Skip to main content

Daily Current Affairs in Telugu: ఫిబ్ర‌వ‌రి 8, 2023 కరెంట్‌ అఫైర్స్‌

Current Affairs in Telugu February 8th 2023 (డైలీ కరెంట్‌ అఫైర్స్‌ తెలుగులో): Current Affairs for All Competitive Exams In Telugu. Latest Articles useful for TSPSC &APPSC Group-1,2,3, 4, SSC, Bank, SI, Constable and all other competitive examinations

Andhra Pradesh: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో లక్షకు పైగా ఉద్యోగాలు
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రూ.1,44,185.07 కోట్ల పెట్టుబడులకు గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది. తద్వారా కొత్తగా 1,03,075 మంది ప్రత్యక్షంగా ఉపాధి పొందనుండగా పరోక్షంగా మరింత మందికి ఉపాధి లభించనుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఫిబ్ర‌వ‌రి 7వ తేదీ క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపీబీ) సమావేశం జరిగింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్ధ ఎన్టీపీసీ అనకాపల్లి జిల్లాలో రూ.1.10 లక్షల కోట్ల భారీ పెట్టుబడితో నెలకొల్పే న్యూ ఎనర్జీ పార్కుతోపాటు కడియం వద్ద ఆంధ్రా పేపర్‌ మిల్స్‌ విస్తరణ ప్రాజెక్టు, పలు రంగాల్లో పరిశ్రమల ఏర్పాటు ప్రతిపాదనలకు సమావేశంలో ఆమోదం తెలిపారు.
పరిశ్రమలు స్థాపించే వారికి చేదోడుగా నిలవాలని ఈ సందర్భంగా అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. నిర్దేశిత సమయంలోగా పనులు పూర్తై కార్యకలా­పాలు మొదలయ్యేలా చర్యలు చేపట్టాలని సూచించారు. రానున్న ప్రతి పరిశ్రమలో ప్రభుత్వం రూపొం­దించిన చట్టం ప్రకారం 75 శాతం ఉద్యో­గాలు స్థానికులకే దక్కాలని మరోసారి స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వం వచ్చాక విద్యుత్‌ ప్రాజెక్టుల విధానంలో కీలక మార్పులు తెచ్చామని ముఖ్యమం‘త్రి తెలిపారు. విద్యుత్‌ ప్రాజెక్టుల ద్వారా తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికే ఆదాయం వచ్చే పరిస్థితులు తీసుకొచ్చామన్నారు.
విద్యుత్‌ ప్రాజెక్టుల కోసం తీసుకుంటున్న భూమికి ఎకరాకు ఏడాదికి రూ.31 వేలు లీజు కింద చెల్లింపులు చేస్తారని, దీనివల్ల కరువు ప్రాంతాల్లో రైతులకు మేలు జరుగుతుందని ముఖ్యమంత్రి జగన్‌ పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రతి మెగావాట్‌కు లక్ష రూపాయల చొప్పున రాష్ట్రానికి కంపెనీలు చెల్లిస్తున్నాయని తెలిపారు. ఎస్‌జీఎస్‌టీ రూపంలో కూడా రాష్ట్రానికి రెవెన్యూ వస్తుందన్నారు. గ్రిడ్‌ బాధ్యతలు కూడా రాష్ట్రానికి లేవన్నారు. దీంతో పాటు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పారు. భోగాపురంలో అత్యంత అధునాతన సదుపాయాలతో ఐటీ పార్కు ఏర్పాటు కావాలని సీఎం జగన్‌ ఆదేశించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మోడళ్లను పరిశీలించి ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. 

RBI Regional Office: విశాఖలో ఆర్‌బీఐ ప్రాంతీయ కార్యాలయం

ఎస్‌ఐబీపీ ఆమోదించిన ప్రతిపాదనలు ఇవీ
► ఎన్టీపీసీ ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా పూడిమడక వద్ద న్యూ ఎనర్జీ పార్కు ఏర్పాటు కానుంది. మొదటి విడతలో రూ.55 వేల కోట్లు, రెండో విడతలో మరో రూ.55 వేల కోట్లు పెట్టుబడులు రానున్నాయి. మొత్తంగా రూ.1,10,000 కోట్ల పెట్టుబడులతో తొలిదశలో 30 వేల మందికి, రెండో దశలో 31 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయి. మొత్తంగా 61 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తారు.
► కడియం వద్ద ఆంధ్రా పేపర్‌ మిల్స్‌ విస్తరణ ప్రాజెక్టు ద్వారా మొత్తంగా రూ.3,400 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. ప్రత్యక్షంగా 2,100 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. 2025 నాటికి దీన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. మ‌రిన్ని వివ‌రాల‌కు ఇక్క‌డ క్లిక్ చేయండి

Granules Investments: ఏపీలో రూ.2,000 కోట్లతో గ్రాన్యూల్స్‌ ప్లాంట్‌

ChatGPT: చాట్‌జీపీటీకి పోటీగా.. గూగుల్‌ బార్డ్ 
తిరుగులేని ఆదరణతో దూసుకుపోతున్న చాట్‌జీపీటీ (చాట్‌ జెనరేటివ్‌ ప్రీ ట్రెయిన్డ్‌ ట్రాన్స్‌ఫార్మర్‌)కి పోటీగా గూగుల్‌ కూడా కృత్రిమ మేధ ఆధారిత చాట్‌బోట్‌ ‘బార్డ్‌’ను తీసుకొస్తోంది. ఆల్ఫాబెట్, గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ తన బ్లాగ్‌స్పాట్‌లో ఈ మేరకు ప్రకటించారు. విడుదలకు ముందు ఈ చాట్‌బోట్‌ను ‘నమ్మకస్తులైన టెస్టర్ల’తో కొద్ది వారాలపాటు మదింపు చేస్తామని తెలిపారు. ‘‘బార్డ్‌ మీ సృజనాత్మకతకు చక్కని తోడవుతుంది. మీ ఉత్సుకతకు రెక్కలు తొడుగుతుంది. నాసా జేమ్స్‌ వెబ్‌ టెలిస్కోప్‌ కొత్త ఆవిష్కరణలు మొదలుకుని ఎలాంటి సంక్లిష్టమైన విషయాలనైనా తొమ్మిదేళ్ల పిల్లలకు కూడా సులువుగా అర్థమయ్యేలా వివరించగలగడం దీని ప్రత్యేకత’’ అని చెప్పుకొచ్చారు. చాట్‌జీపీటీని మైక్రోసాఫ్ట్‌ తన సెర్చ్‌ ఇంజన్‌ బింగ్‌కు అనుసంధానం చేయనుందన్న వార్తల నేపథ్యంలో గూగుల్‌ ప్రకటన ఆసక్తికరంగా మారింది. గూగుల్‌ ప్రధాన ఆదాయ వనరు కూడా సెర్చ్‌ ఇంజనే అన్నది తెలిసిందే. చాట్‌జీపీటీ రూపంలో కంపెనీకిప్పుడు పెను సవాలు ఎదురైంది. 
లాఎండీఏ మోడల్‌పైనే.. 
బార్డ్‌ను గూగుల్‌ తన ప్రస్తుత ఏఐ లాంగ్వేజ్‌ మోడల్‌ లాఎండీఏపైనే అభివృద్ధి చేసింది. ఇది బోల్డ్‌గా, సృజనాత్మకంగా ఉంటూనే బాధ్యతాయుతంగా పని చేస్తుందని పిచాయ్‌ చెప్పారు. ‘‘బార్డ్‌ను తొలుత తక్కువ కంప్యూటింగ్‌ పవర్‌తో కూడా నడిచే లైట్‌వెయిట్‌ మోడల్‌లో విడుదల చేస్తాం. ఫీడ్‌బ్యాక్, యూజర్ల సంఖ్య ఆధారంగా ముందుకెళ్తాం’’ అని వివరించారు. 2022 నవంబర్లో విడుదలైన చాట్‌జీపీటీ సూపర్‌హిట్‌గా నిలిచింది. ఓపెన్‌ఏఐ కంపెనీకి చెందిన ఈ ప్రాజెక్టులో మైక్రోసాఫ్ట్‌ బిలియన్ల కొద్దీ పెట్టుబడులు పెట్టింది.

