్రమేనని, మళ్లీ పుంజుకునే సామర్థ్యాలు టెస్లాకు పుష్కలంగా ఉన్నాయన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (ఎకానమీ) క్విజ్ (17-23 డిసెంబర్ 2022)
ట్విటర్‌తో కష్టాలు..
మైక్రోబ్లాగింగ్ సైటు ట్విటర్‌ను కొనడంతోనే అటు టెస్లాకు ఇటు మస్‌్కకు కష్టాలు వచ్చాయనే అభిప్రాయాలు ఉన్నాయి. ట్విటర్‌ను 44 బిలియన్ డాలర్లకు కొంటానంటూ గతేడాది ఏప్రిల్‌లో ప్రకటించిన మస్క్, బోలెడంత ఊగిసలాట తర్వాత అక్టోబర్‌లో ఎట్టకేలకు కొన్నారు. మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి