Skip to main content

Daily Current Affairs in Telugu: 2022, నవంబర్ 8th కరెంట్‌ అఫైర్స్‌

Current Affairs in Telugu November 8th 2022 (డైలీ కరెంట్‌ అఫైర్స్‌ తెలుగులో): Current Affairs for All Competitive Exams In Telugu. Latest Articles useful for TSPSC &APPSC Group-1,2,3, 4, SSC, Bank, SI, Constable and all other competitive examinations
Current Affairs in Telugu November 8th 2022
Current Affairs in Telugu November 8th 2022


Chinese Academy of Sciences: ‘పునరుత్పత్తి’ అధ్యయనానికి...అంతరిక్షంలోకి కోతులు 

 

బీజింగ్‌:  అంతరిక్ష ప్రయోగాల విషయంలో ఇప్పటిదాకా ఏ దేశమూ చేయని ప్రయత్నాన్ని డ్రాగన్‌ దేశం చైనా చేస్తోంది. గురుత్వాకర్షణ రహిత స్థితిలో జీవుల పునరుత్పత్తి జరుగుతుందా? అసలు అంతరిక్షంలో సం
భోగం సాధ్యమేనా? అనేది తెలుసుకోవడానికి సన్నద్ధమవుతోంది. ఇందుకోసం కోతులను అంతరిక్షంలోకి పంపించాలని నిర్ణయించింది. ‘చైనీస్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌’ ఈ ప్రయోగాన్ని పర్యవేక్షిస్తోంది. చైనా సొంతంగా ‘తియాంగాంగ్‌’ పేరిట స్పేస్‌ స్టేషన్‌ను నిర్మించుకున్న సంగతి తెలిసిందే. ఈ స్టేషన్‌లోని వెంటియన్‌ మాడ్యుల్‌లోకి కోతులను పంపించనున్నారు. గురుత్వాకర్షణ శక్తి ఏమాత్రం లేనిచోట వాటి ప్రవర్తనను అధ్యయనం చేస్తారు.

Also read: Daily Current Affairs in Telugu: 2022, నవంబర్ 7th కరెంట్‌ అఫైర్స్‌


భార రహిత స్థితిలో వాటి మధ్య సంభోగం, ఆడ కోతుల్లో పునరుత్పత్తి జరుగుతాయో లేదో తెలుసుకుంటారు. చంద్రుడు, అంగారకుడిపై నివాసాలు ఏర్పాటు చేసుకొనే దిశగా ఇప్పటికే పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అంతరిక్షంలో కోతుల పునరుత్పత్తిపై చైనా చేస్తున్న ప్రయోగాల ఫలితాలు కీలకంగా మారుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. చైనా తియాంగాంగ్‌ స్పేస్‌ స్టేషన్‌ ప్రస్తుతం భూమి నుంచి 388.9 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. ఇందులోని వెంటియన్‌ మాడ్యుల్‌లో ప్రస్తుతం ఆల్గే, చేపలు, నత్తలు వంటి చిన్న జీవులు జీవించడానికి అవకాశం ఉంది. కానీ, అవసరమైతే పెద్ద జీవులకు తగ్గట్లుగా పరిణామం పెంచుకొనేలా మాడ్యూల్‌ను డిజైన్‌ చేశారు. స్పేస్‌ స్టేషన్‌లోకి కోతులను పంపించగానే సరిపోదు, వాటికి ఆహారం అందజేయడం, ఆరోగ్యాన్ని కాపాడడం, వాటి వ్యర్థాలను నిరీ్వర్యం చేయడం పెద్ద సవాలేనని చెప్పొచ్చు.   

