Skip to main content

AI Tools : కోర్టు సిబ్బందికి స‌హాయ‌ప‌డేలా మూడు కృత్రిమ మేథ‌.. వాటి వివ‌రాణ‌..!

న్యాయవ్యవస్థ కార్యకలాపాల్లో దోహదపడేందుకు వీలుగా తాజాగా అందుబాటులోకి వచ్చిన మూడు కృత్రిమ మేథ (ఏఐ) టూల్స్‌ శ్రుతి, సారాంశ్, పాణిని ఎలా పనిచేస్తాయి..
Newly available ai tools and its way in assisting judicial activities

హైదరాబాద్‌: న్యాయవ్యవస్థ కార్యకలాపాల్లో దోహదపడేందుకు వీలుగా తాజాగా అందుబాటులోకి వచ్చిన మూడు కృత్రిమ మేథ (ఏఐ) టూల్స్‌ శ్రుతి, సారాంశ్, పాణిని ఎలా పనిచేస్తాయి.. కోర్టు సిబ్బందికి అవి ఎలా సహాయపడతాయి? వాటి వివరాలు ఇలా..

ఏఐ శ్రుతి..

ఆటోమేటిక్‌ స్పీచ్‌ రికగ్నిషన్‌ (ఏఎస్‌ఆర్‌) అంటే.. మనం మాట్లాడే పదాలను రాతపూర్వకంగా మార్చే టూల్‌. స్టెనోగ్రాఫర్ల లోటును ఇది భర్తీ చేస్తుంది. దీని సాయంతో న్యాయమూర్తులు చెప్పే మధ్యంతర ఉత్తర్వులు, తీర్పులను నేరుగా రాతపూర్వక రూపంలోకి మార్చుకోవచ్చు. 

Supreme Court: జీహెచ్‌ఎంసీలో హౌజింగ్‌ సొసైటీలపై సంచలన తీర్పు

పదాలు సరిగా వచ్చాయా లేదా.. అని సరి చూసుకొనే అవకాశం కూడా ఇందులో ఉంది. కోర్టు సిబ్బందికి ఇది శ్రమను తగ్గిస్తుంది. దీన్ని స్పీచ్‌ టు టెక్సట్‌ అని కూడా అంటారు. ఆంగ్లంలోనే కాదు.. తెలుగు, హిందీ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, తమిళం, కన్నడ భాషల్లోనూ దీన్ని వినియోగించుకోవచ్చు. ఈ టెక్సŠట్‌ను పీడీఎఫ్‌ ఫార్మాట్‌లో కాపీని పొందవచ్చు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

సారాంశ్‌..

ఇది పూర్తి సుదీర్ఘ కంటెంట్‌లోని ప్రధాన అంశాలను అందిస్తుంది. పేజీలకు పేజీల తీర్పుల్లోని సారాంశం కావాలనుకున్నప్పుడు ఈ టూల్‌ ఉపయోగపడుతుంది. కచ్చితమైన సారాంశాన్ని రూపొందించమే ఈ సారాంశ్‌ పని.

పాణిని..

ఇది ఒక ట్రాన్స్‌లేటర్‌లా పనిచేస్తుంది. కోర్టుకు సంబంధించిన వివిధ డాక్యుమెంట్లను ఆంగ్లం నుంచి తెలుగులోకి మార్చుకోవచ్చు. ఆంగ్లం నుంచి దేశంలోని పలు భాషల్లోకి.. ఇటు నుంచి అటు మార్చుకోవచ్చు. 11 భాషల్లోకి అనువాదం చేయగల టూల్‌ ఈ పాణిని. తెలుగుతోపాటు అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, హిందీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒరియా, పంజాబీ, తమిళంలోకి అనువదించగలదు. 
School holidays: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. స్కూళ్లకు వరుసగా సెలవులు.. ఎందుకంటే!

ఈ–సేవలో కక్షిదారులకు అందే సేవలు..

»   కేసు స్థితి, తదుపరి విచారణ తేదీ, ఇతర విచారణ వివరాలు
»    కావాల్సిన డాక్యుమెంట్ల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు  
»    హార్డ్‌ కాపీ పిటిషన్లను స్కాన్నింగ్‌ మొదలు ఈ–సంతకం చేర్చడం, సీఐఎస్‌ వరకు అప్‌లోడ్‌ చేసి ఎస్‌ఆర్‌ నంబర్‌ సృష్టించడం.

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)
»   ఈ–స్టాంప్‌ పేపర్ల కొనుగోలు/ఈ–చెల్లింపులు ఆన్‌లైన్‌లో చేయడానికి సాయం
»    జైలులోని బంధువులను కలుసుకోవడానికి ఈ–ములాఖత్‌ కోసం బుకింగ్‌ సదుపాయం
»    న్యాయమూర్తులు సెలవులో ఉంటే వివరాలు తెలుసుకోవచ్చు
»    సుప్రీంకోర్టు నుంచి స్థానిక కోర్టుల వరకు న్యాయ సహాయ కమిటీల నుంచి ఉచిత న్యాయసేవను ఎలా పొందవచ్చో తెలుసుకోవచ్చు 
»    తీర్పులు, మధ్యంతర ఉత్తర్వుల కాపీలను ఈ–మెయిల్, వాట్సాప్‌ ద్వారా పొందవచ్చు

Published date : 25 Nov 2024 03:08PM

Photo Stories