Daily Current Affairs in Telugu: 18 సెప్టెంబర్ డైలీ కరెంట్ అఫైర్స్
1. నోబెల్ గ్రహీత, విశ్వ కవి రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించిన పశ్చిమ బెంగాల్‌లోని ప్రఖ్యాత శాంతినికేతన్ విశ్వవిద్యాలయానికి యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చోటు దక్కింది.
2. ప్రపంచంలోనే అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్లలో ఒకటైన ఇండియా ఇంటర్నేషన్ కన్వెన్షన్ అండ్ ఎక్స్‌పో సెంటర్ ‘యశోభూమి’ మొదటి దశను ప్రధాని మోదీ ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా ఇదే వేదికపై ‘పీఎం విశ్వకర్మ’ పథకానికి శ్రీకారం చుట్టారు.
3. చేతివృత్తుల వారు, సంప్రదాయ హస్తకళాకారుల కోసం కేంద్ర ప్రభుత్వం ఐదేళ్ల కాలానికి రూ. 13,000 కోట్ల ఆర్థిక వ్యయంతో విశ్వకర్మ జయంతి సందర్భంగా 'పీఎం విశ్వకర్మ' పథకాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు.
Daily Current Affairs in Telugu: 16 సెప్టెంబరు 2023 కరెంట్ అఫైర్స్
4. ఆంధ్రప్రదేశ్ అటవీ అభివృద్ధి కార్పొరేషన్‌కు టాప్ ఎక్స్‌పోర్ట్ అవార్డ్ ఆఫ్ క్యాపెక్సిల్ జాతీయ అవార్డు లభించింది.
5. న్యూఢిల్లీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన మహంకాళి శ్రీమన్నారాయణ మూర్తి (కూచిపూడి), పండితారాధ్యుల సత్యనారాయణ (హరికథ), మహాభాష్యం చిత్తరంజన్ (సంప్రదాయ సంగీతం–సుగమ్ సంగీత్), కోలంక లక్ష్మణరావు (కర్ణాటక సంగీతం–మృదంగం), ఐలయ్య ఒగ్గరి (ఒగ్గు కథ), బాసని మర్రెడ్డి (థియేటర్ డైరెక్టర్)లకు సంగీతనాటక అకాడమీ అవార్డులను ఉపరాష్ట్రపతి జగ్ దీప్ ధన్‌ఖడ్ అందజేశారు.
6. ఆసియా కప్-2023 ఫైనల్లో శ్రీలంకపై భారత్ గెలిచి ఎనిమిదోసారి ఆసియా కప్ టైటిల్‌ను సొంతం చేసుకుంది.
Daily Current Affairs in Telugu: 15 సెప్టెంబరు 2023 కరెంట్ అఫైర్స్
7. ప్రపంచకప్ షూటింగ్ టోర్నీలో మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో భారత షూటర్ ఇలవేనిల్ వలారివన్ విజేతగా నిలిచి బంగారు పతకాన్ని సాధించింది.
8. ఫార్ములావన్ 2023 సింగపూర్ గ్రాండ్‌ప్రిలో ఫెరారీ జట్టు డ్రైవర్ కార్లోస్ సెయింజ్ చాంపియన్‌గా నిలిచాడు.
9. టాటా స్టీల్ ఆసియా జూనియర్ చెస్ చాంపియన్‌షిప్ మహిళల బ్లిట్జ్ ఈవెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బొమ్మిని మౌనిక అక్షయ విజేతగా నిలిచింది.
Daily Current Affairs in Telugu: 13 సెప్టెంబరు 2023 కరెంట్ అఫైర్స్