Also read: CHINA MANNED SPACE: చైనా రెండో ల్యాబ్‌ మాడ్యూల్‌... విజయవంతంగా అంతరిక్షంలోకి

Solar system:హంతక శకలం భూమిని ఢీకొనే ప్రమాదం 

 

శాంటియాగో: గ్రహాల పాలిట ప్రాణాంతకమైనదిగా భావిస్తున్న గ్రహశకలం ఒకటి మన సౌరవ్యవస్థలో చక్కర్లు కొడుతోంది. దాదాపు మైలు వెడల్పున్న దీన్ని 2022 ఏపీ7గా పిలుస్తున్నారు. ఈ గ్రహశకలం ఏదో ఒక రోజు భూమిని ఢీకొట్టొచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దాని కక్ష్య ఏదో దాన్ని ఒకనాడు భూ కక్ష్యలోకి ప్రవేశపెట్టే అవకాశాలు చాలా ఉన్నాయట. ఇది దీర్ఘవృత్తాకారంగా భ్రమిస్తున్నందువల్ల భూమికి ఏకంగా 30 లక్షల కిలోమీటర్ల సమీపానికి కూడా రాగలదట! అంతరిక్షంలో పెద్దగా లెక్కలోకే రాని దూరమిది. గత మార్చిలో 2022 ఏపీ7 భూమికి 1.3 కోట్ల మైళ్ల దూరంలో ఉంది. మరో ఐదేళ్లపాటు ఇంతకంటే సమీపానికి వచ్చే అవకాశమైతే లేదంటున్నారు. గత ఎనిమిదేళ్లలో మన కంటబడ్డ ప్రమాదకర శకలాల్లో ఇదే అతి పెద్దది. అంతేకాదు, చిలీలోని అబ్జర్వేటరీ నుంచి సౌరవ్యవస్థలో తాజాగా కనిపెట్టిన మూడు గ్రహశకలాల్లో ఇదే పెద్దది. మిగతా రెండు అర మైలు, పావు మైలు వెడల్పున్నాయి. వీటి గురించి ఆస్ట్రనామికల్‌ జర్నల్లో వ్యాసం ప్రచురితమైంది. 

Also read: Hubble telescope: డిడిమోస్‌ ఢీ! గ్రహశకలానికి తోకలు

భూమికి 1.3 ఆస్ట్రనామికల్‌ యూనిట్స్, అంటే 12.1 కోట్ల మైళ్ల కంటే సమీపానికి వస్తే వాటిని నియర్‌ ఎర్త్‌ ఆస్టిరాయిడ్స్‌ అంటాం.

Chief Justice: వాగ్దానాలు కొంతవరకు నెరవేర్చా వీడ్కోలు సభలో సీజేఐ యు.యు.లలిత్‌   

 

న్యూఢిల్లీ:  ఇచ్చిన వాగ్దానాలను కొంత వరకు నెరవేర్చగలిగానని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ యు.యు.లలిత్‌ చెప్పారు. ఎల్లవేళలా పనిచేసే ఒక రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేయడం, కేసుల జాబితాను క్రమబద్ధం చేసే వ్యవస్థను నెలకొల్పడం, పెండింగ్‌ కేసుల సంఖ్యను తగ్గించడం వంటి విషయాల్లో తన వంతు కృషి చేశానని తెలిపారు. జస్టిస్‌ యు.యు.లలిత్‌ పదవీ కాలం నవంబర్ 8న ముగిసింది. సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఢిల్లీలో వీడ్కోలు సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జస్టిస్‌ యు.యు.లలిత్‌ మాట్లాడారు. సీజేఐగా బాధ్యతలు చేపట్టిన మొదటి రోజు నుంచే పెండింగ్‌ కేసులపై దృష్టి పెట్టానని, వేలాది కేసులు పరిష్కరించానని వివరించారు. ఈ వీడ్కోలు సభకు కాబోయే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, పలువురు న్యాయవాదులు హాజరయ్యారు.  

Also read: Supreme Court New Chief Justice: సుప్రీం కోర్ట్‌ చీఫ్‌ జస్టిస్‌గా లలిత్‌

నా ప్రయాణం సంతృప్తికరం  
సుప్రీంకోర్టులో 37 ఏళ్ల వృత్తి జీవితంలో న్యాయవాదిగా, న్యాయమూర్తిగా ప్రతి దశను ఆనందించానని జస్టిస్‌ లలిత్‌ పేర్కొన్నారు. తన ప్రయాణం సంతృప్తికరంగా సాగిందన్నారు. జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ తండ్రి, 16వ సీజేఐ జస్టిస్‌ యశ్వంత్‌ విష్ణు చంద్రచూడ్‌ ముందు న్యాయవాదిగా పనిచేశానని గుర్తుచేసుకున్నారు. ఇదే కోర్టులో మొదలైన తన ప్రయాణం, ఇక్కడే ముగుస్తోందంటూ భావోద్వేగానికి గురయ్యారు. పలు రాజ్యాంగ ధర్మాసనాలు ఏర్పాటు చేయడం తనకు మర్చిపోలేని జ్ఞాపకమని అన్నారు. కోర్టులో ఉన్న న్యాయమూర్తులందరినీ రాజ్యాంగ ధర్మాసనాల్లో సభ్యులుగా చేశానని తెలిపారు. జస్టిస్‌ లలిత్‌ ఆగస్టు 27న సీజేఐగా బాధ్యతలు స్వీకరించారు. కేవలం 74 రోజులు పదవిలో కొనసాగారు.   


COP-27 conference: భూతాపం ఆందోళనకర స్థాయిలో పెరుగుతోంది.. దేశాలన్నీ సహకరించుకోకపోతే వినాశనమే: గుటేరస్‌ 

షెర్మ్‌–ఎల్‌–షేక్‌: ప్రపంచ దేశాలన్నీ పరస్పరం సహకరించుకోకపోతే వినాశనం తప్పదని ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్‌ ఆంటోనియో గుటేరస్‌ హెచ్చరించారు. నరక కూపం దిశగా ప్రపంచ పయనం సాగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. వాతావరణ మార్పులను నియంత్రించకపోతే ఊహించని ఉత్పాతాలు తప్పవని పేర్కొన్నారు. కాలుష్య ఉద్గారాల విషయంలో అతిపెద్ద దేశాలైన చైనా, అమెరికా ఇకనైనా కళ్లు తెరవాలని, రాబోయే దుష్పరిణామాలను నివారించడానికి కలిసికట్టుగా పనిచేయాలని హితవు పలికారు. ఈజిప్ట్ లోని షెర్మ్‌–ఎల్‌–షేక్‌లో నవంబర్ 7న కాప్‌–27 సదస్సులో వివిధ దేశాల నేతలు, ప్రతినిధులను ఉద్దేశించి గుటేరస్‌ ప్రసంగించారు. భూతాపం ఆందోళనకర స్థాయిలో పెరుగుతోందని చెప్పారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో వాతావరణంలో అనూహ్య మార్పులు కనిపిస్తున్నాయని, కరువులు, వరదలు మానవాళికి పెనుసవాళ్లు విసురుతున్నాయని గుర్తుచేశారు. కర్బన ఉద్గారాలను తగ్గించుకొనేలా ధనిక, పేద దేశాలు ఒక కొత్త ఒప్పందం కుదుర్చుకోవాలని చెప్పారు. ధనిక దేశాలు 2030 నాటికి, ఇతర దేశాలకు 2040 నాటికి బొగ్గు వాడకాన్ని పూర్తిగా నిలిపివేయాలని గుటేరస్‌ కోరారు.  

Also read: WHO Latest Report: శారీరక శ్రమ లోపిస్తే రూ.25 లక్షల కోట్ల నష్టం

మనకున్న సమయం పరిమితం  
వాతావరణ మార్పులకు ఫుల్‌స్టాప్‌ పెట్టాల్సిన సమయం వచ్చిందని ఈజిప్ట్‌ అధ్యక్షుడు అబ్దెల్‌ ఫతా అల్‌–సిసీ ఉద్ఘాటించారు. మనం జోక్యం చేసుకోకపోతే వాతావరణ మార్పులు ఎప్పటికీ ఆగవని అన్నారు. సమయం పరిమితంగానే ఉందని, ప్రతి సెకెన్‌ కాలాన్ని వాడుకోవాలని సూచించారు. యుద్ధాన్ని ఆపాలని రష్యా, ఉక్రెయిన్‌కు విజ్ఞప్తి చేశారు. వాతావరణ మార్పుల వల్ల నష్టపోతున్న పేద దేశాలకు ధనిక దేశాలకు ఆర్థిక సాయం అందజేసి ఆదుకోవాలని నైజీరియా పర్యావరణశాఖ మంత్రి మొహమ్మద్‌ అబ్దుల్లాహీ కోరారు. ఇందుకోసం క్లైమేట్‌ ఫండ్‌ ఏర్పాటు చేయాలన్నారు.   


EWS కోటా చెల్లుతుంది... చరిత్రాత్మక తీర్పు వెలువరించిన Supreme Court.. 

 

సాక్షి, న్యూఢిల్లీ: అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్‌) EWS 10 శాతం రిజర్వేషన్ల కోటా విషయంలో కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో విజయం లభించింది. ఈడబ్ల్యూఎస్‌ కల్పిస్తూ తీసుకొచ్చిన 103వ రాజ్యాంగ సవరణ చెల్లుబాటు అవుతుందంటూ సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. సీజేఐ జస్టిస్‌ యు.యు.లలిత్‌ సారథ్యంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఈ మేరకు మెజారిటీ తీర్పు ఇచ్చింది. ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు చెల్లుబాటు అవుతాయని న్యాయమూర్తులు జస్టిస్‌ దినేశ్‌ మహేశ్వరి, జస్టిస్‌ బేలా ఎం త్రివేదీ, జస్టిస్‌ జేబీ పార్డీవాలా, వాటిని కొట్టేస్తూ సీజేఐ జస్టిస్‌ లలిత్, జస్టిస్‌ ఎస్‌.రవీంద్ర భట్‌ తీర్పు ఇచ్చారు.

Also read: SC upholds 10% reservation for Economically Weaker Sections in admissions and govt jobs


ఈ కోటా రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని ఉల్లంఘించదని మెజారిటీ న్యాయమూర్తులు పేర్కొన్నారు. ప్రభుత్వోద్యోగాలు, విద్యా సంస్థల్లో ఆర్థికంగా వెనకబడ్డ వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ 2019లో మోదీ ప్రభుత్వం 103వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చింది. దీని చెల్లుబాటును సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో 40 పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిని సుదీర్ఘంగా విచారించిన ధర్మాసనం సెప్టెంబర్ 27న తీర్పు రిజర్వు చేసింది. నవంబర్ 7న సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం దీనిపై నాలుగు వేర్వేరు తీర్పులు వెలువరించింది. వాటిని 30 నిమిషాలకు పైగా చదివింది. జస్టిస్‌ దినేష్‌ మహేశ్వరి ఈ తీర్పును చదివారు. జస్టిస్‌ రవీంద్ర భట్‌ తీర్పుతో ఏకీభవిస్తున్నట్లు సీజేఐ లలిత్‌ పేర్కొన్నారు. 

Also read: Pension Scheme: పెన్షన్‌ (సవరణ) పథకం సబబే

ఐదుగురు న్యాయమూర్తులు, నాలుగు తీర్పులు 
EWS కోటాపై రాజ్యాంగ ధర్మాసనం నాలుగు వేర్వేరు తీర్పులు వెలువరించింది. 399 పేజీల ఈ తీర్పులో జస్టిస్‌ దినేషశ్‌ మహేశ్వరిదే అధిక భాగం. సీజేఐ విజ్ఞప్తి మేరకు ఆయన తొలుత తీర్పు చదివారు. ఈడబ్ల్యూఎస్‌ కోటాపై నాటి అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ లేవనెత్తిన రాజ్యాంగపరమైన ప్రశ్నలకు తీర్పులో సమాధానమిచ్చారు. ‘‘ఆర్థిక ప్రమాణాల ఆధారంగా రిజర్వేషన్‌తో సహా ప్రత్యేక నిబంధనలకు అనుమతించడాన్ని, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను ఈ కోటా నుంచి మినహాయించడాన్ని రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని ఉల్లంఘించడంగా చెప్పలేం.

Also read: Fundamental Rights Notes for Group 1&2: సమన్యాయ పాలనను ప్రతిపాదించిందెవరు?

50 శాతం సీలింగ్‌ పరిమితిని కూడా ఈ కోటా ఉల్లఘించడం లేదు. ఎందుకంటే ఈ రిజర్వేషన్లకు పరిమితి ఉంది’’అన్నారు. ఈ తీర్పుతో ఏకీభవిస్తున్నట్టు జస్టిస్‌ త్రివేదీ తెలిపారు. ఈడబ్ల్యూఎస్‌ తరగతుల ప్రయోజనం నిమిత్తం పార్లమెంటు ఆమోదించిన సవరణను నిశ్చయాత్మక చర్యగా పరిగణించాలే తప్ప అసమంజసమైన వర్గీకరణ అని చెప్పలేమన్నారు. అసమానతలను సమానంగా చూడడం రాజ్యాంగంలోని సమానత్వాన్ని ఉల్లఘిస్తుందన్నారు. రిజర్వేషన్లకు రాజ్యాంగ నిర్మాతలు నిర్ణయించిన కాలపరిమితిని 75 ఏళ్ల తర్వాత కూడా చేరుకోలేకపోయామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. జస్టిస్‌ మహేశ్వరి, జస్టిస్‌ త్రివేదీల తీర్పుతో ఏకీభవిస్తున్నట్లు జస్టిస్‌ పార్డీవాలా కూడా పేర్కొన్నారు. ‘‘విస్తృత ప్రయోజనాల నిమిత్తం ‘‘రిజర్వేషన్లను పునః పరిశీలించాల్సి ఉంది. విద్య, ఉపాధిల్లో తగిన ప్రమాణాలు సాధించిన వర్గాలను వెనకబడిన జాబితా నుంచి తొలగించాలి. తద్వారా నిజంగా సాయం అవసరమైన వర్గాలపై దృష్టి పెట్టగలం. వెనకబాటుతనాన్ని గుర్తించే ప్రమాణాలు ప్రస్తుత కాలానికి తగ్గట్టుగా ఉన్నదీ లేనిదీ కూడా సరిచూసుకోవాల్సిన అవసరముంది’’అన్నారు. 

Also read: Supreme Court Bans Two-Finger Test

మైనారిటీ తీర్పు... 
వెనకబడిన తరగతుల ప్రయోజనాలు పొందుతున్న వారు ఏదో ఒక విధంగా మెరుగైన స్థానంలో ఉన్నారని ఇప్పటికీ నిశ్చయంగా నమ్మలేకపోతున్నామని జస్టిస్‌ భట్‌ తన మైనారిటీ తీర్పులో పేర్కొన్నారు. ‘‘ఆర్టికల్‌ 16(1), ఆర్టికల్‌ 16(4) ఒకే సమానత్వ సూత్రపు కోణాలని సుప్రీంకోర్టు గతంలో స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఈడబ్ల్యూఎస్‌ కోటా నుంచి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను మినహాయించడం వారి పట్ల వివక్ష చూపడమే. ఆర్థిక పేదరికం, ఆర్థిక వెనకబాటుతనం ప్రాతిపదికన రిజర్వేషన్లు అనుమతించినప్పటికీ ఎస్సీ, ఎస్టీలు, ఓబీసీలను మినహాయించడం రాజ్యాంగ విరుద్ధం.

Also read: Supreme Court: ఐటీ చట్టం సెక్షన్‌ 66-ఏ కింద ప్రాసిక్యూట్‌ చేయరాదు

2001 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీల్లో 38 శాతం, ఎస్టీల్లో 48 శాతం దారిద్యరేఖకు దిగువన ఉన్నట్లు సిన్హో కమిషన్‌ నివేదిక పేర్కొంది. రిజర్వేషన్లకు 50 శాతం పరిమితిని కూడా 103వ రాజ్యాంగ సవరణ ఉల్లంఘిస్తోంది. 50 శాతం నిబంధనకు ఇలా ఉల్లంఘనను అనుమతిస్తే అదో మార్గంగా మారుతుంది. కనుక ఆర్థిక ప్రమాణాల ఆధారంగా రిజర్వేషన్లు చెల్లవు. ఈ నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీలు, ఓబీసీలను మినహాయిస్తూ చేసిన 103వ సవరణ రాజ్యాంగ విరుద్ధం’’అని స్పష్టం చేశారు. జస్టిస్‌ భట్‌ తీర్పుతో సీజేఐ ఏకీభవించారు. 

