Daily Current Affairs in Telugu: 25 సెప్టెంబరు 2023 కరెంట్ అఫైర్స్

1. విశాఖ జిల్లా పశు సంవర్ధక శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్(ఏడీ)గా పనిచేస్తున్న డాక్టర్ మాదిన ప్రసాదరావు ‘ఉత్తమ విస్తరణ అధికారిగా’ జాతీయ స్థాయి అవార్డుకు ఎంపికయ్యారు.
2. ఆసియా క్రీడల్లో మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగం టీమ్ ఈవెంట్‌లో రమితా జిందాల్, మెహులీ ఘోష్, ఆశి చౌక్సీలతో కూడిన భారత జట్టు రజత పతకం సాధించింది.
3. ఆసియా క్రీడల్లో రోయింగ్‌లో పురుషుల లైట్‌వెయిట్ డబుల్ స్కల్స్ ఈవెంట్‌లో అర్జున్ లాల్ జాట్–అరవింద్ సింగ్ ద్వయం రజత పతకంతో సాధించింది.
Daily Current Affairs in Telugu: 22 సెప్టెంబరు 2023 కరెంట్ అఫైర్స్
4. ఆసియా క్రీడల్లో పురుషుల పెయిర్ విభాగంలో బాబూలాల్ యాదవ్–లేఖ్ రామ్ జోడీ కాంస్య పతకాన్ని సాధించింది.
5. అంతరిక్షంలో సేకరించిన ఆస్టరాయిడ్ తాలూకు తొలి శాంపిల్‌ను అమెరికా భూమి మీదికి తీసుకొచ్చింది.
6. 2023 వేసవి అత్యంత వేడిమితో కూడినదిగా నాసా వెల్లడించింది.
Daily Current Affairs in Telugu: 18 సెప్టెంబర్ డైలీ కరెంట్ అఫైర్స్
7. దేశంలో అమల్లో ఉన్న చట్టాలను అందరికీ సులభంగా అర్థమయ్యే రీతిలో భారతీయ భాషల్లో రచించడానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధాని మోదీ తెలిపారు.
8. భారత్–మధ్యప్రాచ్యం–యూరప్ ఆర్థిక నడవా(కారిడార్) రాబోయే కొన్ని శతాబ్దాలపాటు ప్రపంచ వాణిజ్యానికి ప్రధాన ఆధారం కాబోతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు.
Daily Current Affairs in Telugu: 16 సెప్టెంబరు 2023 కరెంట్ అఫైర్స్