Skip to main content

TruthGPT: త్వరలో ‘చాట్‌జీపీటీ’కి ప్రత్యామ్నాయంగా ‘ట్రూత్‌జీపీటీ’.. ఎలాన్‌ మస్క్‌ ప్రకటన

ప్రపంచ వ్యాప్తంగా కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత చాటింగ్‌ టెక్నాలజీ పెరిగిపోతుండడం పట్ల ట్విట్టర్‌ అధినేత ఎలాన్‌ మస్క్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

‘కార్లు, రాకెట్ల కంటే ఏఐ మరింత ప్రమాదకరం. దీనివల్ల మానవాళికి ముప్పు తప్పదు. మానవాళిని నిర్వీర్యం చేసే శక్తి ఏఐకి ఉంది’ అని ఓ ఇంటర్వ్యూలో అన్నారు. ఏఐ చాట్‌బాట్‌ ‘చాట్‌జీపీటీ’ వివక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. దానికి ప్రత్యామ్నాయంగా ‘ట్రూత్‌జీపీటీ’ పేరిట సొంత చాట్‌బాట్‌ తెస్తామన్నారు. మానవాళిని ధ్వంసం చేసే టెక్నాలజీ వద్దని, అర్థం చేసుకొనేది కావాలని అన్నారు. కృత్రిమ మేధను నియంత్రించే వ్యవస్థ ఉండాలన్న ప్రతిపాదనను సమర్థించారు.

Sundar Pichai: కృత్రిమ మేధను తలచుకుంటే నిద్రలేని రాత్రులే.. సుందర్‌ పిచాయ్

Published date : 19 Apr 2023 04:36PM

Photo Stories