Also read: Supreme Court: మతం మారిన దళితులకు ఎస్సీ హోదాపై అధ్యయనం

 
‘‘ఆర్థిక ప్రమాణాలపై రిజర్వేషన్‌ ప్రవేశపెట్టడం అనుమతించదగినదే. కానీ ఎస్సీఎస్టీ, ఓబీసీల్లో వెనకబడిన తరగతుల వారు ప్రయోజనాలు పొందుతున్నారనే కారణంతో వారిని మినహాయించడం ఏకపక్షం. 103వ రాజ్యాంగ సవరణ చట్టంలోని సెక్షన్‌ 3 రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని ఉల్లంఘిస్తోంది. కనుక అది రాజ్యాంగ విరుద్ధం. అందుకే ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లను కొట్టేస్తున్నాం’’ 
– సీజేఐ జస్టిస్‌ లలిత్, జస్టిస్‌ ఎస్‌.రవీంద్ర భట్‌ 

‘‘ఆర్థిక ప్రమాణాలపై ఏకవచనంతో రూపొందించిన రిజర్వేషన్‌ రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణాన్ని ఉల్లంఘించదు. రాజ్యాంగ సవరణ రిజర్వేషన్ల50శాతం సీలింగ్‌ పరిమితి మించనందకు, ఎస్సీఎస్టీ, ఓబీసీలను ఈడబ్ల్యూఎస్‌ల నుంచి మినహాయించినంత మాత్రాన ప్రాథమిక నిర్మాణాన్ని ఉల్లంఘించినట్లు చెప్పలేం’’ 
– జస్టిస్‌ దినేశ్‌ మహేశ్వరి 

Also read: Supreme Court: హిజాబ్‌పై సుప్రీం భిన్నతీర్పులు

 
‘‘103వ రాజ్యాంగ సవరణను కొట్టేయలేం. అది చెల్లుబాటవుతుంది. ఈడబ్ల్యూఎస్‌ వర్గం లబ్ధి కోసం పార్లమెంటు తీసుకున్న సకారాత్మక చర్యగా దాన్ని చూడాలి. అయితే రిజర్వేషన్లకు కాలపరిమితి ఉండాలి. పార్లమెంటు, శాసనసభల్లో ఎస్సీ, ఎస్టీ ప్రాతినిధ్య గడువుకు కాలపరిమితి ఉంది. పార్లమెంటులో ఆంగ్లో ఇండియన్ల రిజర్వేషన్లకు తెర పడింది. స్వాతంత్య్ర అమృతోత్సవాల వేళ సమాజ విస్తృత ప్రయోజనాల నిమిత్తం రిజర్వేషన్ల వ్యవస్థను పునఃపరిశీలించాల్సిన అవసరముది’’ 
– జస్టిస్‌ బేలా ఎం త్రివేదీ 
 
‘‘జస్టిస్‌ త్రివేదీ తీర్పుతో ఏకీభవిస్తున్నా. కానీ రిజర్వేషన్లను నిరవధికంగా కొనసాగిస్తే అవి స్వార్థ ప్రయోజనాలుగా మారే ప్రమాదముంది. వాటిని కేవలం పదేళ్లపాటు అమలు చేయడం ద్వారా సామాజిక సామరస్యాన్ని తీసుకురావాలని అంబేడ్కర్‌ యోచించారు. కానీ ఏడు దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉన్నాయి. రిజర్వేషన్లు బలహీనవర్గాల సామాజిక, విద్యాపరమైన వెనకబాటు తొలగించే కసరత్తులా మాత్రమే ఉండాలి’’ 
– జస్టిస్‌ జేబీ పార్డీవాలా  

 

Published date : 08 Nov 2022 03:15PM

Photo Stories