Sundar Pichai: కృత్రిమ మేధను తలచుకుంటే నిద్రలేని రాత్రులే.. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్
Sakshi Education
కృత్రిమ మేధను సరిగా వాడకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని అల్ఫాబెట్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ హెచ్చరించారు.
![Sundar Pichai](/sites/default/files/images/2023/04/18/sundar-pichai-ai-1681804692.jpg)
ముప్పు నుంచి బయటపడాలంటే ఏఐ సాంకేతికతపై నియంత్రణ ఉండాలని చెప్పారు. కృత్రిమ మేధ వల్ల తలెత్తే దుష్ప్రభావాల గురించి తలచుకుంటూ నిద్రలేని రాత్రులు గడుపుతున్నానని తాజాగా ఓ వార్తా సంస్థ ఇంటర్వ్యూలో పిచాయ్ చెప్పారు. ఈ టెక్నాలజీ ప్రయోజనకరమైన రీతిలో ఉపయోగించుకొనేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏఐతో అసత్య సమాచారాన్ని సృష్టించే వీలుందని, ఇది సమాజానికి ప్రమాదకరమని అన్నారు. అణ్వాయుధాలను నియంత్రిస్తున్న తరహాలోనే ఏఐని నియంత్రించడానికి ఒక అంతర్జాతీయ కార్యాచరణ అవసరమని అభిప్రాయపడ్డారు.
GST New Rule: మే 1 నుంచి జీఎస్టీ కొత్త రూల్.. ఇకపై అలా కుదరదు!
Published date : 18 Apr 2023 01:28PM