AP Government: ‘అమృత్ సరోవర్’లో ఏపీకి మూడో స్థానం
దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘అమృత్ సరోవర్’ కార్యక్రమం అమలులో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానానికి ఎగబాకింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా దేశంలోని ప్రతి జిల్లాలో కనీసం 75 చెరువులను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది ఏప్రిల్ 24న ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. కనీసం ఒక ఎకరం విస్తీర్ణంలో పది వేల క్యూబిక్ మీటర్ల మేర నీరు నిల్వ చేసేలా ఈ చెరువులు నిర్మించాలని నిర్ణయించింది. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో అన్ని శాఖల ఆధ్వర్యంలో 2,890 చెరువుల నిర్మాణం, అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యం కాగా.. ఇప్పటికే 1,809 చెరువుల పనులు మొదలయ్యాయి. 2023 ఆగస్టుకు చెరువుల నిర్మాణం పూర్తిచేయాల్సి ఉంది. ఈ ఏడాది ఆగస్టు 15 నాటికి 399 చెరువుల నిర్మాణం పూర్తి చేయాల్సి ఉండగా, బుధవారం నాటికే 181 పూర్తి చేసి రాష్ట్రం మూడో స్థానంలో నిలిచింది. కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక వెబ్‌సైట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం.. రాష్ట్రం కంటే ముందు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర మాత్రమే ఉన్నాయి.
Also read: AP హైకోర్టుకు ఏడుగురు జడ్జీలు
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP