North Korea: ఘన ఇంధన బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించిన ఉత్తరకొరియా

వేగంగా ప్రయాణించే కొత్త రకం క్షిపణిని ఆ దేశం ఏప్రిల్ 13న ప్రయోగించినట్లు దక్షిణకొరియా, జపాన్ పేర్కొంది. రాజధాని ప్యాంగ్యాంగ్ సమీపంలోని అటవీ ప్రాంతంలోని వేదికపై నుంచి చేపట్టిన ఈ ప్రయోగాన్ని అధ్యక్షుడు కిమ్, ఆయన భార్య, కుమార్తె, సోదరి తిలకించినట్లు అధికార వార్తా సంస్థ కేసీఎన్‌ఏ తెలిపింది. ఈ క్షిపణి మూడు దశలుగా ప్రయాణించి, లక్ష్యాన్ని ఛేదించినట్లు వివరించింది. ఇప్పటి వరకు ద్రవ ఇంధనంతో పనిచేసే క్షిపణులను పరీక్షించిన ఉత్తరకొరియా తాజాగా ఘన ఇంధనం వాడినట్లు ప్రకటించడం ముందడుగేనని నిపుణులంటున్నారు.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (సైన్స్ & టెక్నాలజీ) క్విజ్ (05-11 మార్చి 2023)
అమెరికాను నేరుగా భయపెట్టే అణ్వాయుధాలను సమకూర్చుకోవాలనే లక్ష్యంలో ఇది పురోగతిగా అభివర్ణిస్తున్నారు. అయితే ఈ తాజా క్షిపణి సామర్థ్యంపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అది ప్రయాణించిన దూరం, ఎత్తు, తిరిగి భూ వాతావరణంలోకి ప్రవేశించి లక్ష్యాన్ని ఎలా ఛేదించింది, వార్ హెడ్ అమరిక వంటి వివరాలను వెల్లడించకపోవడాన్ని ప్రస్తావిస్తున్నారు.