Daily Current Affairs in Telugu: 11 సెప్టెంబరు 2023 కరెంట్ అఫైర్స్
1. న్యూఢిల్లీలో జరిగిన జి – 20 సమ్మిట్ ఆంధ్రప్రదేశ్ పెవిలియన్‌లో గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ఆధ్వర్యంలో అరకు వ్యాలీ కాఫీని ప్రదర్శించారు.
2. జీ20 సదస్సులో ఢిల్లీ డిక్లరేషన్ ఐదు అంశాలతో ఆమోదం పొందింది.
3. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ప్రయోగించిన ఆదిత్య –ఎల్1 ఉపగ్రహానికి మూడోసారి కక్ష్య దూరాన్ని విజయవంతంగా పెంపొందించింది.
Daily Current Affairs in Telugu: 08 సెప్టెంబరు 2023 కరెంట్ అఫైర్స్
4. భారత్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న జీ20 సదస్సులో 55 దేశాల సమూహమైన ఆఫ్రికా యూనియన్ వారికి జీ20లో శాశ్వత సభ్యత్వం విషయాన్ని ప్రధాని మోదీ ప్రతిపాదన చేయగా సభ్యదేశాలు ఆమోదాన్ని తెలిపాయి.
5. ఇండియా–మిడిల్‌ఈస్ట్–యూరప్ ఎకనామిక్ కారిడార్ నూతన ప్రాజెక్టును భారత్, అమెరికా, సౌదీ అరేబియా, యూఏఈ, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, యూరోపియన్ యూనియన్ దేశాల నేతలు సంయుక్తంగా ప్రకటించారు.
6. జీ20 వేదికగా భూతాపానికి, తద్వారా పర్యావరణ విధ్వంసానికి కారణమవుతున్న శిలాజ ఇంధనాల వాడకం తగ్గించుకోవాలని, ఇందుకోసం పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలిపి వాడుకునేలా ‘ప్రపంచ జీవ ఇంధనాల కూటమి’ని ప్రకటించింది.
Daily Current Affairs in Telugu: 06 సెప్టెంబరు 2023 కరెంట్ అఫైర్స్
7. ఆర్చరీ ప్రపంచకప్ ఫైనల్స్ టోర్నీలో భారత ప్లేయర్ ప్రథమేశ్ జాకర్ రజత పతకం సాధించాడు.
8. ఇండోనేసియా ఓపెన్ మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–100 టోర్నీలో భారత బ్యాడ్మింటన్ రైజింగ్ స్టార్ కిరణ్ జార్జి తన కెరీర్‌లో రెండో అంతర్జాతీయ టైటిల్‌ను సాధించాడు.
9. బీసీసీఐ బోర్డు కార్యదర్శి జై షా సచిన్ టెండూల్కర్‌కు ‘గోల్డెన్ టికెట్’ అందించారు.
10. యూఎస్ ఓపెన్ పురుషుల డబుల్స్ విభాగం ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్స్, మూడో సీడ్ రాజీవ్ రామ్ (అమెరికా)–జో సాలిస్‌బరీ (బ్రిటన్) ద్వయం వరుసగా మూడో ఏడాది యూఎస్ ఓపెన్ పురుషుల డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకుంది.
Daily Current Affairs in Telugu: 05 సెప్టెంబరు 2023 కరెంట్ అఫైర్స్