World Athletics: ఉక్రెయిన్ అథ్లెట్ మహుచిఖ్ కి రజతం
అమెరికాలోని యుజీన్ లో జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ లో ఉక్రెయిన్ కు చెందిన 21 ఏళ్ల అథ్లెట్ యరస్లోవా మహుచిఖ్ హైజంప్ లో కాంస్య పతకం సాధించింది. టోక్యో ఒలింపిక్స్ 2021లో హైజంప్‌లో కాంస్య పతకం సాధించిన ఆమె.. ఈ సారి స్వర్ణం లక్ష్యంగా సొంత దేశం ఉక్రెయిన్ లో సన్నద్ధమవుతూ వచ్చింది. ఇంతలో ఆ దేశంలో యుద్ధం ముంచుకొచ్చింది. దాంతో కుటుంబసభ్యులంతా ప్రాణాలు అరచేత పెట్టుకొని సొంత నగరం నిప్రోను వీడారు. కారులో ప్రయాణించి సెర్బియా, జర్మనీ, టర్కీ మీదుగా కాలిఫోర్నియా చేరారు. అక్కడే సాధన చేసిన మహుచిఖ్ ఇప్పుడు వరల్డ్ చాంపియన్ షిప్‌లో మరో రజతాన్ని గెలుచుకుంది. ఇది తనకు స్వర్ణంతో సమానమని ఆమె ఉద్వేగంగా ప్రకటించింది. మహిళల హైజంప్‌లో ఎలినార్ ప్యాటర్సన్ (ఆస్ట్రేలియా) 2.02 మీటర్లు ఎత్తుకు ఎగిరి స్వర్ణం గెలుచుకుంది. మహుచిఖ్ (ఉక్రెయిన్) కూడా 2.02 మీటర్ల స్కోరే నమోదు చేసినా... ఒక ‘ఫాల్ట్’ ఎక్కువగా నమోదు చేయడంతో రజతం దక్కింది. ఎలెనా వలోటిగారా (ఇటలీ– 2.00 మీ.)కు కాంస్యం దక్కింది.
Also read: World Shooting : అగ్రస్థానంలో భారత్
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP