Daily Current Affairs in Telugu: 2022, జులై 22nd కరెంట్ అఫైర్స్
India 's 15th President : ద్రౌపదీ ముర్మ
సంతాల్ ఆదివాసీ తెగకు చెందిన గిరిజన ముద్దుబిడ్డ ద్రౌపదీ ముర్ము భారత 15వ రాష్ట్రపతిగా తిరుగులేని మెజారిటీతో ఎన్నికయ్యారు. తద్వారా దేశ తొలి గిరిజన రాష్ట్రపతిగా రికార్డు సృష్టించారు. స్వాతంత్య్రానంతరం జన్మించిన తొలి రాష్ట్రపతిగానే గాక ఇప్పటిదాకా ఆ పదవి చేపట్టిన వారిలో అత్యంత పిన్న వయస్కురాలిగా నిలిచారు. అధికార ఎన్డీఏ తరఫున బరిలో దిగిన ముర్ము జూలై 21న జరిగిన ఓట్ల లెక్కింపులో దాదాపు మూడింట రెండొంతల మెజారిటీతో విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాపై ఘన విజయం సాధించారు. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వారసురాలిగా 25వ తేదీన పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రతిభా పాటిల్ తర్వాత ఈ పదవి అధిష్టించనున్న రెండో మహిళ ముర్ము.
Also read; Weekly Current Affairs (International) Bitbank: అధికారికంగా పేరు మార్చుకున్న దేశం ఏది?
ప్రతి రౌండూ ముర్ముదే
రాష్ట్రపతి ఎన్నికకు జూలై 18న పోలింగ్ జరిగింది. ఎలక్టోరల్ కాలేజీ సభ్యులైన ఎన్నికైన పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు పార్లమెంట్ హౌస్‌తో పాటు దేశవ్యాప్తంగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. జూలై 21న ఉదయం 11 గంటలకు పార్లమెంట్ హౌస్‌లోని 63వ నంబర్ గదిలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైంది. తొలుత పార్లమెంటు సభ్యుల ఓట్లు లెక్కించారు. అనంతరం అక్షర క్రమంలో రాష్ట్రాలవారీగా ఎమ్మెల్యేల ఓట్లను లెక్కించారు. అంతా ఊహించినట్టుగానే కౌంటింగ్ ప్రారంభం నుంచే సిన్హాపై ముర్ము నిర్ణాయక ఆధిపత్యం ప్రదర్శిస్తూ వచ్చారు. ప్రతి రౌండ్‌లోనూ దాదాపు మూడింట రెండొతుల ఓట్లతో దూసుకెళ్లారు. మూడో రౌండ్‌లోనే 50 శాతం ఓట్లు దాటేసి విజయానికి అవసరమైన మెజారిటీ మార్కు సాధించారు. అప్పటికి మరో 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఓట్ల లెక్కింపు మిగిలే ఉంది. చివరిదైన నాలుగో రౌండ్ కౌంటింగ్ ముగిశాక ముర్ము విజయాన్ని చీఫ్ రిటర్నింగ్ ఆఫీసర్‌గా వ్యవహరించిన రాజ్యసభ సెక్రెటరీ జనరల్ పీసీ మోదీ అధికారికంగా ప్రకటించారు.
Also read; Gita Gopinath: గీతా గోపీనాథ్‌కు అరుదైన గౌరవం
- మొత్తం 776 మంది ఎంపీలు, 4,033 మంది ఎమ్మెల్యేలు కలిపి ఎలక్టోరల్ కాలేజీలో 4,809 మంది సభ్యులున్నారు. వీరిలో4,754 మంది ఓటేశారు. వారి మొత్తం ఓట్ల విలువ 10,72,377.
- వాటిలో ముర్ము 64.03 శాతం ఓట్లు సాధించగా సిన్హా 36 శాతంతో సరిపెట్టుకున్నారు. ముర్ముకు 6,76,803 పోలవగా సిన్హాకు 3,80,177 పడ్డాయి.
- 2,824 మంది ప్రజాప్రతినిధులు ముర్ముకు, 1,877 మంది సిన్హాకు ఓటేశారు.
- 15 మంది ఎంపీలతో పాటు మొత్తం 53 మంది ఓట్లు చెల్లకుండా పోయాయి.
- ఎంపీల ఓట్లలో 540 (72.19 శాతం) ముర్ముకే పడ్డాయి. సిన్హాకు 208 మంది ఓటేశారు.
- 17 మంది ఎంపీలతో పాటు దాదాపు 125 మందికి పైగా విపక్ష ఎమ్మెల్యేలు ముర్ముకు ఓటేసినట్టు తేలింది.
- ముర్ముకు యూపీ, మహారాష్ట్ర, ఏపీల నుంచి అత్యధిక ఓట్లు వచ్చాయి. సిన్హాకు పశ్చిమబెంగాల్, తమిళనాడు నుంచి అత్యధిక ఓట్లు పడ్డాయి.
- ఆంధ్రప్రదేశ్, సిక్కింలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలంతా, నాగాలాండ్‌లో మొత్తం ఎమ్మెల్యేలూ ముర్ముకే ఓటేశారు.
- కేరళ నుంచి దాదాపుగా అన్ని ఓట్లూ సిన్హాకే పడ్డాయి.
మొత్తం ఓట్ల విలువ 10,72,377
ముర్ముకు ఓట్లు - 6,76,803
సిన్హాకు ఓట్లు - 3,80,177
Also read; Weekly Current Affairs (International) Bitbank: అధికారికంగా పేరు మార్చుకున్న దేశం ఏది?
ముర్ము ప్రస్థానం
పేరు: ద్రౌపది ముర్ము
పుట్టిన తేదీ: జూన్ 20, 1958
పుట్టిన ఊరు: ఉపర్‌బేడ, మయూర్‌భంజ్, ఒడిశా
వయస్సు: 64 ఏళ్లు
తండ్రి: బిరంచి నారాయణ్ తుడు
రాజకీయ పార్టీ: బీజేపీ
చదువు: రమాదేవి విమెన్స్ యూనివర్సిటీ నుంచి బీఏ
చేపట్టిన పదవులు: జార్ఖండ్ గవర్నర్, ఒడిశా రాష్ట్ర మత్స్య, పశుసంవర్థక, వాణిజ్యం, రవాణా శాఖలు
సంతానం: ఇతిశ్రీ ముర్ము (బ్యాంకు ఉద్యోగి)
భర్త: శ్యాం చరణ్ ముర్ము (2014లో మృతి)
Also read; Weekly Current Affairs (Persons) Bitbank: సశాస్త్ర సీమ బల్ కొత్త డైరెక్టర్ జనరల్‌గా ఎవరు నియమితులయ్యారు?
AP సముద్ర తీరంలో సీవీడ్ పెంపకం
ఎన్నో పోషక విలువలు.. మరెన్నో ఔషధ గుణాల మేలు కలయిక.. సీవీడ్ (సముద్రంలో పెరిగే నాచులాంటి మొక్క). జపాన్, చైనా, కొరియా తదితర దేశాల్లో ప్రాచీన కాలం నుంచి నేరు గానూ, ఆహార పదార్థాల రూపంలోనూ దీన్ని తింటున్నారు. సీవీడ్‌పై ఇప్పుడు మనదేశంలోనూ ఆసక్తి పెరుగుతోంది. మారుతున్న జీవనశైలి, ఆరోగ్యంపై శ్రద్ధ అధికమవుతున్న నేపథ్యంలో సీవీడ్ ఆధారిత ఆహార ఉత్పత్తులపై ప్రజలు మక్కువ చూపుతు న్నారు. వీటిలో సోడియం, కాల్షియం, క్లోరిన్, మెగ్నీషియంతోపాటు ప్రొటీన్లు, ఫైబర్, విటమిన్లు, ఫోలిక్ యాసి డ్‌లు పుష్కలంగా లభిస్తాయి. తక్కువ కొవ్వు, కేలరీలుంటాయి. సీవీడ్‌లో పలు ఔషధ గుణాలు ఉండడంతో వాటితో తయారైన ఆహార పదార్థాలను తినడం వల్ల క్యాన్సర్, మధుమేహం, రక్త పోటు, గుండె జబ్బులు, హెచ్‌ఐవీ, కోవిడ్ వంటివి నియంత్రణలోకి వస్తాయని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ (సీఐ ఎఫ్‌టీ) శాస్త్రవేత్తలు చెబుతు న్నారు. ఈ నేపథ్యంలో దేశంలో సముద్ర తీరంలో సీవీడ్ పెంపకానికి అనువైన ప్రాంతా లను గుర్తించడా నికి సెంట్రల్ మెరైన్ ఫిష రీస్ రీసెర్చ్ ఇన్‌స్టి ట్యూట్ శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. ఆంధ్ర ప్రదేశ్‌లో 49 ప్రాంతాల్లో తీరా నికి ఆనుకుని సముద్రంలో 1,215 హెక్టార్లు సీవీడ్ పెంపకా నికి అనువుగా ఉందని గుర్తించారు. ఔత్సాహి కులు ముందుకొస్తే పెంచేందుకు ఈ ప్రాంతాలు అనుకూలమని నిర్ధారించారు. సము ద్రంలో కేజ్ కల్చర్‌తోపాటు మల్టీ ట్రాఫిక్ ఆక్వాకల్చర్ పేరిట సీవీడ్‌ను పెంచేలా ఆలోచన చేస్తున్నారు.
Also read; Weekly Current Affairs (Awards) Bitbank: అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ 2022 గెలుచుకున్న మొదటి హిందీ నవల ఏది?
NITI Aayog's: భారత ఆవిష్కరణల సూచీ– 2021
నీతి ఆయోగ్ ప్రకటించిన ‘ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్–2021 (భారత ఆవిష్కరణల సూచీ– 2021)’ మూడో ఎడిషన్ ర్యాంకుల్లో దేశంలో కర్ణాటక తొలి స్థానంలో, తెలంగాణ రెండో స్థానంలో, హరియాణా మూడో స్థానంలో నిలిచాయి. ఏడు అంశాల్లో 66 సూచికల ఆధారంగా రాష్ట్రాల పనితీరును ఇన్‌స్టిట్యూట్ ఫర్ కాంపిటీ టివ్‌నెస్ (ఐఎఫ్‌సీ) సహకారంతో నీతి ఆయోగ్ అధ్యయనం చేసి.. ‘గ్లోబల్ ఇండియన్ ఇండెక్స్ (జీఐఐ)’ స్కోర్‌ను కేటాయించింది. నివేదికను నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బెరీ జూలై 21న ఆవిష్కరించారు.
Also read: దండుమల్కాపూర్‌లో బొమ్మల తయారీ పార్క్
పెర్ఫార్మర్స్‌లో టాప్
ఏడు అంశాల ఆధారంగా మొత్తం స్కోర్ కేటాయించగా.. ఇందులో ఐదింటి ఆధారంగా పెర్ఫార్మర్స్ (అద్భుత పనితీరు చూపినవారు)గా, మరో రెండింటి ఆధారంగా ఎనేబులర్స్ (సాధించినవారు)గా గుర్తించారు. పెద్ద రాష్ట్రాలు, ఈశాన్య పర్వత ప్రాంత రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతా లకు వేర్వేరుగా స్కోర్‌ను కేటాయించారు. పెద్ద రాష్ట్రాల జాబితాలో 17.66 సగటు స్కోర్‌తో తెలంగాణ దేశంలో రెండో స్థానంలో నిలిచింది. తొలిస్థానంలో కర్ణాటక (18.01), మూడోస్థానంలో హరియాణా ఉన్నాయి. 13.32 స్కోరుతో ఆంధ్రప్రదేశ్ 9వ స్థానంలో నిలిచింది. ఇక కేటగిరీల వారీగా చూస్తే.. పెర్ఫార్మర్స్ కేటగిరీలో 15.24 స్కోర్‌తో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలవగా.. ఎనేబులర్స్ కేటగిరీలో 20.08 స్కోర్‌తో నాలుగో స్థానంలో నిలిచింది.
Also read: భారత్ GDPని 7.3 శాతానికి తగ్గించిన Morgan Stanley
ఎంఎన్‌సీలు, స్టార్టప్‌లతో మెరుగైన పనితీరు
స్టార్టప్‌లకు తెలంగాణ నిలయంగా మారుతోంది. ‘ఇన్ఫ ర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ)’ ప్రయోగ శాలలను కలిగి ఉన్న పాఠశాలల విషయాన్ని తీసుకుంటే.. తెలంగాణలో వాటి సంఖ్య 17 నుంచి 35 శాతానికి పెరిగింది. ఉన్నత విద్య చదువుతున్నవారి శాతం 9.7% నుంచి 15.7 శాతానికి చేరింది. నైపుణ్యం గల మానవ వనరుల సృష్టి కోసం ఏర్పాటు చేసిన ప్రైవేటు పరిశోధన, అభివృద్ధి సంస్థలు కూడా 0.3 నుంచి 1.4 శాతానికి చేరాయి. పేటెంట్లు, ట్రేడ్‌మార్క్‌లు, ఇండస్ట్రియల్ డిజైన్‌ల్లో తెలంగాణ ఉత్తమ పనితీరును కనబరుస్తోంది. స్టార్టప్‌ల సంఖ్య గతేడాదితో పోలిస్తే 4,900 నుంచి 9 వేలకు చేరింది. ‘నాలెడ్జ్ డిఫ్యూజన్’ అంశంలో మాత్రం తెలంగాణ పనితీరును మెరుగుపర్చు కోలేక పోయింది. పరిజ్ఞానం సృష్టించడం, అమలు చేయడంలో ముందంజలో ఉన్నా.. ఉత్పత్తులు, సేవల్లో మాత్రం ఆశించిన స్థాయిలో లేదని నీతి ఆయోగ్ అభిప్రాయపడింది. రాష్ట్రాలు తాము సృష్టిస్తున్న పరిజ్ఞానాన్ని ఉత్పత్తులు, సేవల రూపంలోకి మార్చడంపై దృష్టి సారించాలని సూచించింది.
Also read: GST 2022–23 మొదటి త్రైమాసికంలో జీఎస్టీ వసూళ్లలో 37 శాతం వృద్ధి
‘3ఐ మంత్రం’తో అద్భుత ఫలితాలు: కేటీఆర్
దూరదృష్టి కలిగిన సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్నిరంగాల్లో టాప్‌లో నిలుస్తోందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ‘‘తెలంగాణ ప్రభుత్వం ఆచరిస్తున్న ‘3ఐ మంత్రం’ అద్భుత ఫలితాలను ఇస్తోంది. ఇన్నోవేషన్ (ఆవిష్కరణలు), ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (మౌలిక వసతులు), ఇంక్లూసివ్ గ్రోత్ (సమగ్రాభివృద్ధి)ని రాష్ట్ర ప్రభుత్వం తన విధానంగా మార్చుకుంది. నీతి ఆయోగ్ గురువారం ప్రకటించిన ‘ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్–2021’లో తెలంగాణ మొత్తంగా రెండో స్థానంలో, పెర్ఫార్మర్స్ కేటగిరీలో అగ్రస్థానంలో నిలిచింది’’ అని ట్వీట్ చేశారు.
Also read: Title: Weekly Current Affairs (National) Bitbank: దేశంలో అత్యధికంగా బంగారం నిల్వలను కలిగి ఉన్న రాష్ట్రం ఏది?
శ్రీలంక అధ్యక్షుడిగా విక్రమసింఘే ప్రమాణ స్వీకారం
శ్రీలంక ప్రధానిగా ఆరు పర్యాయాలు పనిచేసిన రణిల్ విక్రమసింఘే(73) నూతన అధ్యక్షుడిగా జూలై 21న ప్రమాణం చేశారు. జూలై 20న పార్లమెంట్‌లో ప్రత్యక్షంగా జరిగిన ఓటింగ్‌లో ఆయన స్పష్టమైన మెజారిటీ దక్కింది. మరుసటి రోజు పార్లమెంట్ భవన సముదాయంలో జరిగిన కార్యక్రమంలో దేశ 8వ అధ్యక్షుడిగా విక్రమసింఘేతో ప్రధాన న్యాయమూర్తి జయంత జయసూర్య ప్రమాణం చేయించారు. మొదటిసారిగా పార్లమెంట్‌కు ఎన్నికైన 45 ఏళ్ల తర్వాత విక్రమసింఘే దేశాధ్యక్ష బాధ్యతలు చేపట్టడం విశేషం.
Weekly Current Affairs (Important Dates) Bitbank: ప్రపంచ థైరాయిడ్ దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు?
Italy's PM: ఇటలీ ప్రధాని మారియో రాజీనామా
ఇటలీ ప్రధాని మారియో ద్రాఘి పదవి నుంచి వైదొలిగారు. జూలై 21న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానంపై ఓటింగ్‌ను సంకీర్ణ ప్రభుత్వంలోని ప్రధాన భాగస్వామ్య పక్షం 5–స్టార్స్ మరో రెండు పార్టీలు బహిష్కరించాయి. దీంతో ద్రాఘి తన రాజీనామా లేఖను అధ్యక్షుడు సెర్గియో మట్టరెల్లాకు అందజేశారు. ప్రభుత్వం నుంచి వైదొలుగుతున్నట్లు 5–స్టార్స్ పార్టీ ప్రకటించడంతో గత వారమే ఆయన రాజీనామా చేసినా అధ్యక్షుడు ఆమోదించలేదు. తాజా పరిణామాలతో మరో సారి అందజేసిన రాజీనామా లేఖను మట్టరెల్లా ఆమోదించారు. తాత్కాలిక అధ్యక్షుడిగా కొనసాగాలని ద్రాఘిని కోరారు. దీంతో, అక్టోబర్‌లో ముందస్తు ఎన్నికలు జరిగేందుకు అవకాశముందని భావిస్తున్నారు.
also read: Right to an Abortion: గర్భస్రావ హక్కును కాపాడుతూ బైడెన్ ఉత్తర్వు
World Athletics Championships: నోరా జెరుటోకు స్వర్ణం
అమెరికాలోని ఒరేగాన్ వేదికగా జరుగుతున్న వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో మహిళల 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లో నోరా జెరుటో (కజకిస్తాన్)కు స్వర్ణం దక్కింది. రేస్‌ను ఆమె 8 నిమిషాల 53.02 సెకన్లలో పూర్తి చేసి కొత్త చాంపియన్‌షిప్ రికార్డును నమోదు చేసింది. వెర్కుహ గెటాచూ (ఇథియోపియా – 8 నిమిషాల 54.61 సె.) రజతం సాధించగా, మెకిడెస్ అబీబీ (ఇథియోపియా – 8 నిమిషాల 56.08 సె.) కాంస్యం గెలుచుకుంది. ఈ ఈవెంట్‌లో టాప్–3లో నిలిచిన ముగ్గురు అథ్లెట్లు కూడా పరుగును 9 నిమిషాల్లోపే పూర్తి చేయడం వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ చరిత్రలో తొలి సారి. జూనియర్ స్థాయిలో కెన్యాకు ప్రాతినిధ్యం వహించి గత ఏడాది కజకిస్తాన్‌కు వలస వెళ్లిన జెరుటో ఈ క్రమంలో టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశాన్ని కూడా కోల్పోయింది. అయితే ఇప్పుడు వరల్డ్ చాంపియన్‌షిప్ బరిలోకి దిగి కజకిస్తాన్‌కు ఈ క్రీడల చరిత్రలో తొలి స్వర్ణాన్ని అందించింది.
also read: World Athletics: ఉక్రెయిన్ అథ్లెట్ మహుచిఖ్ కి రజతం
మహిళల డిస్కస్‌త్రోలో చైనాకు చెందిన బిన్ ఫింగ్ స్వర్ణం గెలుచుకుంది. 69.12 మీటర్లతో ఆమె అగ్ర స్థానంలో నిలిచింది.
India's Growth Rate: భారత వృద్ధి అంచనాలకు ఏడీబీ, ఫిక్కీ కోత
భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) స్థూల దేశీయోత్పత్తి తొలి అంచనాలను ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ), దేశీయ పారిశ్రామిక వేదిక– ఫిక్కీలు తగ్గించాయి. ఏడీబీ తన ఏప్రిల్‌నాటి తొలి అంచనా 7.5 శాతం నుంచి 7.2 శాతానికి కోత పెట్టింది. మరోవైపు ఫిక్కీ అంచనా 7.4 శాతం నుంచి 7 శాతానికి తగ్గింది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధ ప్రభావం, ద్రవ్యోల్బణం భారత్ ఎకానమీపై ప్రతికూల ప్రభావం చూపనున్నాయని ఏడీబీ ఆసియా డెవలప్‌మెంట్ అవుట్‌లుక్ పేర్కొంది. మహమ్మారి ప్రతికూల సవాళ్లు కూడా ఎకానమీపై కొనసాగుతున్నట్లు వివరించింది. ఇక చైనా 2022 ఎకానమీ వృద్ధి అంచనాలను 5 శాతం నుంచి 4 శాతానికి తగ్గిస్తున్నట్లు తెలిపింది. కాగా తమ వృద్ధి రేటు అంచనాల కోతకు భౌగోళిక అనిశ్చితి పరిస్థితులే కారణమని ఫీక్కీ సర్వే పేర్కొంది. 2022–23లో 7 శాతం అంచనావేసినా, కనిష్ట–గరిష్ట స్థాయి అంచనాల శ్రేణిని 6.5 శాతం నుంచి 7.3 శాతంగా పేర్కొంది.
