Skip to main content

RRR Movie : ఆర్‌ఆర్‌ఆర్‌ ఖాతాలో మరో ప్రతిష్టాత్మక అవార్డు.. ఇంకా అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో..

తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి. బాహుబలి సినిమాలతో అందరి దృష్టిని ఆకర్షించిన జక్కన్న ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంతో సంచలనమే సృష్టించాడు.

ఈ సినిమాకు కలెక్షన్ల వర్షంతో పాటు అవార్డుల పరంపర కూడా తోడైంది. ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు అందుకున్న ఆర్‌ఆర్‌ఆర్‌ ఖాతాలో మరో ప్రతిష్టాత్మక అవార్డు వచ్చి చేరింది. న్యూయార్క్‌ ఫిలిం క్రిటిక్స్‌ సర్కిల్‌(NYFCC) ఉత్తమ దర్శకుడిగా జక్కన్న అవార్డు అందుకున్నాడు. 

☛ RRR: ఆస్కార్ షార్ట్‌లిస్ట్‌లో ‘ఆర్‌ఆర్ఆర్’ నాటు నాటు సాంగ్

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 
'ఉత్తమ దర్శకుడిగా ఈ అవార్డు అందుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రాన్ని భారతీయులు ఎంతలా ఆస్వాదించారో ఇక్కడివారు కూడా అదే స్థాయిలో ఆదరించారు. నా సినిమాను ప్రేక్షకులు మనసారా ఎంజాయ్‌ చేస్తుంటే అంతకన్నా ఏం కావాలి?' అని చెప్పుకొచ్చాడు. తన సతీమణి రమతో కలిసి అవార్డు అందుకున్నాడు.

☛ Top 10 Indian Movies 2022 : ఈ ఏడాది టాప్‌ 10 మూవీస్ ఇవే.. అగ్రస్థానంలో మ‌న తెలుగు మూవీ..

Published date : 05 Jan 2023 07:31PM

Photo Stories