Hockey World Cup: ప్రపంచ కప్ గెలిస్తే ఒక్కొక్కరికి రూ.1 కోటి!
Sakshi Education
మన దేశంలో జరిగే హాకీ ప్రపంచ కప్‌ను భారత్ గెలుచుకుంటే ఒక్కో ఆటగాడికి రూ.1 కోటి చొప్పున కానుకగా అందజేస్తామని ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రకటించారు.
జనవరి 13 నుంచి 29 వరకు ఒడిషాలోని రెండు నగరాల్లో హాకీ ప్రపంచకప్ జరుగుతుంది. జనవరి 5న రూర్కెలాలో జరిగిన కార్యక్రమంలో భారత్‌లోనే అతి పెద్దదైన బిర్సా ముండా ఇంటర్నేషనల్ హాకీ స్టేడియాన్ని పట్నాయక్ ప్రారంభించారు. దీంతో పాటు భువనేశ్వర్ (కళింగ స్టేడియం) కూడా వరల్డ్ కప్ మ్యాచ్‌లకు వేదిక కానుంది. ఈ నేపథ్యంలో ‘ఒడిషా రే’ పుస్తకాన్ని కూడా ఆవిష్కరించిన అనంతరం భారత ఆటగాళ్లతో ముఖ్యమంత్రి ముచ్చటించారు. తమ రాష్ట్రానికి హాకీతో ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్న పట్నాయక్.. ఆటగాళ్లకు ‘బెస్ట్ విషెస్’ చెప్పారు. ఈ మెగా టోర్నీలో మొత్తం 16 జట్లు పాల్గొంటున్నాయి.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (క్రీడలు) క్విజ్ (10-16 డిసెంబర్ 2022)
Published date : 06 Jan 2023 05:39PM