Chanda Kochhar: ‘ఐసీఐసీఐ’ మాజీ సీఈవో చందా కొచర్ అరెస్ట్
Sakshi Education
వీడియోకాన్ గ్రూప్‌నకు రుణాల్లో అవకతవకలు, మోసం ఆరోపణలపై ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో, ఎండీ చందా కొచర్, ఆమె భర్త దీపక్ కొచర్‌ను సీబీఐ డిసెంబర్ 23న అరెస్ట్ చేసింది.
ఈ కేసుకు సంబంధించి వారిని ముందుగా సీబీఐ హెడ్‌క్వార్టర్స్‌లో ప్రశ్నించారు. అయితే, వారు విచారణకు సహకరించకపోవడంతో అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. చందా కొచర్, దీపక్ కొచర్‌లను డిసెంబర్ 24న సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నారు. తొలి చార్జి షీటును కూడా సీబీఐ సత్వరం దాఖలు చేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. 2012లో చందా కొచర్ సీఈవోగా ఉన్నప్పుడు వీడియోకాన్‌కు రూ.3,250 కోట్లు రుణాలు మంజూరు చేసినట్లు, ప్రతిగా ఆ కంపెనీ చీఫ్ వేణుగోపాల్ ధూత్.. దీపక్ కొచర్‌కి చెందిన కంపెనీలో ఇన్వెస్ట్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనితో చందా కొచర్, దీపక్ కొచర్, ధూత్‌లతో పాటు న్యూపవర్ రెన్యువబుల్స్ తదితర సంస్థలను సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో చేర్చింది.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (ఎకానమీ) క్విజ్ (03-09 డిసెంబర్ 2022)
Published date : 24 Dec 2022 01:36PM