Skip to main content

దండుమల్కాపూర్‌లో బొమ్మల తయారీ పార్క్‌

Toy Manufacturing Park at Dandumalkapur
Toy Manufacturing Park at Dandumalkapur

తెలంగాణలో నిర్మల్‌ కొయ్యబొమ్మలు వంటి హస్తకళాకృతులు మినహా చెప్పుకోదగిన స్థాయిలో ఆధునిక పిల్లల ఆటవస్తువులు, బొమ్మల తయారీ యూనిట్లు లేవు. పిల్లల బొమ్మలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని తెలంగాణను టాయ్స్‌హబ్‌గా మార్చేందుకు ప్రభుత్వం సంకల్పించింది. రాష్ట్రంలో ప్రస్తుతం 20 బొమ్మల తయారీ యూనిట్లు ఉన్నట్లు టీఎస్‌ఐఐసీ అంచనా. ఈ నేపథ్యంలో బొమ్మల తయారీ రంగంలో ఉన్న అవకాశాలను మరింతగా ఉపయోగించుకోవాలని సర్కారు భావిస్తోంది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం దండుమల్కాపూర్‌లో బొమ్మల తయారీ యూనిట్ల ఏర్పాటుకు వీలుగా ‘టాయ్స్‌ పార్క్‌’ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే దండుమల్కాపూర్‌లో తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య (టిఫ్‌) ఏర్పాటు చేసిన ఎంఎస్‌ఎంఈ పార్కు కార్యకలాపాలు ప్రారంభించింది. ఇతర పరిశ్రమల ఏర్పాటుకు వీలుగా ప్రభుత్వం మరో రెండు వేల ఎకరాలను సేకరించి మౌలిక వసతులపై దృష్టి సారించింది. ఇక్కడే టాయ్స్‌ పార్కు కోసం డిమాండ్‌ను బట్టి 70 నుంచి 100 ఎకరాల వరకు కేటాయించేందుకు ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. ఇందులో బొమ్మల మ్యూజియం, కామన్‌ ఫెసిలిటీ సెంటర్, చిల్డ్రన్‌ అమ్యూజ్‌మెంట్‌ పార్కు తదితరాలను ఏర్పాటు చేస్తారు.

Also read: AP Government: ‘అమృత్‌ సరోవర్‌’లో ఏపీకి మూడో స్థానం

బొమ్మల వాణిజ్యం విలువ రూ.12వేల కోట్లు పిల్లలకు వినోదంతోపాటు విజ్ఞానం పంచే ఆట వస్తువులు, బొమ్మల తయారీ పరిశ్రమ దేశంలో శైశవ దశలో ఉంది. అయితే ఆటబొమ్మలకు  ఏటా భారత్‌లో 10 నుంచి 15శాతం డిమాండ్‌ పెరుగుతోంది. భారత్‌లో చిన్నారులు ఉపయోగించే ఆట వస్తువులు, బొమ్మల్లో 80శాతం చైనా నుంచే దిగుమతి అవుతున్నాయి. వీటిలో ఎక్కువగా ప్లాస్టిక్, విషపూరిత రసాయనాలతో తయారైనవే ఉంటుండటంతో కొన్ని రకాల బొమ్మలపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. దీంతో పెరుగు­తున్న డిమాండ్‌ను దేశంలోని తయారీ యూనిట్లు తట్టుకోలేకపోతున్నాయి. గ్రేటర్‌ నోయిడా, ఢిల్లీ, ముంబైలో మాత్రమే ఈ పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయి. భారత్‌లో పిల్లల బొమ్మల వాణిజ్యం విలువ రూ.12వేల కోట్లు ఉన్నట్లు అంచనా. 

Weekly Current Affairs (Economy) Bitbank: భారతదేశపు మొట్టమొదటి దంత ఆరోగ్య బీమా పథకాన్ని ఏ బీమా కంపెనీ ప్రారంభించింది?

 Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

 

Published date : 21 Jul 2022 05:59PM

Photo Stories