Finland Joins NATO: నాటో కూటమిలోకి ఫిన్లాండ్..
దీంతో రష్యా వెంట నాటో సభ్య దేశాల సరిహద్దు భూభాగ విస్తీర్ణం రెట్టింపయింది. దీనిని యూరప్ రక్షణ ముఖచిత్రంలో కీలక పరిణామంగా భావిస్తున్నారు. నాటోలో సభ్యత్వం కోసం ఉక్రెయిన్ ప్రయత్నించడాన్ని ప్రధాన కారణంగా చూపుతూ ఆ దేశంపై యుద్ధానికి దిగిన రష్యాకు తాజాగా ఫిన్లాండ్ రూపంలో వ్యూహాత్మక, రాజకీయ ఎదురుదెబ్బ తగిలింది. గతంలో రెండో ప్రపంచ యుద్ధంలో సోవియెట్ల చేతిలో ఓటమి పాలైనప్పటి నుంచి ఫిన్లాండ్ తటస్థ వైఖరినే అవలంభిస్తోంది. కానీ ఉక్రెయిన్ యుద్ధం దరిమిలా రష్యాకు భయపడి ఫిన్లాండ్ నాటో రక్షణ ఛత్రం కిందకు చేరక తప్పని పరిస్థితి ఏర్పడింది. దీంతో గత మే నెలలోనే నాటో సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకుంది.
నాటోలోని మొత్తం 30 దేశాలూ ఆమోదిస్తేనే సభ్యత్వం ఇస్తారు. గత కొద్ది నెలలుగా హంగేరీ, తుర్కియేలు ఫిన్లాండ్ దరఖాస్తుకు ఆమోదముద్రవేయలేదు. ఫిన్లాండ్‌తోపాటు స్వీడన్ సైతం దరఖాస్తు చేసుకోగా ఇంకా హంగేరీ, తుర్కియేలు పచ్చజెండా ఊపలేదు.
ChatGPT: చాట్‌జీపీటీపై నిషేధం.. డేటా లీక్ చేసినందుకే..!
తగిన చర్యలుంటాయ్: రష్యా
ఫిన్లాండ్ నాటో సభ్యత్వంపై రష్యా ఘాటుగా స్పందించింది. ‘నాటోలో చేరడం ద్వారా ఫిన్లాండ్ నుంచి ఎదురయ్యే జాతీయ భద్రతా సవాళ్లను సైనిక, సాంకేతిక, తదితర మార్గాల్లో దీటుగా ఎదుర్కొంటాం. తగు చర్యలు తీసుకుంటాం. ఉత్తర యూరప్‌లో దశాబ్దాలుగా కొనసాగుతున్న సుస్థిరతకు ఫిన్లాండ్ భంగం కల్గించింది’ అని రష్యా విదేశాంగ శాఖ ప్రకటించింది. ఫిన్లాండ్ సాయం అడగనంత వరకు ఆ దేశానికి అదనపు సైన్యాన్ని పంపే యోచన లేదని నాటో ప్రధాన కార్యదర్శి జీన్స్ స్టోలెన్‌బర్గ్ చెప్పారు.