Skip to main content

Granules Investments: ఏపీలో రూ.2,000 కోట్లతో గ్రాన్యూల్స్‌ ప్లాంట్‌

ఔషధ తయారీ సంస్థ గ్రాన్యూల్స్‌.. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ వద్ద భారీ ప్లాంటును ఏర్పాటు చేయనుంది. వచ్చే అయిదేళ్లలో ఈ కేంద్రానికి కంపెనీ రూ.2,000 కోట్లు పెట్టుబడి పెట్టనుంది.

100 ఎకరాల విస్తీర్ణంలో దశలవారీగా ఈ ఫెసిలిటీ కార్యరూపం దాల్చనుంది. ఔషధాల ఉత్పత్తికి కావాల్సిన కీ స్టార్టింగ్‌ మెటీరియల్స్, ఇంటర్మీడియేట్స్, యాక్టివ్‌ ఫార్మాస్యూటికల్‌ ఇంగ్రీడియెంట్స్, ఫెర్మెంటేషన్‌ ఆధారిత ఉత్పత్తులను ఇక్కడ తయారు చేస్తారు. కాగా, గ్రాన్యూల్స్‌ తాజాగా గ్రీన్‌కో జీరోసీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఉద్గార రహిత విద్యుత్‌ను గ్రీన్‌కో ఈ ప్లాంటుకు సరఫరా చేస్తుంది. అలాగే డీసీడీఏ, పీఏపీ, పారాసీటమాల్, మెట్‌ఫార్మిన్, ఏపీఐలు, ఇంటర్మీడియేట్స్‌ తయారీలో వాడే రసాయనాలను సైతం అందిస్తుంది. గ్రాన్యూల్స్‌ ఇండియా సీఎండీ కృష్ణ ప్రసాద్‌ చిగురుపాటి, గ్రీన్‌కో గ్రూప్‌ ఫౌండర్‌ మహేశ్‌ కొల్లి ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. 

Nirmala Sitharaman: ద్రవ్యోల్బణాన్ని గమనిస్తూనే ఉన్నాం.. మంత్రి సీతారామన్‌

Published date : 04 Jan 2023 03:18PM

Photo Stories