Monica Singh: తొలి సిక్కు మహిళా జడ్జిగా మన్‌ప్రీత్ మోనికా
Sakshi Education
అమెరికాలోని హ్యారిస్ కౌంటీ జడ్జిగా భారత సంతతికి చెందిన మన్‌ప్రీత్ మోనికా సింగ్ బాధ్యతలు చేపట్టారు.
అమెరికాలో మొట్టమొదటి సిక్కు మహిళా జడ్జిగా ఆమె చరిత్ర సృష్టించారు. టెక్సాస్ లా నంబర్–4లోని హ్యారిస్ కౌంటీ సివిల్ కోర్ట్‌లో న్యాయమూర్తి అయిన మన్‌ప్రీత్ హూస్టన్‌లోనే పుట్టి, పెరిగారు. ప్రస్తుతం బెల్లెయిర్‌లో భర్త, ఇద్దరు పిల్లలతో నివాసం ఉంటున్నారు. ఈమె తండ్రి 1970ల్లో భారత్ నుంచి వలస వచ్చారు. మన్‌ప్రీత్ గత 20 ఏళ్లుగా లాయర్ వృత్తిలో ఉన్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భారత సంతతికి చెందిన జడ్జి రవి శాండిల్ అధ్యక్షత వహించారు. రవి శాండిల్ టెక్సాస్ రాష్ట్ర మొదటి ఆసియా సంతతి జడ్జి కూడా. అమెరికాలో సుమారు 5 లక్షల మంది సిక్కులుండగా, వారిలో 2 వేల మంది హూస్టన్ ప్రాంతంలోనే నివసిస్తున్నారు.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (International) క్విజ్ (17-23 డిసెంబర్ 2022)
Published date : 10 Jan 2023 03:29PM