Skip to main content

Daily Current Affairs in Telugu: 26 సెప్టెంబ‌రు 2023 క‌రెంట్ అఫైర్స్

వివిధ పోటీ ప‌రీక్ష‌ల‌కు ప్రిపేర‌య్యే విద్యార్ధుల‌ కోసం సాక్షి ఎడ్యుకేష‌న్‌ అందించే డైలీ క‌రెంట్ అఫైర్స్‌.
26 September Daily Current Affairs in Telugu,sakshi education,Exam Study Material
26 September Daily Current Affairs in Telugu

1. రాజస్థాన్‌లోని ధోల్‌పూర్-కరౌలీ టైగర్ రిజర్వ్ ఏర్పాటుకు నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (NTCA) ఆమోదం తెలిపింది.

2. భారత వైమానిక దళం(ఐఏఎఫ్‌)లోకి మొదటి సీ–295 రకం రవాణా విమానం చేరింది.

Daily Current Affairs in Telugu: 25 సెప్టెంబ‌రు 2023 క‌రెంట్ అఫైర్స్

3. ఆసియా క్రీడల్లో భారత మహిళల జట్టు చాంపియన్‌గా అవతరించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది.

4. ఆసియా క్రీడల్లో  పురుషుల ఫోర్‌ ఈవెంట్‌లో జస్విందర్‌ సింగ్, భీమ్‌ సింగ్, పునీత్, ఆశిష్‌లతో కూడిన భారత జట్టు కాంస్య పతకం నెగ్గింది. పురుషుల క్వాడ్రాపుల్‌ డబుల్‌ స్కల్స్‌ ఈవెంట్‌లో సత్నామ్‌ సింగ్, పర్మిందర్‌ సింగ్, జకర్‌ ఖాన్, సుఖ్‌మీత్‌ సింగ్‌లతో కూడిన భారత జట్టు కాంస్యం గెల్చుకుంది.

Daily Current Affairs in Telugu: 22 సెప్టెంబ‌రు 2023 క‌రెంట్ అఫైర్స్

5. ఆసియా క్రీడల్లో పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ టీమ్‌ విభాగంలో రుద్రాంశ్  పాటిల్, ఐశ్వరీ ప్రతాప్‌ సింగ్‌ తోమర్, దివ్యాంశ్‌ సింగ్‌ పన్వర్‌లతో కూడిన భారత జట్టు 1893.7 పాయింట్లు స్కోరు చేసి బంగారు పతకాన్ని సొంతం చేసుకుంది. 

6. ఆసియా క్రీడల్లో పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్‌ ఫైర్‌ పిస్టల్‌ ఈవెంట్‌లో విజయ్‌వీర్‌ సిద్ధూ (582 పాయింట్లు), ఆదర్శ్‌ సింగ్‌ (576 పాయింట్లు), అనీశ్‌ (560 పాయింట్లు)లతో కూడిన భారత జట్టు కాంస్య పతకాన్ని దక్కించుకుంది.

Daily Current Affairs in Telugu: 18 సెప్టెంబ‌ర్ డైలీ క‌రెంట్ అఫైర్స్

Published date : 27 Sep 2023 08:04AM

Photo Stories