వీక్లీ కరెంట్ అఫైర్స్ (Awards) క్విజ్ (15-21 జనవరి 2023)
 
Indian Origin Judge: ఒకే వ్య‌క్తికే 36 యావజ్జీవ కారాగార శిక్షలు! 
అత్యాచారం కేసుల్లో నిందితుడికి భారత సంతతి న్యాయమూర్తి పరమ్‌జిత్‌ కౌర్‌ బాబీ చీమా–గ్రప్‌ ఏకంగా 36 యావజ్జీవ కారాగార శిక్షలు విధించారు. మెట్రోపాలిటన్‌ పోలీసు మాజీ అధికారి అయిన డేవిడ్‌ కారిక్‌(48) 2003 నుంచి 2020 దాకా.. 17 ఏళ్ల వ్యవధిలో దాదాపు 12 మంది మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డాడు. వారిని దారుణంగా హింసించాడు. అతడు 49 నేరాలకు పాల్పడినట్లు తేలింది. నేరాలన్నీ నిరూపితమయ్యాయి. లండన్‌లోని సౌత్‌వార్క్‌ క్రౌన్‌ కోర్టు న్యాయమూర్తి పరమ్‌జిత్‌ కౌర్ ఫిబ్ర‌వ‌రి 7వ తేదీ తీర్పు ప్రకటించారు. దోషికి 36 యావజ్జీవ కారాగార శిక్షలు విధిస్తున్నట్లు స్పష్టం చేశారు. అన్ని శిక్షలు ఏకకాలంలో అనుభవించాలని, పెరోల్‌కు దరఖాస్తు చేసుకోవాలంటే కనీసం 30 ఏళ్లు జైల్లో ఉండాల్సిందేనని ఆమె తేల్చిచెప్పారు.

Train Passengers: ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్‌.. ఇక వాట్సాప్‌ నుంచే ఫుడ్ ఆర్డర్ చేయొచ్చు

Brightest Student: ప్రపంచంలోని అత్యంత తెలివైన విద్యార్థిగా భారత సంతతి చిన్నారి
ప్రపంచంలో అసాధారణ తెలివితేటలు కలిగిన విద్యార్థిగా 13 ఏళ్ల ఇండియన్‌ అమెరికన్‌ నటాషా పెరియనాయగం నిలిచింది. అమెరికాకు చెందిన జాన్‌ హాప్‌కిన్స్‌ సెంటర్‌ ఫర్‌ టాలెంటెడ్‌ యూత్‌ నిర్వహించిన పలు రకాల పరీక్షల్లో అగ్రస్థానంలో నిలిచి వరసగా రెండో సంవత్సరం ఈ ఘనత సాధించింది. మొత్తం 76 దేశాల నుంచి 15 వేల మంది విద్యార్థినీ విద్యార్థులు జాన్‌ హాప్‌కిన్స్‌ సెంటర్‌ పరీక్షల్లో పాల్గొంటే నటాషా అత్యంత తెలివైనదానిగా తన ప్రతిభ కనబరిచింది. న్యూజెర్సీ ఫ్లోరెన్స్‌ ఎం గాడినీర్‌ మిడిల్‌ స్కూల్లో చదువుతున్న నటాషా 2021లో జరిగిన పోటీల్లో కూడా పాల్గొని మొదటి స్థానంలో నిలిచింది. శాట్, యాక్ట్, స్కూల్, కాలేజీ ఎబిలిటీ టెస్టుల్లో నటాషా అసాధారణ ప్రతిభ కనబరిచినట్టుగా జాన్‌ హాప్‌కిన్స్‌ సెంటర్‌ ఒక ప్రకటనలో తెలిపింది.  

China Spy Balloon: చైనా ‘స్పై బెలూన్’ను కూల్చేసిన అమెరికా!
 