also read: World Shooting : అగ్రస్థానంలో భారత్
Telanganaలో BE రూ. 1800 కోట్ల పెట్టుబడులు
తెలంగాణలో తమ టీకా ఉత్పత్తులు, పరిశోధన రంగాన్ని భారీగా విస్తరించాలని కోవిడ్ వ్యాధి నియంత్రణకు కోర్బివ్యాక్స్ టీకా తయారు చేసిన బయోలాజికల్–ఈ (బీఈ) సంస్థ నిర్ణయించింది. ప్రస్తుతం జీనోమ్ వ్యాలీలోని టీకా ఉత్పత్తులను భారీయెత్తున పెంచేందుకు ఏకంగా రూ.1,800 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టనుంది. తద్వారా ప్రపంచంలోనే అత్యధికంగా టీకాలు ఉత్పత్తి చేసే నగరంగా హైదరాబాద్ ఘనత సాధించనుంది. రూ.1,800 కోట్లకు పైగా పెట్టుబడితో కొత్తగా 2,518 మందికి ఉపాధి లభిస్తుందని బీఈ సంస్థ ప్రకటించింది. జూలై 21న రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుతో సమావేశం తరువాత బీఈ మేనేజింగ్ డైరెక్టర్ మహిమ దాట్ల వివరాలు వెల్లడించారు. జీనోమ్ వ్యాలీలో ప్రస్తుతం ప్రతి ఏడాదీ 900 కోట్ల టీకాలు ఉత్పత్తి అవుతుంటే.. బీఈ తాజా విస్తరణతో 1,400 కోట్ల టీకాల ఉత్పత్తి సామర్థ్యానికి చేరుకుంటుందని తెలిపారు. కోవిడ్ నివారణ టీకా జెన్సెన్, ఎమ్మార్ పీసీవీ , టైఫాయిడ్, ఐపీవీ, పెర్టుసిస్ వ్యాక్సిన్లు.. టెటనస్ టాక్సైడ్ యాంపూల్స్, జెనరిక్ ఇంజెక్టబుల్స్ ఉత్పత్తి లక్ష్యంగా ఈ నిధులను ఖర్చు చేస్తామని చెప్పారు.
Also read: Weekly Current Affairs (Economy) Bitbank: RBI ప్రకారం భారతీయులు ఎక్కువగా ఇష్టపడే బ్యాంక్ నోట్ ఏది?
మూడింట ఒక వంతు హైదరాబాద్ ద్వారానే..
ప్రపంచ టీకా అవసరాల్లో మూడింట ఒక వంతు హైదరాబాద్ ద్వారానే తీరుతోందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్ మొత్తం మీద ఏడాదికి 900 కోట్ల టీకాలు తయారవుతున్నాయని తెలిపారు. జీనోమ్ వ్యాలీ ప్రపంచంలోనే అత్యుత్తమ టీకాల ఉత్పత్తుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటైన క్లస్టర్ అని వివరించారు. ఇందులోని దాదాపు 200 పరిశ్రమల్లో 15 వేల మంది నిపుణులు పనిచేస్తున్నారని చెప్పారు. అంతర్జాతీయ కంపెనీలు నోవార్టీస్, గ్లాక్సో స్మిత్‌క్లైన్, ఫెర్రింగ్ ఫార్మా, కెమో, డూపాంట్, లోంజా తదితర కంపెనీలు ఇక్కడ తమ ఉత్పత్తులు చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
Also read: India's Growth Rate: భారత వృద్ధి అంచనాలకు ఏడీబీ, ఫిక్కీ కోత
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP