Skip to main content

Daily Current Affairs in Telugu: 13 సెప్టెంబ‌రు 2023 క‌రెంట్ అఫైర్స్

వివిధ పోటీ ప‌రీక్ష‌ల‌కు ప్రిపేర‌య్యే విద్యార్ధుల‌ కోసం సాక్షి ఎడ్యుకేష‌న్‌ అందించే డైలీ క‌రెంట్ అఫైర్స్‌.
13 September Daily Current Affairs in Telugu,sakshi education,exams preparation
13 September Daily Current Affairs in Telugu

1. యూఎస్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ విభాగం ఫైనల్లో జొకోవిచ్‌,  డానిల్‌ మెద్వెదెవ్‌ (రష్యా)పై గెలిచి 24వ‌ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను సాధించాడు.

2. పరిశోధన రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన శాంతిస్వరూప్‌ భట్నాగర్‌ అవార్డుకు హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ డీఎన్‌ఏ ఫింగర్‌ ప్రింటింగ్‌(సీడీఎఫ్‌డీ) శాస్త్రవేత్త డాక్టర్‌ మద్దిక సుబ్బారెడ్డి ఎంపికయ్యారు.

3. యూరోపియన్‌ యూనియన్‌ ఈ సంవత్సరం ఆర్థిక వృద్ధి అంచనాను 1.1 శాతం నుంచి 0.8 శాతానికి, వచ్చే ఏడాది  1.6 శాతం నుంచి 1.3 శాతానికి తగ్గించింది. 

Daily Current Affairs in Telugu: 11 సెప్టెంబ‌రు 2023 క‌రెంట్ అఫైర్స్

4.  కేరళలో నిపా వైరస్‌ సోకి ఇద్దరు మృతిచెందారు.

5. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఐసీఐసీఐ బ్యాంక్ ఎండి అండ్ సీఈఓ 'సందీప్ భక్షి' (Sandeep Bakhshi)ని మరో మూడేళ్లపాటు కొనసాగడానికి ఆమోదం తెలిపింది. 

6. డోపింగ్‌ నిబంధనలను అతిక్రమించినందుకు... రొమేనియా టెన్నిస్‌ స్టార్, ప్రపంచ మాజీ నంబర్‌వన్‌ సిమోనా హాలెప్‌పై ఇంటర్నేషనల్‌ టెన్నిస్‌ ఇంటెగ్రిటీ ఏజెన్సీ (ఐటీఐఏ) నాలుగేళ్లపాటు నిషేధం విధించింది.

7. ఆగస్టులో రిటైల్ ద్రవ్యోల్బణం 7.44 శాతం నుంచి 6.83 శాతానికి త‌గ్గింది

Daily Current Affairs in Telugu: 08 సెప్టెంబ‌రు 2023 క‌రెంట్ అఫైర్స్

Published date : 14 Sep 2023 08:15AM

Photo Stories