Daily Current Affairs in Telugu: జనవరి 10th, 2023 కరెంట్ అఫైర్స్
Kantara Oscar: ఆస్కార్ రేసులో కాంతారా
ప్రపంచంలోని సినిమా అవార్డుల్లో ప్రతిష్టాత్మకమైనది ఆస్కార్. ఈసారి ఆస్కార్ బరిలో పాన్ ఇండియా చిత్రాలుగా సత్తా చాటిన ఆర్ఆర్ఆర్, కాంతారా సినిమాలు బరిలో నిలిచాయి. ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ కేటగిరీలో ‘ఆర్‌ఆర్‌ఆర్’ నుంచి ‘నాటు నాటు..’ పాట సెలెక్ట్ అయ్యింది. కాగా చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్‌లో సంచలనం సృష్టించిన కన్నడ చిత్రం ‘కాంతార’ ఆస్కార్ పోటీల జాబితాలో ఉత్తమ చిత్రం మరియు ఉత్తమ నటుడి(రిషబ్‌శెట్టి)గా అర్హత సాధించింది. ఇప్పటికే ఈ ఏడాది న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ వారి బెస్ట్ డైరెక్టర్ అవార్డును దర్శకుడు రాజమౌళి అందుకోగా, హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ జ్యూరీ స్పాట్‌లైట్ అవార్డును ‘ఆర్‌ఆర్‌ఆర్’కు ప్రకటించారు.
Rat Cyborgs: శత్రు సైన్యంపై మూషికాస్త్రం!
యుద్ధ క్షేత్రంలో శత్రు శిబిరం ఎత్తుగడలు, రహస్యాలను తెలుసుకోవడానికి సైన్యం రకరకాల మార్గాల్లో ప్రయత్నిస్తోంది. శత్రువులు ఎక్కడెక్కడ ఏయే ఆయుధాలు మోహరించారో తెలుసుకోవడం యుద్ధంలో కీలకం. ఇలాంటివి పసిగట్టే ఎలుకలపై భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీఓ) నిర్విరామంగా ప్రయోగాలు సాగిస్తోంది. డీఆర్‌డీఓలో అంతర్భాగమైన అసిమ్మెట్రిక్ టెక్నాలజీ ల్యాబ్ ప్రస్తుతం ఇదే పనిలో నిమగ్నమైంది. మొదటి దశను విజయవంతంగా పూర్తిచేసి, రెండో దశలోకి ప్రవేశించింది.
ROBO Lawyer: ప్రపంచంలో మొట్టమొదటి రోబో లాయర్
ఏమిటీ ప్రయోగం?
సైనికులు జంతువులు, పక్షులను ఉపయోగించుకోవడం కొత్తేమీ కాదు. రిమోట్ కంట్రోల్‌తో పనిచేసే ఎలుకలను రంగంలోకి దించాలన్నదే భారత సైన్యం వ్యూహం. ఇవి ఏమాత్రం అనుమానం రాకుండా శత్రు సైనికుల శిబిరాల్లోకి వెళ్లి, అక్కడి సమాచారాన్ని అందిస్తాయి. ఆ సమాచారం ఆధారంగా సైన్యం వ్యూహాలు సిద్ధం చేసుకోవచ్చు. ఈ ఎలుకలను యానిమల్ సైబర్గ్స్ అని పిలుస్తున్నారు. ఏడాదిన్నర క్రితమే ఈ ప్రాజెక్టు ప్రారంభమైంది. దీనిగురించి ఇటీవల మహారాష్ట్రలోని నాగపూర్‌లో జరిగిన 108వ జాతీయ సైన్స్ కాంగ్రెస్‌లో డీఆర్‌డీఓ సైంటిస్టు పి.శివప్రసాద్ ఒక ప్రజంటేషన్ ఇచ్చారు. మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
Pravasi Bharatiya Divas: మధ్యప్రదేశ్‌లో 17వ ప్రవాసీ భారతీయ దివస్ ప్రారంభం
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జనవరి 9వ తేదీ 17వ ప్రవాసీ భారతీయ దివస్ సదస్సు ప్రారంభమైంది. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ - భారతదేశ స్వాతంత్య్ర సమరంలో ప్రవాసుల తోడ్పాటు’ (Reliable Partners for India’s Progress in Amrit Kaal) ఇతివృత్తంపై ఏర్పాటైన మొట్ట మొదటి డిజిటల్ పీబీడీ(PBD Exhibition) ప్రదర్శనను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక గౌరవ అతిథిగా సురినామ్ అధ్యక్షుడు చంద్రికాప్రసాద్ సంతోఖీ, ముఖ్య అతిథిగా గయనా అధ్యక్షుడు మొహమ్మన్ ఇర్ఫాన్ అలీ హాజరయ్యారు. 66 దేశాల నుంచి వచ్చిన ఎన్నారైలనుద్దేశించి మోదీ ప్రసంగించారు. ప్రవాస భారతీయులను విదేశీ గడ్డపై భారత్‌కు బ్రాండ్ అంబాసిడర్లుగా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. రాబోయే 25 ఏళ్ల అమృతకాల ప్రయాణంలో వారి పాత్ర అత్యంత కీలకమని ఉద్ఘాటించారు.
Water Vision@2047: తొలి జలవనరుల శాఖ మంత్రుల జాతీయ సదస్సు
ప్రవాసీల ఘనతలను రికార్డు చేయాలి
‘‘ఎన్నారైఐలు భారత దూతలు. మన యోగా, ఆయుర్వేదం, హస్తకళలు, చిరుధాన్యాలు, కాటేజీ పరిశ్రమకు మీరు బ్రాండ్ అంబాసిడర్లు. ప్రపంచ వేదికపై భారత్ పాత్ర మీ వల్లే బలోపేతం కానుంది. స్కిల్ క్యాపిటల్‌గా కూడా ఎదిగే సామర్థ్యం భారత్‌కుంది. ప్రపంచ ప్రగతికి ఇంజన్‌గా మారనుంది. భారత్ గురించి తెలుసుకొనేందుకు ప్రవాసీల సంతానం ఆసక్తి చూపుతుండడం శుభపరిణామం. మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
Darshan Singh: దర్శన్ సింగ్‌కు ప్రవాసీ సమ్మాన్ అవార్డు
విదేశాల్లో స్థిరపడిన భారతీయులకు ఇచ్చే ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డును అమెరికా వ్యాపారవేత్త, దాత దర్శన్ సింగ్ దలీవాల్‌కు ప్రదానం చేశారు. పంజాబ్‌లోని పటియాలాకు చెందిన ఆయన అమెరికాలో వ్యాపారవేత్తగా ఎదిగారు. భారత్‌తోపాటు పలు దేశాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇండోర్‌లో జరిగిన 17వ ప్రవాసీ భారతీయ దివస్ సదస్సుకు ప్రత్యేక గౌరవ అతిథిగా సురినామ్ అధ్యక్షుడు చంద్రికాప్రసాద్ సంతోఖీ, ముఖ్య అతిథిగా గయనా అధ్యక్షుడు మొహమ్మన్ ఇర్ఫాన్ అలీ హాజరయ్యారు.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (International) క్విజ్ (17-23 డిసెంబర్ 2022)
Monica Singh: తొలి సిక్కు మహిళా జడ్జిగా మన్‌ప్రీత్ మోనికా
అమెరికాలోని హ్యారిస్ కౌంటీ జడ్జిగా భారత సంతతికి చెందిన మన్‌ప్రీత్ మోనికా సింగ్ బాధ్యతలు చేపట్టారు. అమెరికాలో మొట్టమొదటి సిక్కు మహిళా జడ్జిగా ఆమె చరిత్ర సృష్టించారు. టెక్సాస్ లా నంబర్–4లోని హ్యారిస్ కౌంటీ సివిల్ కోర్ట్‌లో న్యాయమూర్తి అయిన మన్‌ప్రీత్ హూస్టన్‌లోనే పుట్టి, పెరిగారు. ప్రస్తుతం బెల్లెయిర్‌లో భర్త, ఇద్దరు పిల్లలతో నివాసం ఉంటున్నారు. ఈమె తండ్రి 1970ల్లో భారత్ నుంచి వలస వచ్చారు. మన్‌ప్రీత్ గత 20 ఏళ్లుగా లాయర్ వృత్తిలో ఉన్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భారత సంతతికి చెందిన జడ్జి రవి శాండిల్ అధ్యక్షత వహించారు. రవి శాండిల్ టెక్సాస్ రాష్ట్ర మొదటి ఆసియా సంతతి జడ్జి కూడా. అమెరికాలో సుమారు 5 లక్షల మంది సిక్కులుండగా, వారిలో 2 వేల మంది హూస్టన్ ప్రాంతంలోనే నివసిస్తున్నారు.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (వ్యక్తులు) క్విజ్ (17-23 డిసెంబర్ 2022)
Supreme Court: మతమార్పిళ్లకు రాజకీయ రంగు పులమొద్దు.. సుప్రీం
‘‘మతమార్పిళ్లు చాలా సీరియస్ విషయం. దీనికి రాజకీయ రంగు పులమొద్దు’’ అని సుప్రీంకోర్టు పేర్కొంది. బలవంతపు మతమార్పిళ్లను అడ్డుకునేందుకు కఠిన చర్యలు చేపట్టేలా కేంద్ర రాష్ట్రాలను ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్‌పై న్యాయమూర్తులు జస్టిస్ ఆర్‌ఎం షా, జస్టిస్ సి.టి.రవికుమార్ ధర్మాసనం జనవరి 8న విచారణ జరిపింది. ఇది రాజకీయ ప్రేరేపిత పిటిషన్ అని తమిళనాడు ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది పి.విల్సన్ చేసిన వాదనను తీవ్రంగా తప్పుబట్టింది. ‘‘ఇలా వాదించేందుకు మీకు వేరే కారణాలుండొచ్చు. అంతమాత్రాన కోర్టు విచారణను మరోలా మార్చుకునేందుకు ప్రయత్నించకండి. మీ రాష్ట్రంలో కూడా ఇలాంటివి జరుగుతుంటే అది కచ్చితంగా తప్పే. దీన్ని రాజకీయం చేయకండి’’ అంటూ హితవు పలికింది. ఈ కేసులో అమికస్ క్యూరీగా వ్యవహరించి ఎలాంటి చర్యలు చేపట్టాలో సూచించాలని అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణిని కోరింది.
Demonetisation: పెద్ద నోట్ల రద్దు సరైనదే.. సుప్రీంకోర్టు తీర్పులో ఏం చెప్పిందంటే..
Dwaine Pretorius: అంతర్జాతీయ క్రికెట్‌కు ప్రిటోరియస్ గుడ్‌బై
దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు ఆల్‌రౌండర్ డ్వెయిన్ ప్రిటోరియస్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్నాడు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని 33 ఏళ్ల ప్రిటోరియస్ స్పష్టం చేశాడు. 2016లో దక్షిణాఫ్రికా తరఫున అరంగేట్రం చేసిన ప్రిటోరియస్ 3 టెస్టులు, 27 వన్డేలు, 33 టి20 మ్యాచ్‌లు ఆడాడు. టెస్టుల్లో 7 వికెట్లు తీసి 83 పరుగులు చేసిన అతను.. వన్డేల్లో 35 వికెట్లు పడగొట్టి 192 పరుగులు.. టి20ల్లో 35 వికెట్లు నేలకూల్చి 261 పరుగులు సాధించాడు. అంతర్జాతీయ టి20ల్లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన దక్షిణాఫ్రికా బౌలర్‌గా ప్రిటోరియస్ (2021లో పాకిస్తాన్‌పై 5/17) ఘనత వహించాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ప్రిటోరియస్ ఇక నుంచి ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న టి20 లీగ్‌లపై, ఇతర పొట్టి ఫార్మాట్‌లపై దృష్టి కేంద్రీకరిస్తానని తెలిపాడు. ప్రస్తుతం ప్రిటోరియస్ ఐపీఎల్ (చెన్నై సూపర్‌కింగ్స్), ద హండ్రెడ్ (వెల్ష్ ఫైర్), కరీబియన్ ప్రీమియర్ లీగ్, ఎస్‌ఏ20 (డర్బన్ సూపర్ జెయింట్స్) లీగ్‌లలో భాగంగా ఉన్నాడు.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (క్రీడలు) క్విజ్ (17-23 డిసెంబర్ 2022)
Videocon Scam: కొచ్చర్ దంపతులకు బెయిల్
రుణ మోసం కేసులో ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో, ఎండీ చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్‌లకు బాంబే హైకోర్టు జనవరి 9వ తేదీ మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ‘‘క్యాజువల్ మరియు మెకానికల్’’ ధోరణిలో ఈ అరెస్ట్ జరిగిందంటూ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)ను తప్పు పట్టింది. అరెస్టులో తగిన చట్టపరమైన విధానం, వైఖరి అవలంబించలేదని 49 పేజీల ఉత్తర్వుల్లో న్యాయమూర్తులు రేవతి మోహితే దేరే, పీకే చవాన్‌లతో కూడిన డివిజన్ బెంచ్ పేర్కొంది. వీడియోకాన్–ఐసీఐసీఐ బ్యాంక్ రుణం కేసుకు సంబంధించి 2022 డిసెంబర్ 23, 2022న కొచ్చర్‌లను సీబీఐ అరెస్టు చేసింది. ప్రస్తుతం వారు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. కాగా, కోర్టు తదుపరి విచారణను ఫిబ్రవరి 6వ తేదీకి వాయిదా వేసింది.