Skip to main content

ROBO Lawyer: ప్రపంచంలో మొట్టమొదటి రోబో లాయర్‌

ప్రపంచంలోనే మొట్టమొదటి రోబో లాయర్ త్వరలో కోర్టు కేసును వాదించబోతోంది. ఈ రోబో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనేబుల్డ్ లీగల్ అసిస్టెంట్‌గా మారింది.

ఈ AI రోబోట్‌ను డునాట్‌పే(DoNotPay) అనే కంపెనీ తయారు చేసిన ఈ రోబో వచ్చే ఫిబ్రవరిలో ఒకే కేసులో తన కక్షిదారుకు సహకరించనుంది. కోర్టులో వాదనలు జరిగినంతసేపూ సలహాలు సూచనలు అందించనుంది. స్మార్ట్‌ ఫోన్‌ సాయంతో వాదనలు వింటూ, ఏం చెప్పాలో, ఎలా స్పందించాలో తన కక్షిదారుకు ఎప్పటికప్పుడు ఇయర్‌ ఫోన్లో చెబుతుందట. అయితే కక్షిదారు పేరు, వాదనలు జరిగే కోర్టు తదితర వివరాలను సదరు కంపెనీ ప్రస్తుతానికి గోప్యంగా ఉంచుతోంది. స్టాన్‌ఫర్డ్‌ వర్సిటీకి చెందిన కంప్యూటర్‌ సైంటిస్ట్‌ జోషువా బ్రౌడర్‌ దీని వ్యవస్థాపకుడు. తన యాప్‌ ఆధారిత రోబో లాయర్లు మున్ముందు లాయర్ల వ్యవస్థ మొత్తాన్నీ భర్తీ చేయాలన్నది ఆయన ఆకాంక్ష.. అదెంత మేరకు నెరవేరుతుందో చూడాలి.

Eating Organism: వైరస్‌లను భోంచేస్తుంది.. వింత సూక్ష్మజీవి ఉనికిని గుర్తించిన సైంటిస్టులు

Published date : 09 Jan 2023 01:41PM

Photo Stories