India's Growth Rate: భారత వృద్ధి అంచనాలకు ఏడీబీ, ఫిక్కీ కోత
భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) స్థూల దేశీయోత్పత్తి తొలి అంచనాలను ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ), దేశీయ పారిశ్రామిక వేదిక– ఫిక్కీలు తగ్గించాయి. ఏడీబీ తన ఏప్రిల్‌నాటి తొలి అంచనా 7.5 శాతం నుంచి 7.2 శాతానికి కోత పెట్టింది. మరోవైపు ఫిక్కీ అంచనా 7.4 శాతం నుంచి 7 శాతానికి తగ్గింది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధ ప్రభావం, ద్రవ్యోల్బణం భారత్ ఎకానమీపై ప్రతికూల ప్రభావం చూపనున్నాయని ఏడీబీ ఆసియా డెవలప్‌మెంట్ అవుట్‌లుక్ పేర్కొంది. మహమ్మారి ప్రతికూల సవాళ్లు కూడా ఎకానమీపై కొనసాగుతున్నట్లు వివరించింది. ఇక చైనా 2022 ఎకానమీ వృద్ధి అంచనాలను 5 శాతం నుంచి 4 శాతానికి తగ్గిస్తున్నట్లు తెలిపింది. కాగా తమ వృద్ధి రేటు అంచనాల కోతకు భౌగోళిక అనిశ్చితి పరిస్థితులే కారణమని ఫీక్కీ సర్వే పేర్కొంది. 2022–23లో 7 శాతం అంచనావేసినా, కనిష్ట–గరిష్ట స్థాయి అంచనాల శ్రేణిని 6.5 శాతం నుంచి 7.3 శాతంగా పేర్కొంది.
also read: World Shooting : అగ్రస్థానంలో భారత్
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP