Skip to main content

China and Taiwan: తైవాన్‌పై యుద్ధానికి చైనా సై!

దక్షిణ చైనా సముద్రంపై యుద్ధ మేఘాలు దట్టంగా కమ్ముకుంటున్నాయి. చైనా–తైవాన్‌ ఘర్షణ క్రమంగా తారస్థాయికి చేరుతోంది.
China and Taiwan War

ఈ ద్వీప దేశంపై ఏ క్షణంలోనైనా యుద్ధానికి దిగేందుకు అన్నివిధాలా సిద్ధంగా ఉన్నట్టు చైనా సైన్యం ఏప్రిల్ 10వ తేదీ చేసిన ప్రకటన ప్రకంపనలు సృష్టిస్తోంది. స్వయంపాలిత హోదా ఉన్న తైవాన్‌ నిజానికి తమ అంతర్భాగమేనని చైనా చిరకాలంగా వాదిస్తుండటం తెలిసిందే. ఈ వాదనతో తైవాన్‌ తీవ్రంగా విభేదిస్తోంది. పూర్తిస్థాయి స్వతంత్ర దేశంగా గుర్తింపు పొందేందుకు చాలాకాలంగా ప్రయత్నిస్తోంది. అందుకు అమెరికా అన్నివిధాలా వెన్నుదన్నుగా నిలుస్తుండటంపై చైనా గుర్రుగా ఉంది. గత ఆగస్టులో చైనా హెచ్చరికలను ఖాతరు చేయకుండా అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ తైవాన్‌లో పర్యటించడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా తైవాన్‌ దేశాధ్యక్షురాలు సై ఇంగ్‌ వెన్‌ జరిపిన అమెరికా పర్యటనపై చైనా మరోసారి అగ్గిమీద గుగ్గిలం అవుతోంది. 

UN Statistical Commission: ఐరాస స్టాటిస్టికల్‌ కమిషన్‌కు భారత్‌ ఎన్నిక

మూడు రోజులుగా చైనా సైన్యం తైవాన్‌ ద్వీపకల్పాన్ని దిగ్బంధించి భారీ సైనిక విన్యాసాలకు తెర తీసింది. జాయింట్‌ స్వార్డ్‌ పేరిట జరిగిన ఈ యుద్ధ సన్నద్ధత విన్యాసాలు ఏప్రిల్ 10వ తేదీతో ముగిశాయి. కానీ తైవాన్‌ చుట్టూరా చైనా సైనిక మోహరింపులు మాత్రం యథాతథంగా కొనసాగుతున్నాయి. ‘ఏ క్షణంలోనైనా యుద్ధానికి దిగేందుకు సిద్ధంగా ఉన్నాం. స్వాతంత్య్రం కోసం తైవాన్‌ చేసే ప్రయత్నాలను పూర్తిస్థాయిలో అణచివేస్తాం. ఈ విషయంలో విదేశీ జోక్యాలను కూడా మర్చిపోలేని రీతిలో తిప్పికొడతాం’ అంటూ ఈ సందర్భంగా చైనా సైన్యం ప్రకటన విడుదల చేసింది. ‘తైవాన్‌లోని వేర్పాటువాదులకు, వారికి దన్నుగా నిలుస్తున్న బయటి శక్తులకు మా సైనిక విన్యాసాలు ఒక గట్టి హెచ్చరిక’ అని చైనా సైన్యం ఈస్టర్న్‌ కమాండ్‌ అధికార ప్రతినిధి షీ యీ అన్నారు. 

Weekly Current Affairs (International) Bitbank: "అక్రమ వలసదారుల నిరోధ‌క‌ బిల్లు"ను ఏ దేశం ప్రవేశపెట్టింది?

తైవాన్‌ విషయంలో తాము అనుసరిస్తున్న ‘వన్‌ చైనా’ సూత్రానికి అన్ని దేశాలూ మద్దతిస్తాయని ఆశిస్తున్నట్టు ఆ దేశ విదేశాంగ అధికార ప్రతినిధి వాంగ్‌ వెన్‌బిన్‌ అన్నారు. ఈ ప్రాంతంపై పట్టు కోసం తైవాన్‌ను పావుగా అమెరికా వాడుకుంటోందని పీఎల్‌ఏ డైలీ ఆరోపించింది. తమతో యుద్ధమే వస్తే తైవాన్‌కు సైనిక సాయానికి అమెరికా ముందుకు రాదని అభిప్రాయపడింది. గత ఆగస్టులో నాన్సీ పర్యటనకు నిరసనగా కూడా చైనా ఇలాంటి విన్యాసాలే చేపట్టడం తెలిసిందే. తైవాన్‌ పరిసరాల్లోని పలు లక్ష్యాలపై క్షిపణి ప్రయోగాలకు కూడా దిగి తీవ్ర ఉద్రిక్తతకు తెర తీసింది. 
శతాబ్దాల నాటి ఘర్షణ 
చైనా, తైవాన్‌ ఘర్షణలకు శతాబ్దాల చరిత్ర ఉంది. కొన్నేళ్లుగా తైవాన్‌ చుట్టూ సైనిక విన్యాసాలు చైనాకు పరిపాటిగా మారాయి. అయితే ఆ దేశాన్ని ఈ స్థాయిలో చుట్టుముట్టి సైనికంగా పూర్తిగా దిగ్బంధించడం ఇదే తొలిసారి. దీని వెనక కచ్చితంగా ఏదో మతలబు ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. షాన్‌డాంగ్‌ విమాన వాహక నౌకను కూడా చైనా రంగంలోకి దించింది. యుద్ధమే మొదలయ్యే పక్షంలో తైవాన్‌కు విదేశీ సైనిక సాయం అందకుండా అడ్డుకునేందుకే చైనా ఈ చర్యకు దిగిందని రక్షణ నిపుణులు భావిస్తున్నారు. తైవాన్‌లో అమెరికా జోక్యం మితిమీరుతోందనే సాకుతో ఆ దేశంపై ఏ క్షణంలోనైనా చైనా సైనిక చర్యకు దిగే ఆస్కారం లేకపోలేదని అభిప్రాయపడుతున్నారు. ఏప్రిల్‌9, 10వ తేదీల్లో కనీసం 70కి పైగా యుద్ధ విమానాలు, 10 యుద్ధనౌకలు తైవాన్‌ జలసంధి చుట్టూ కలియదిరిగాయి. వీటిలో 8 జే–16 ఫైటర్‌ జెట్లు, 4 జే–1 ఫైటర్లు, 8 ఎస్‌యూ–30 ఫైటర్లు, జే–15 ఫైటర్లున్నాయి. తైవాన్‌ అధ్యక్షురాలి అమెరికా పర్యటనకు ఆతిథ్యమిచ్చిన రెండు అమెరికా సంస్థలపై ఆంక్షలు విధిస్తున్నట్టు చైనా ప్రకటించింది.

Finland Joins NATO: నాటో కూటమిలోకి ఫిన్లాండ్‌..

Published date : 11 Apr 2023 05:47PM

Photo Stories