Skip to main content

Daily Current Affairs in Telugu: ఏప్రిల్‌ 20, 2023 కరెంట్‌ అఫైర్స్‌

Current Affairs in Telugu April 20th 2023 (డైలీ కరెంట్‌ అఫైర్స్‌ తెలుగులో): Current Affairs for All Competitive Exams In Telugu. Latest Articles useful for TSPSC &APPSC Group-1,2,3, 4, SSC, Bank, SI, Constable and all other competitive examinations
April 20th 2023 Current Affairs

Andhra Pradesh: పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ నంబర్ 1 
దేశంలోనే అత్యధికంగా పెట్టుబడులు ఆకర్షించిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ మొదటి స్థానంలో నిలిచింది. 2022–23లో 306 ప్రాజెక్టులకు సంబంధించి రూ.7,65,030 కోట్ల విలువైన పెట్టుబడి ఒప్పందాలతో ఏపీ అగ్రస్థానంలో ఉన్నట్లు ప్రాజెక్ట్స్‌ టుడే తాజా సర్వే వెల్లడించింది. అంతకుముందు ఏడాది ప్రథమ స్థానంలో ఉన్న గుజరాత్‌ను అధిగమించి ఏపీ నంబర్‌ వన్‌గా నిలిచింది. 2022–23లో టాప్‌ పది రాష్ట్రాల్లో 7,376 ప్రాజెక్టులకు సంబంధించి రూ.32,85,846 కోట్ల విలువైన ఒప్పందాలు కుదరగా ఏపీ నుంచే 23 శాతానికి పైగా పెట్టుబడుల ఒప్పందాలు జరగడం విశేషం. ఏపీ ఒప్పందాలు కుదుర్చుకున్న వాటిల్లో 57 భారీ ప్రాజెక్టుల విలువ రూ.7,28,667.82 కోట్లుగా ఉంది. ఇందులో ఏడు గ్రీన్‌ హైడ్రోజన్‌ ప్రాజెక్టులకు సంబంధించినవి కాగా మరో 18 హైడల్‌ ఆధారిత విద్యుత్‌ ప్రాజెక్టులున్నాయి. 

Mulapeta Port: మూలపేట పోర్టుకు సీఎం జగన్ శంకుస్థాపన.. పోర్టు విశేషాలివే..
గుజరాత్‌ రూ.4,44,420 కోట్ల విలువైన పెట్టుబడుల ఒప్పందాలను సాధించడం ద్వారా రెండో స్థానంలో నిలిచింది. సెమీ కండక్టర్ల తయారీకి సంబంధించి గుజరాత్‌ మూడు భారీ ప్రాజెక్టులను ఆకర్షించింది. కర్ణాటక రూ.4,32,704 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా మూడో స్థానంలో నిలిచింది. తెలంగాణ రూ.1,58,482 కోట్ల విలువైన 487 ప్రాజెక్టులతో తొమ్మిదో స్థానంలో నిలిచింది. ప్రైవేట్‌ రంగంలో పెట్టుబడులకు అత్యంత ఆకర్షణీయమైన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ మొదటి స్థానంలో ఉండగా తర్వాత స్థానాల్లో కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాలున్నాయి.  

Aquarium In Hyderabad: హైద‌రాబాద్‌లో దేశంలోనే అతిపెద్ద టన్నెల్‌ ఆక్వేరియం..!

PSLV-C55: ఏప్రిల్ 22న పీఎస్‌ఎల్‌వీ సీ55 ప్రయోగం 
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఏప్రిల్‌ 22న మధ్యాహ్నం 2.19 గంటలకు సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ లోని మొదటి ప్రయోగవేదిక నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ–55 ప్రయోగాన్ని చేపట్టేందుకు సిద్ధం చేస్తోంది. ఇస్రో అంతర్భాగంగా ఉన్న న్యూ స్పేస్‌ ఇండియా లిమిటెడ్‌ వారి వాణిజ్య ఒప్పందం మేరకు ఈ ప్రయోగాన్ని చేపడుతున్నారు. ఈ ప్రయోగంలో సింగపూర్‌కు చెందిన 741 కిలోల బరువు కలిగిన టెలియోస్‌–02 అనే ఉపగ్రహంతో పాటు లూమిలైట్‌–4 అనే 16 కేజీల బుల్లి ఉపగ్రహాన్ని రోదశీలోకి పంపించనున్నారు. ఈ ప్రయోగంలో పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌లో నాలుగోదశ (పీఎస్‌–4)ను ఒక ఎక్స్‌పర్‌మెంటల్‌ చేయనున్నారు. ఈ రాకెట్‌లో ఆర్బిటల్‌ ఎక్స్‌పర్‌మెంటల్‌ మాడ్యూల్‌ (పీవోఈఎం) అమర్చి పంపిస్తున్నారు. అంటే పోలార్‌ ఆర్బిట్‌లో ఇంకా ఎన్ని రకాల కక్ష్యల్లో ఉపగ్రహాలను ప్రవేశపెట్టవచ్చో పరిశోధన చేయడానికి ఈ ఎక్స్‌పర్‌మెంటల్‌ ప్రయోగాన్ని చేస్తున్నారు.

LVM3 Rocket: వన్‌వెబ్‌ ఇండియా–2 ఉపగ్రహాల ప్రయోగం విజ‌య‌వంతం..

Quantum Mission: రూ.6,003 కోట్లతో కేంద్రం క్వాంటమ్‌ మిషన్‌..  
క్వాంటమ్‌ టెక్నాలజీలో శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధనలు, అభివృద్ధికి  ఉద్దేశించిన నేషనల్‌ క్వాంటమ్‌ మిషన్‌(ఎన్‌క్యూఎం)కు కేంద్ర మంత్రివర్గం ఏప్రిల్ 19న‌ ఆమోదముద్ర వేసింది. దీనికి వచ్చే ఆరేళ్లలో రూ.6,003.65 కోట్లు వెచ్చిస్తారు. ఈ రంగంలో పరిశోధనలతో దేశంలో మరింత ఆర్థిక ప్రగతి సాధ్యమవుతుందని కేంద్ర సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్‌ చెప్పారు. క్వాంటమ్‌ కంప్యూటింగ్, క్వాంటమ్‌ కమ్యూనికేషన్, క్వాంటమ్‌ సెన్సింగ్‌ అండ్‌ మెట్రాలజీ, క్వాంటమ్‌ మెటీరియల్స్‌ అండ్‌ డివైజెస్‌ విభాగాల్లో నాలుగు థీమాటిక్‌ హబ్స్‌(టీ–హబ్స్‌) నెలకొల్పనున్నట్లు తెలియజేశారు. సినిమాటోగ్రఫీ (సవరణ) బిల్లు–2023కు కూడా కేబినెట్‌ ఆమోదం తెలిపింది. సినిమాల పైరసీకి అడ్డుకట్ట వేసే కఠిన నిబంధనలను బిల్లులో చేర్చినట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ తెలిపారు. వచ్చే పార్లమెంట్‌ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెడతామన్నారు. ప్రస్తుతమున్న యూ, ఏ, యూఏ అని కాకుండా ప్రేక్షకుల వయసుల విభాగం ఆధారంగా సినిమాలను వర్గీకరించనున్నట్లు పేర్కొన్నారు.

వీక్లీ కరెంట్ అఫైర్స్ (సైన్స్ అండ్ టెక్నాలజీ) క్విజ్ (12-18 మార్చి 2023)
క్వాంటమ్‌ టెక్నాలజీ అంటే ఏమిటి..?
క్వాంటమ్‌ టెక్నాలజీ అనేది ఇంజనీరింగ్‌, భౌతిక శాస్త్రం విభాగాల కలయిక. ఇది గణితం, భౌతికశాస్త్రం, కంప్యూటర్‌ సైన్స్‌లోని మౌలికాంశాల ఆధారంగా పనిచేస్తుంది. ఇందులోని క్వాంటమ్‌ మెకానిజం సూత్రాల ఆధారంగా కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేయొచ్చు. ఈ క్వాంటమ్‌ మెకానిజం శక్తిని పరమాణువుల సామర్థ్యంతో కొలుస్తాయి. ఇందులో ఫిజిక్స్‌లోని సాధారణ నియమాలు వర్తించవు. క్వాంటమ్‌ టెక్నాలజీలో మూడు భాగాలుంటాయి. అవి క్వాంటమ్‌ కంప్యూటింగ్‌, క్వాంటమ్‌ క్రిప్టోగ్రఫీ/కమ్యూనికేషన్, క్వాంటమ్‌ సెన్సింగ్‌. సాధారణ కంప్యూటర్లు 0, 1 ఆధారంగా పనిచేస్తే, క్వాంటమ్‌ కంప్యూటర్లు క్వాంటమ్‌ బిట్స్/క్యూబిట్స్‌ ఆధారంగా పనిచేస్తాయి. వేగం, కచ్చితత్వంతో పనిచేయడ‌మే క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ ప్రత్యేకత. 

TruthGPT: త్వరలో ‘చాట్‌జీపీటీ’కి ప్రత్యామ్నాయంగా ‘ట్రూత్‌జీపీటీ’.. ఎలాన్‌ మస్క్‌ ప్రకటన

India Population: భారతదేశ జనాభా 142.86 కోట్లు.. యువ జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రాలివే.. 
ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం ఏమిటి? చైనా కాదు. ఇకపై భారత్‌ అని చెప్పుకోవాలి. పోటీ పరీక్షల్లో ఈ ప్రశ్న అడిగితే భారత్‌ అని సమాధానం రాయాలి. జనాభాలో చైనాను భారతదేశం దాటేసింది. మన దేశ జనాభా రికార్డు స్థాయిలో 142.86 కోట్లకు చేరింది. 142.57 కోట్ల మందితో ప్రపంచంలో రెండో  అత్యధిక జనాభా కలిగిన దేశంగా చైనా నిలిచింది. భారత్‌ కంటే చైనా జనాభా 29 లక్షలు తక్కువగా ఉంది. 34 కోట్ల మందితో అగ్రరాజ్యం అమెరికా అత్యధిక జనాభా కలిగిన మూడో దేశంగా రికార్డుకెక్కింది. ఐక్యరాజ్యసమితి పాపులేషన్‌ ఫండ్‌(యూఎన్‌ఎఫ్‌పీఏ) స్టేట్‌ ఆఫ్‌ ద వరల్డ్‌ పాపులేషన్‌ రిపోర్టు–2023ను తాజాగా విడుదల చేసింది. ప్రపంచ దేశాల జనాభా గణాంకాలను వెల్లడించింది. ఇందులో పలు ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి.  
☛ దేశ జనాభాలో 65 ఏళ్లు దాటినవారు 2063 నాటికి 20 శాతం, 2100 నాటికి 30 శాతానికి చేరుతారని అంచనా. అంటే శతాబ్దాంతం దాకా మనది యువ భారత్‌గానే ఉంటుంది.
☛ జనాభా విషయంలో రాష్ట్రాల మధ్య వ్యత్యాసాలు ఉన్నాయి. కేరళ, పంజాబ్‌లో వృద్ధుల జనాభా అధికంగా ఉంది.   పూర్తి స‌మాచారం కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి

Apple Store: భార‌త్‌లో తొలి యాపిల్‌ స్టోర్‌ను ప్రారంభించిన సీఈవో టిమ్‌ కుక్

US Patriot: ఉక్రెయిన్‌ చేతికి అమెరికా ‘పేట్రియాట్‌’ 
అమెరికా అత్యాధునిక పేట్రియాట్‌ గైడెడ్‌ క్షిపణి వ్యవస్థ ఉక్రెయిన్‌ చేతికొచ్చింది. దీంతో రష్యా యుద్ధమూకలను మరింత దీటుగా ఎదుర్కొంటామని ఉక్రెయిన్‌ రక్షణ మంత్రి ఒలెక్సీ రెజ్నికోవ్ ఏప్రిల్ 19న‌ ట్వీట్ చేశారు. ‘భూతలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే పేట్రియాట్‌ క్షిపణి వ్యవస్థ రాకతో మా గగనతలానికి మరింత రక్షణ చేకూరింది’ అని ఆయన అన్నారు. శత్రు సేనల నుంచి దూసుకొచ్చే క్షిపణులు, స్వల్ప శ్రేణి బాలిస్టిక్‌ మిస్సైళ్లను ఈ వ్యవస్థతో కూల్చేయొచ్చు. క్రూయిజ్‌ క్షిపణులు, స్వల్ప శ్రేణి మిస్సైళ్లతోనే ఉక్రెయిన్‌ పౌర మౌలిక వసతులు ముఖ్యంగా విద్యుత్‌ సరఫరా వ్యవస్థలను రష్యా ధ్వంసం చేస్తున్న విషయం విదితమే. అందుకే జనావాసాలు, మౌలిక వసతుల రక్షణ కోసం కొంతకాలంగా పేట్రియాట్‌ సిస్టమ్స్‌ సరఫరా చేయాలని అమెరికాను ఉక్రెయిన్‌ కోరుతోంది. ఇన్నాళ్లకు అవి ఉక్రెయిన్ చేతికొచ్చాయి.

China and Taiwan: తైవాన్‌పై యుద్ధానికి చైనా సై!

Indians Stuck In Sudan: సూడాన్‌లో చిక్కిన భారతీయులు.. సురక్షితంగా రప్పించే యత్నాల్లో భారత్ 
సూడాన్‌ సైన్యం, పారామిలటరీ విభాగమైన తక్షణ మద్దతు దళం(ర్యాపిడ్‌ సపోర్ట్‌ ఫోర్స్‌)కు మధ్య కొనసాగుతున్న పరస్పర దాడులతో నెలకొన్న కల్లోల పరిస్థితులు అక్కడి భారతీయులకు కష్టాలు తెచ్చిపెట్టాయి. ఇరు వర్గాల కాల్పులు, బాంబుల మోతతో ఉన్నచోటు నుంచి కనీసం బయటకురాలేక బిక్కుబిక్కుమంటూ సాయం కోసం అర్థిస్తున్నారు. దీంతో దౌత్యమార్గంలో వారిని సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు భారత్‌ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. కాల్పుల విరమణకు అమెరికా వంటి దేశాలు పిలుపునిచ్చినా కొద్ది గంటలకే అది విఫలమై గడిచిన 24 గంటల్లోనే మరో 100 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో పరిస్థితి చేయి దాటేలోపే భారతీయులను వెనక్కితీసుకురావాలనే భారత్‌ కృతనిశ్చయంతో ఉందని భారత విదేశాంగ శాఖ వర్గాలు ఏప్రిల్ 19న‌ వెల్లడించాయి.

వీక్లీ కరెంట్ అఫైర్స్ (ముఖ్యమైన తేదీలు) క్విజ్ (12-18 మార్చి 2023)
కర్ణాటక సంప్రదాయ మూలిక వైద్యం చేసే 31 మంది ‘హక్కీ పిక్కీ’ గిరిజనులుసహా 60 మంది భారతీయులు సూడాన్‌లో చిక్కుకున్నారని వారి గురించి పట్టించుకోండని ఆ రాష్ట్ర మాజీ సీఎం సిద్ధరామయ్య కోరడం, ఈ విషయాన్ని రాజకీయం చేయొద్దని ఇప్పటికే విదేశాంగ మంత్రి జైశంకర్‌ వ్యాఖ్యానించారు. సూడాన్‌ ఘర్షణల్లో ఇప్పటిదాకా దాదాపు 270 మంది ప్రాణాలు కోల్పోయారు. రాజధాని ఖార్తూమ్‌లో జరిగిన కాల్పుల్లో ఒక మాజీ భారతీయ సైనికుడు ఆల్బర్ట్‌ అగస్టీన్‌ చనిపోయారు. 1,800 మందికిపైగా గాయాలపాలయ్యారని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. 
అమెరికా, బ్రిటన్, సౌదీ, యూఏఈతో మంతనాలు
సూడాన్‌తో సంబంధాలు నెరుపుతున్న అమెరికా, బ్రిటన్, సౌదీ అరేబియా, యూఏఈ దేశాలతో భారత విదేశాంగ శాఖ మంతనాలు కొనసాగిస్తోంది. క్షేత్రస్థాయిలో భారతీయుల రక్షణకు సాయపడతామని జైశంకర్‌కు సౌదీ, యూఏఈ విదేశాంగ మంత్రులు హామీ ఇచ్చారు. సూడాన్‌లో భారతీయ ఎంబసీ అక్కడి భారతీయులతో వాట్సాప్‌ గ్రూప్‌లుసహా పలు మార్గాల్లో టచ్‌లోనే ఉంది.   పూర్తి స‌మాచారం కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి

North Korea: ఘన ఇంధన బాలిస్టిక్‌ క్షిపణిని పరీక్షించిన ఉత్తరకొరియా
 
ICC Rankings: ‘టాప్‌’ ర్యాంక్‌లోనే సూర్యకుమార్‌ యాదవ్‌ 
అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ టి20 బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో భారత క్రికెటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ తన టాప్‌ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. ఏప్రిల్ 19న‌ విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో సూర్యకుమార్‌ 906 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. పాకిస్తాన్‌ బ్యాటర్లు మొహమ్మద్‌ రిజ్వాన్‌ (798 పాయింట్లు), బాబర్‌ ఆజమ్‌ (769 పాయింట్లు) వరుసగా రెండు, మూడు ర్యాంకుల్లో ఉన్నారు. విరాట్‌ కోహ్లి 15వ ర్యాంక్‌లో మార్పు లేదు. 

Archery World Cup: డిప్యూటీ కలెక్టర్‌, ఆర్చర్ జ్యోతి సురేఖ ప్రపంచ రికార్డు

Chess Tournament: ‘రెస్ట్‌ ఆఫ్‌ ద వరల్డ్‌’ జట్టుదే చెస్‌ టైటిల్‌ 
కజకిస్తాన్, రెస్ట్‌ ఆఫ్‌ ద వరల్డ్‌ మహిళల జట్ల మధ్య జరిగిన చెస్‌ టోర్నమెంట్‌లో ‘రెస్ట్‌ ఆఫ్‌ ద వరల్డ్‌’ జట్టు పైచేయి సాధించి టైటిల్‌ దక్కించుకుంది. ఏప్రిల్ 19న‌ ముగిసిన టోర్నీలో ‘రెస్ట్‌ ఆఫ్‌ ద వరల్డ్‌’ జట్టు బ్లిట్జ్‌ ఈవెంట్‌లో 38.5–25.5 పాయింట్ల తేడాతో.. ర్యాపిడ్‌ ఈవెంట్‌లో 34.5–29.5 పాయింట్ల తేడాతో కజకిస్తాన్‌ జట్టును ఓడించింది. భారత గ్రాండ్‌మాస్టర్, ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి ద్రోణవల్లి హారిక, తమిళనాడుకు చెందిన మహిళా గ్రాండ్‌మాస్టర్‌ (డబ్ల్యూజీఎం) సవితాశ్రీ ‘రెస్ట్‌ ఆఫ్‌ ద వరల్డ్‌’ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. హారిక, సవితాశ్రీలతోపాటు నానా జాగ్‌నిద్జె (జార్జియా), హూ ఇఫాన్‌ (చైనా), గునె మమద్‌జాదా (అజర్‌బైజాన్‌), సోకా గాల్‌ (హంగేరి), అఫ్రూజా ఖమ్‌దమోవా (ఉజ్బెకిస్తాన్‌), నుర్గుల్‌ సలిమోవా (బల్గేరియా) కూడా ‘రెస్ట్‌ ఆఫ్‌ ద వరల్డ్‌’ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. కజకిస్తాన్‌ జట్టు తరఫున దినారా, బిబిసారా, మెరూర్ట్, జన్సాయా అబ్దుమలిక్, జెనియా బలబయేవా, లియా, అలువా నుర్మనోవా, జరీనా పోటీపడ్డారు.   

వీక్లీ కరెంట్ అఫైర్స్ (క్రీడలు) క్విజ్ (12-18 మార్చి 2023)

Kalyanalakshmi: కల్యాణలక్ష్మికి రూ.2 వేల కోట్లు 
కల్యాణలక్ష్మి పథకానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసింది. కొంతకాలంగా ఈ పథకానికి నిధుల విడుదలలో జాప్యం వల్ల చెల్లింపులు సకాలంలో జరగడం లేదు. ఈ క్రమంలో లబ్ధిదారులందరికీ ఒకేసారి నిధులు విడుదల చేయాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం ఒకే దఫా రూ.2 వేల కోట్ల విడుదలకు అనుమతిచ్చింది. ఈమేరకు వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఏప్రిల్ 19న‌ ఉత్తర్వులు జారీ చేశారు. తాజాగా విడుదల చేసిన నిధులతో ఇప్పటివరకు బీసీ సంక్షేమ శాఖ ద్వారా అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి పథకం బకాయిలన్నీ చెల్లించే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.    

Ambedkar Statue: దేశంలోనే ఎత్తైన అంబేడ్కర్‌ విగ్రహం.. 125 అడుగుల విగ్రహ రూప‌క‌ర్త‌, విగ్రహ ప్రత్యేకతలివే..

Published date : 20 Apr 2023 06:27PM

Photo Stories