Reserve Bank of India: వ‌రుస‌గా ఆరోసారి రెపో రేటు పెంచిన ఆర్బీఐ
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ శక్తికాంత దాస్ రెపో రేటును పావు శాతం పెంచుతున్నట్లు ఫిబ్రవరి 8, 2023 (బుధవారం) ప్రకటించారు.  రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 6.50 శాతానికి పెంచింది. దీంతో 6.25 శాతంగా ఉన్న కీలక వడ్డీ రేటు 6.50 శాతానికి చేరింది. అలాగే ఎంఎస్‌ఎప్‌ రేట్లు 25 బీపీఎస్‌ పాయింట్లు పెరిగి 6.75 శాతానికి చేరింది. ఇది వరుసగా ఆరోసారి వడ్డీ రేటు పెంపు. డిసెంబర్ మానిటరీ పాలసీ సమీక్షలో కీలక బెంచ్ మార్క్ వడ్డీ రేటును 35 బేసిస్ పాయింట్లు పెంచింది. గత ఏడాది మే నుంచి ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ స్వల్పకాలిక రుణ రేటు, తాజా పెంపుతో కలిపి 250 బేసిస్ పాయింట్లు పెంచింది. 
పెరగనున్న రుణ భారం
దీంతో బ్యాంక్ కస్టమర్లపై నేరుగా ప్రభావం పడనుంది. రుణ గ్రహీతలపై ఎఫెక్ట్ ఉండనుంది. నెలవారీ ఈఎంఐ (EMI) మరింత పెరగొచ్చు. అలాగే రుణాలు మరింత భారం కానున్నాయి. రుణ రేట్లు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. అయితే రెపో రేటు పెంపు వల్ల బ్యాంక్‌లో డబ్బులు దాచుకునే వారికి ఊరట కలుగనుంది. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెరగనున్నాయి. కాగా 2023 ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి వృద్ధి అంచనా 6.8 శాతం నుంచి 7 శాతానికి పెరిగింది. 2023-24లో జీడీపీ వృద్ధిని 6.4 శాతంగా అంచనా వేసింది.

వీక్లీ కరెంట్ అఫైర్స్ (National) క్విజ్ (15-21 జనవరి 2023)

ICC Women’s T20I Rankings: కెరీర్‌ బెస్ట్‌ ర్యాంక్‌లో టీమిండియా ఆల్‌రౌండర్‌
అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) మహిళల టి20 బౌలర్ల ర్యాంకింగ్స్‌లో భారత ప్లేయర్‌ స్నేహ్‌ రాణా తన కెరీర్‌ బెస్ట్‌ ర్యాంక్‌ను అందుకుంది. దక్షిణాఫ్రికాతో జరిగిన ముక్కోణపు టోర్నీ ఫైనల్లో రెండు వికెట్లు పడగొట్టిన స్నేహ్‌ నాలుగు స్థానాలు ఎగబాకి ఆరో ర్యాంక్‌లో నిలిచింది. భారత్‌కే చెందిన దీప్తి శర్మ, రేణుక సింగ్‌ ఒక్కో స్థానం పడిపోయి వరుసగా మూడు, ఎనిమిది ర్యాంకుల్లో నిలిచారు. బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో స్మృతి మంధాన మూడో స్థానంలో, షఫాలీ వర్మ ఎనిమిదో స్థానంలో కొనసాగుతున్నారు.   

U-19 Women’s T20 World Cup: టి20 వరల్డ్‌కప్‌ సాధించిన మ‌హిళ‌లు.. ఒక్కొక్కరి కథ ఒక్కోలా..

ICC Player of the Month: ఐసీసీ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌’ అవార్డు రేసులో భారత క్రికెటర్లు
జ‌న‌వ‌రి 2023లో విశేషంగా రాణించిన భారత క్రికెటర్లు సిరాజ్, శుబ్‌మన్‌ గిల్‌ అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌’ అవార్డు రేసులో నిలిచారు. హైదరాబాద్‌కు చెందిన సిరాజ్ జ‌న‌వ‌రి 2023లో ఐదు వన్డేలు ఆడి 14 వికెట్లు పడగొట్టడంతోపాటు టాప్‌ ర్యాంక్‌ను అందుకున్నాడు. గత నెలలో గిల్‌ ఐదు టి20లు, ఆరు వన్డేలు ఆడి మొత్తం 643 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు, ఒక డబుల్‌ సెంచరీ, ఒక అర్ధ సెంచరీ ఉన్నాయి.   

Hockey World Cup: హాకీ ప్రపంచ విజేత జర్మనీ.. ఫైనల్లో బెల్జియంపై గెలుపు
 
Finch: అంతర్జాతీయ క్రికెట్‌కు ఫించ్‌ గుడ్‌బై 
ఆ్రస్టేలియా టి20 జట్టు కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి వీడ్కోలు తీసుకున్నాడు. అయితే స్వదేశంలో జరిగే బిగ్‌బాస్‌, ఇతర దేశాల్లో జరిగే టి20 లీగ్‌లలోనూ ఆడతానని 36 ఏళ్ల ఫించ్‌ తెలిపాడు. 2015 వన్డే వరల్డ్‌కప్‌ నెగ్గిన ఆ్రస్టేలియా జట్టులో సభ్యుడైన ఫించ్‌.. 2021తో తన కెపె్టన్సీలో ఆ్రస్టేలియాకు తొలిసారి టి20 ప్రపంచకప్‌ను అందించాడు. 2011లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన ఫించ్‌ ఆ్రస్టేలియా తరఫున ఐదు టెస్టుల్లో (278 పరుగులు), 146 వన్డేల్లో (5406 పరుగులు), 103 టి20ల్లో (3120 పరుగులు) ప్రాతినిధ్యం వహించాడు. అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ప్లేయర్‌గా (172; జింబాబ్వేపై 2018లో).. అత్యధిక మ్యాచ్‌ల్లో (76) కెపె్టన్‌గా వ్యవహరించిన ప్లేయర్‌గా ఫించ్‌ పేరిట రికార్డులు ఉన్నాయి.  

Australian Open: ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేత నొవాక్ జకోవిచ్.. నాదల్ రికార్డు సమం

Khelo India Youth Games 2023: తెలంగాణకు రెండు స్వర్ణాలు 
ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌లో ఫిబ్ర‌వ‌రి 7వ తేదీ తెలంగాణ ఖాతాలో రెండు స్వర్ణ పతకాలు చేరాయి. ఫెన్సింగ్‌ క్రీడాంశంలో బాలుర ఈపీ వ్యక్తిగత విభాగంలో వేమాని లోకేశ్‌ విజేతగా నిలిచాడు. ఫైనల్లో లైష్రామ్‌ (బెంగాల్‌)పై లోకేశ్‌ 15–14తో నెగ్గి బంగారు పతకాన్ని దక్కించుకున్నాడు. స్విమ్మింగ్‌ బాలికల 800 ఫ్రీస్టయిల్‌ ఈవెంట్‌లో వ్రితి అగర్వాల్‌ అగ్రస్థానంలో నిలిచి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. వ్రితి 9ని:35.67 సెకన్లలో రేసును ముగించి అగ్రస్థానంలో నిలిచింది. ప్రస్తుతం తెలంగాణ ఐదు స్వర్ణాలు, మూడు రజతాలు, ఆరు కాంస్యాలతో కలిపి మొత్తం 14 పతకాలతో 11వ స్థానంలో ఉంది. 

వీక్లీ కరెంట్ అఫైర్స్ (Sports) క్విజ్ (15-21 జనవరి 2023)

Satyanarayana Raju: కెనరా బ్యాంక్‌ ఎండీ, సీఈఓగా సత్యనారాయణ రాజు 
కెనరా బ్యాంక్‌ మేనేజింగ్‌ డైరెక్టర్, సీఈఓగా (ఎండీ, సీఈఓ) కే సత్యనారాయణ రాజు నియమితులయ్యారు. తక్షణం అమల్లోకి వచ్చేలా ఈ నియామకం జరిగినట్లు బ్యాంక్‌ ఒక ప్రకటనలో తెలిపింది. గతేడాది డిసెంబర్‌ 31న బాధ్యతలు విరమించిన ఎల్‌వీ ప్రభాకర్‌ స్థానంలో ఈ నియామకం జరిగింది. ఆయన 2021 మార్చి నుంచి కెనరా బ్యాంక్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. ఫిజిక్స్‌ గ్రాడ్యుయేట్, బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ (బ్యాంకింగ్, ఫైనాన్స్‌) పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ అయిన రాజు, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకర్స్‌ సర్టిఫైడ్‌ అసో సియేట్‌ (సీఏఐఐబీ) కూడా కావడం గమనార్హం. 

Indian American Usha Reddy: అమెరికాలో సెనేటర్‌ గా భారతీయ అమెరికన్‌

Published date : 08 Feb 2023 06:08PM

Photo Stories